రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
తాత్కాలిక రిజిస్ట్రేషన్ ద్వారా పూర్తిగా నిర్మించిన వాహనాలను దివ్యాంగులకు అనుకూలంగా మార్చడాన్ని సులభతరం చేసేందుకు ముసాయిదా నోటిఫికేషన్ జారీ
Posted On:
10 FEB 2023 12:15PM by PIB Hyderabad
తాత్కాలిక రిజిస్ట్రేషన్ ద్వారా పూర్తిగా నిర్మించిన వాహనాలను దివ్యాంగులకు అనుకూలంగా మార్చడాన్ని సులభతరం చేసేందుకు రోడ్డు రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ (ఎంఒఆర్‌టిహెచ్) జి.ఎస్.ఆర్. 90(ఇ) ని ముసాయిదా నోటిఫికేషన్‌ను 9 ఫిబ్రవరి 2023న జారీ చేసింది.
దివ్యాంగుల నిర్ధిష్ట అవసరాలకు అనుగుణంగా మోటారు వాహనాలను మార్చడం అన్నది వారి చలనశీలతను సులభతరం చేసేందుకు అవసరం అవుతుంది. ప్రస్తుతం, అలా మార్చడం అన్నది ఉత్పత్తిదారు లేక వారి అధికారిక డీలరు వాహన రిజిస్ట్రేషన్‌కు పూర్వమే చేసేవారు లేదా నమోదు చేసుకునే అధికారిక సంస్థ అనుమతి ఆధారంగా వాహన రిజిస్ట్రేషన్‌ను యాజ్- ఈజ్ పద్ధతిలో చేసేవారు.
ఈ ప్రక్రియనను సులభతరం చేసేందుకు, మోటారు వాహనాలను తాత్కాలిక రిజిస్ట్రేషన్ ఆధారంగా మార్చే సౌకర్యాని్న అందుబాటులోకి తేవడం కోసం 53ఎ, 53 బిలో సవరణలు తేవాలని ఎంఒఆర్‌టిహెచ్ ప్రతిపాదనలు చేసింది.
సవరించిన నిబంధనలకు సంబంధించిన కీలకాంశాలు ఈ విధంగా ఉన్నాయిః
1. నిబంధన 53ఎలో మార్చవలసినన పూర్తిగా నిర్మించిన మోటారు వాహనాలను కూడా కలిపేందుకు తాత్కాలిక రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకునే కారణాలను విస్తరించింది.
2. నిబంధన 53బిలోని సబ్ రూల్ 2లో ఒక అంశాన్ని జోడించేందుకు ప్రతిపాదించింది. అది, పూర్తిగా నిర్మించిన మోటారు వాహనాలను అవసరాలకు అనుగుణంగా మార్చేందుకు, డీలర్ ఉన్న రాష్ట్రం కాకుండా మరొక రాష్ట్రంలో వాహనాన్ని రిజిస్టర్ చేస్తున్నప్పుడు వారికి సౌలభ్యం కల్పించేందుకు తాత్కాలిక రిజిస్ట్రేషన్ 45రోజులపాటు చెల్లుతుంది.
ఈ సవరణలు దివ్యాంగులు మోటారు వాహనాలను నడపడాన్ని మరింత సులభతరం చేస్తాయని అంచనా.
దీనిపై అందరు భాగస్వాముల నుంచి వ్యాఖ్యలను, సూచనలను ముప్పైరోజుల లోపు పంపవలసిందిగా ఆహ్వానించడం జరిగింది.
****
(Release ID: 1898150)
Visitor Counter : 176