రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
ఫ్లెక్స్ హైబ్రిడ్ వాహనాల మార్కెట్‌కు అపారమైన సంభావ్యత ఉత్తర్‌ప్రదేశ్‌కు ఉందిః శ్రీ నితిన్ గడ్కరీ
Posted On:
11 FEB 2023 6:34PM by PIB Hyderabad
ఇ-మొబిలిటీ, వాహనాలు & భవిష్యత్ గతిశీలతలపై సెషన్‌ను ఉద్దేశించి కేంద్ర రోడ్డు రవాణా, హైవేల మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ లక్నోలో జరుగుతున్న యుపి గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ (అంతర్జాతీయ పెట్టుబడిదారుల సదస్సు) 2023 సందర్భంగా శనివారంనాడు ప్రసంగించారు. ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ , రాష్ట్ర రవాణా మంత్రి శ్రీ దయాశంకర్ సింగ్, నీతీ ఆయోగ్ సిఇఒ శ్రీ పరమేశ్వరన్, ఇతర సీనియర్ అధికారుల సమక్షంలో ఆయన ప్రసంగించారు.
భారతదేశంలో మొత్తం నమోదు చేసుకున్న ఇవిలలో 23% శాతం కలిగిన ఉత్తర్ ప్రదేశ్ కు ఫ్లెక్స్ హైబ్రిడ్ వాహనాల మార్కెట్‌కు గొప్ప అవకాశం ఉందని శ్రీ గడ్కరీ అన్నారు. ఇ-వాహనాలు, లిథియం బ్యాటరీల ప్రముఖ ఉత్పత్తి కేంద్రాలుగా కన్పూర్, లక్నో, నాయిడా, ఘజియాబాద్, మీరట్‌లు అవసరిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.
రాష్ట్రంలో ప్రస్తుతం 740 ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తున్నాయని, త్వరలోనే అవి 5000లకు చేరుకుంటాయని చెప్పారు. ప్రభుత్వం రాష్ట్రంలో ప్రతి 150 కిమీలకు స్క్రాపింగ్ కేంద్రాలను, వెహికిల్ ఫిట్‌నెస్ కేంద్రాలను ఏర్పాటు చేస్తోందని ఆయన చెప్పారు. ఉత్తర్ ప్రదేశ్ అతి భారీ స్థాయిలో ఇథనాల్ ఉత్పత్తి చేయడమే కాక, రెండవ తరం తక్కువ కార్బన్ ఇథనాల్‌ను ప్రాథాన్యత ఆధారంగా అభివృద్ధి చేస్తోందన్నారు.
రైతులను అన్నదాతలతో పాటుగా ఊర్జదాతలుగా మారుస్తూ, నూతన భారతం ఎప్పుడూ సురక్షితమైన, పునర్వినియోగపరచగల, నిలకడైన స్వదేశీ ఉత్పత్తినే కాక మొబిలిటీ రంగంలో హరిత ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహిస్తుందని శ్రీ గడ్కరీ అన్నారు.
***
(Release ID: 1898460)
Visitor Counter : 245