ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ముంబయి లోని ఛత్రపతి శివాజీ మహారాజ్     టర్మినస్ లో  ముంబయి-శోలాపుర్ వందే భారత్ మరియుముంబయి-సాయినగర్ శిర్ డీ వందే భారత్ లకు ప్రారంభ సూచక ఆకుపచ్చ జెండా ను చూపినప్రధాన మంత్రి


సాంతాక్రూఝ్-చెంబూర్ లింక్ రోడ్డు మరియు కురార్ అండర్ పాస్ ప్రాజెక్టుల ను  దేశ ప్రజల కు ఆయన అంకితం  చేశారు

‘‘రైల్ వేస్ కు మరియు మహారాష్ట్ర లో సంధానాని కి ఇది ఒక ప్రముఖమైనటువంటి రోజు; ఎందుకంటే ఒకే రోజు లో రెండు వందే భారత్ రైళ్ళ కు ఆకుపచ్చ జెండా ను చూపించడం జరిగింది’’

‘‘ఈ వందేభారత్ రైళ్ళు ఆర్థిక కేంద్రాల ను ధార్మిక కేంద్రాల తో జోడిస్తాయి’’

‘‘వందేభారత్ రైలు ఆధునిక భారతదేశం యొక్క వైభవోపేతమైన చిత్రాల లో ఒకటి గాఉంది’’

‘‘వందేభారత్ రైళ్ళు భారతదేశం యొక్క వేగాని కి మరియు విస్తృతి కి అద్దం పడుతున్నాయి’’

‘‘ఈ సంవత్సరంబడ్జెటు తో మధ్య తరగతి ని బలోపేతం చేయడమైంది’’

Posted On: 10 FEB 2023 4:45PM by PIB Hyderabad

వందే భారత్ రైళ్ళు రెండిటి కి ప్రారంభ సూచక ఆకుపచ్చటి జెండా ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న ముంబయి లోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టర్మినస్ నుండి చూపెట్టారు. ఆ రెండు రైళ్ల లో ఒకటి ముంబయి-శోలాపుర్ వందే భారత్ రైలు కాగా రెండోది ముంబయి-సాయినగర్ శిర్ డీ వందే భారత్ రైలు. ముంబయి లో రహదారి మార్గాల లో వాహనాల రాక పోక ల తాలూకు రద్దీ ని తగ్గించడం కోసం, అలాగే వాహనాల ప్రయాణాన్ని సువ్యవస్థీకృతం చేయడం కోసం ఉద్దేశించినటువంటి రెండు ప్రాజెక్టు లు అయిన సాంతాక్రూఝ్- చెంబూర్ లింక్ రోడ్డు ప్రాజెక్టు ను మరియు కురార్ అండర్ పాస్ ప్రాజెక్టు ను కూడా దేశ ప్రజల కు ప్రధాన మంత్రి అంకితం చేశారు.

 

ఛత్రపతి శివాజీ మహారాజ్ టర్మినస్ లోని 18వ నెంబర్ ప్లాట్ ఫార్మ్ కు ప్రధాన మంత్రి వచ్చీరావడం తోనే ముంబయి-సాయినగర్ శిర్ డీ వందే భారత్ రైలు ను పరిశీలించారు. రైలు సిబ్బంది తోను, రైలు పెట్ట లో ఉన్న బాలల తోను ఆయన మాట్లాడారు.

 

అక్కడ గుమికూడిన జన సమూహాన్ని ఉద్దేశించి ప్రధాన మంత్రి మాట్లాడుతూ, ఈ రోజు భారతదేశం లో రైల్ వేస్ కు ఒక విశేషమైనటువంటి రోజు. ప్రత్యేకించి మహారాష్ట్ర లో ఆధునిక సంధానం కోసం రెండు వందే భారత్ రైళ్ళ కు మొట్ట మొదటిసారి గా ఒకే రోజు న ప్రారంభ సూచక ఆకుపచ్చటి జెండాల ను చూపడం జరిగిందన్నారు. ఈ వందే భారత్ రైళ్ళు ముంబయి, పుణే వంటి ఆర్థిక కేంద్రాల ను ధార్మిక కేంద్రాల తో జోడించనున్నాయని, వీటి ద్వారా కళాశాల లకు, కార్యాలయాల కు, వ్యాపార సంబంధి కార్యాల కు, తీర్థ యాత్రల కు, వ్యావసాయిక ప్రయోజనాల కోసం ప్రయాణాలు చేసే వారికి ప్రయోజనం కలుగుతుందని ఆయన స్పష్టం చేశారు. శిర్ డీ, నాసిక్, త్రయంబకేశ్వర్, ఇంకా పంచవటి వంటి పవిత్ర స్థలాల కు వెళ్ళే వారు కొత్త వందే భారత్ రైళ్ళ తో సులభం గా ఆయా ప్రదేశాల కు చేరుకోవచ్చు, ఈ రైళ్ళు తీర్థయాత్రల తో పాటు పర్యటన కు కూడా అండదండల ను అందిస్తాయి అని ప్రధాన మంత్రి అన్నారు. ‘‘శోలాపుర్ వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు తెర మీదకు రావడం తో పంఢర్ పుర్, శోలాపుర్, అక్కల్ కోట్, ఇంకా తులజాపుర్ తీర్థయాత్ర లు మరింత గా అందుబాటు లోకి వస్తాయి’’ అని ఆయన అన్నారు.

 

వందే భారత్ రైలు ఆధునిక భారతదేశం యొక్క వైభవోపేతమైనటువంటి ముఖచిత్రం అని ప్రధాన మంత్రి అన్నారు. ‘‘ఇది భారతదేశం యొక్క వేగాని కి మరియు విస్తృతి కి అద్దం పడుతుంది’’ అని ఆయన అన్నారు. వందే భారత్ రైళ్ళ ను ప్రారంభించడం లో వేగాన్ని గురించి ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ, ఇంతవరకు దేశం లో 17 రాష్ట్రాల లోని 108 జిల్లాల ను కలుపుతూ రాక పోక లు జరిపే పది వందే భారత్ రైళ్ళు ఆరంభం అయ్యాయి అని తెలియ జేశారు. ఈ రోజు న మొదలైన అనేక ప్రాజెక్టు లు జీవించడం లో సౌలభ్యాన్నిపెంచుతాయి అంటూ ప్రధాన మంత్రి సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఎలివేటెడ్ రోడ్ ప్రాజెక్టు తూర్పు శివారు ప్రాంతాల ను మరియు పశ్చిమ శివారు ప్రాంతాల ను కలుపుతుందని, మరి అలాగే అండర్ పాస్ ఓ ముఖ్యమైన ప్రాజెక్టు అని ఆయన అన్నారు.

 

ఇరవై ఒకటో శతాబ్ది భారతదేశానికై సార్వజనిక రవాణా ను మెరుగు పరచవలసిన అవసరం ఉంది, ఎందుకంటే అది పౌరుల కు పెద్ద ఎత్తున జీవన సౌలభ్యానికి దారి తీస్తుంది అని ప్రధాన మంత్రి పునరుద్ఘాటించారు. ఆధునిక రైళ్ళ ను ప్రారంభించడం వెనుక, మెట్రో ను విస్తరించడం వెనుక మరియు నూతన విమానాశ్రయాల ను, ఇంకా నౌకాశ్రయాల ను నెలకొల్పడం వెనుక ఈ ఆలోచన విధానం ఉంది అని ఆయన ప్రముఖం గా పేర్కొన్నారు. బడ్జెటు సైతం మొట్ట మొదటిసారి గా ఈ ఆలోచన ల సరళి ని బలపరుస్తోంది. మౌలిక సదుపాయల అభివృద్ధి కోసమని ప్రత్యేకం గా 10 లక్షల కోట్ల రూపాయల ను కేటాయించడం జరిగింది. దీనిలో రైల్ వే స్ వాటా 2.5 లక్షల కోట్ల రూపాయలు గా ఉంది అని ఆయన వివరించారు. మహారాష్ట్ర కోసం రైలు బడ్జెటు ను ఇదివరకు ఎన్నడూ ఎరుగనంత గా పెంచడమైంది అని ప్రధాన మంత్రి అన్నారు. డబల్ - ఎన్ జిన్ ప్రభుత్వం యొక్క ప్రయాసల తో, మహారాష్ట్ర లో సంధానం శరవేగం గా ముందుకు సాగిపోగలదన్న ఆశ ను ఆయన వ్యక్తం చేశారు.

 

జీతాల ను అందుకొనే వర్గాల అవసరాల ను మరియు సొంతం గా వ్యాపారాలు చేసుకొంటున్న వర్గాల అవసరాల ను ఈ సంవత్సరం లో బడ్జెటు పరిష్కరించినందువల్ల ‘‘ఈ బడ్జెటు తో మధ్య తరగతి ని బలపరచడమైంది’’ అని ప్రధాన మంత్రి అన్నారు. 2 లక్షల రూపాయల కు పైగా ఆదాయం ఉన్న వ్యక్తుల కు 2014 వ సంవత్సరాని కంటె పూర్వం పన్నుల ను విధించే వారని, అయితే ఇప్పటి ప్రభుత్వం దీనిని మొదట్లో 5 లక్షల రూపాయల కు పెంచి, మరి ఈ సంవత్సరం బడ్జెటు లో 7 లక్షల రూపాయల కు పెంచింది అని ఆయన వివరించారు. ‘‘యుపిఎ ప్రభుత్వ కాలం లో 20 శాతం పన్నుల ను చెల్లించిన వర్గాలు ప్రస్తుతం ఎటువంటి పన్నుల ను చెల్లించ వలసిన పని లేదు’’ అని ప్రధాన మంత్రి అన్నారు. కొత్త గా ఉద్యోగాల లో చేరిన వ్యక్తులు ప్రస్తుతం అధిక మొత్తం లో పొదుపు చేసుకొనే అవకాశాన్ని దక్కించుకొన్నారు అని కూడా ఆయన ప్రముఖం గా ప్రకటించారు.

 

సబ్ కా వికాస్ - సబ్ కా ప్రయాస్స్ఫూర్తి ని ప్రోత్సహించేటటువంటి ఈ బడ్జెటు ప్రతి ఒక్క కుటుంబాని కి బలాన్ని ప్రసాదించడం తో పాటు ‘వికసిత్ భారత్’ (అభివృద్ధి చెందినటువంటి భారతదేశం) ను నిర్మించడం కోసం ప్రతి ఒక్కరిని ప్రోత్సహిస్తుందన్న విశ్వాసాన్ని ప్రధాన మంత్రి వ్యక్తం చేస్తూ తన ప్రసంగాన్ని ముగించారు.

 

ఈ సందర్భం లో పాలుపంచుకొన్న వారి లో మహారాష్ట్ర గవర్నరు శ్రీ భగత్ సింహ్ కోశ్యారి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఏక్ నాథ్ శిందే, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్‌ణవీస్, రైల్ వే స్ శాఖ కేంద్ర మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్, సూక్ష్మ‌, ల‌ఘు మరియు మ‌ధ్య‌త‌ర‌హా వ్యాపార సంస్థ‌ ల శాఖ కేంద్ర మంత్రి శ్రీ నారాయణ్ రాణె, సహాయ మంత్రులు శ్రీ రాందాస్ అఠావలే మరియు శ్రీ కపిల్ మోరేశ్వర్ పాటీల్, మహారాష్ట్ర ప్రభుత్వం లో మంత్రుల తో పాటు తదితరులు కూడా ఉన్నారు.

 

పూర్వరంగం

 

ముంబయి లోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టర్మినస్ లో ముంబయి-శోలాపుర్ వందే భారత్ మరియు ముంబయి-సాయినగర్ శిర్డి వందే భారత్ రెండు రైళ్ళ ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పచ్చజెండా ను చూపి, ఆ రైళ్ల ను ప్రారంభించారు. న్యూ ఇండియా కై మెరుగైనటువంటి, మరింత సమర్థం అయినటువంటి, ప్రయాణికుల కు మిత్రపూర్వకం గా ఉండేటటువంటి రవాణా సంబంధి మౌలిక సదుపాయాల ను అందించాలన్న ప్రధాన మంత్రి దార్శనికత ను సాకారం చేసే దిశ లో ఇది ఒక ముఖ్యమైన అడుగు అని చెప్పాలి.

 

ముంబయి-శోలాపుర్ వందే భారత్ రైలు దేశం లో ప్రారంభం అయ్యే తొమ్మిదో వందే భారత్ రైలు కానుంది. ఈ కొత్త ప్రపంచ శ్రేణి రైలు ముంబయి కి, శోలాపుర్ కు మధ్య సంధానాన్ని మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా శోలాపుర్ లోని సిద్ధేశ్వర్, అక్కల్ కోట్, తులజాపుర్, శోలాపుర్ కు సమీపం లో గల పంఢర్ పుర్ కు, ఇంకా పుణే కు దగ్గర లోని ఆలందీ వంటి ముఖ్యమైన తీర్థయాత్ర స్థలాల కు ప్రయాణించడాని కి మార్గాన్ని సైతం సుగమం చేస్తుంది.

 

ముంబయి-సాయినగర్ శిర్ డీ వందే భారత్ రైలు దేశం లో పరుగులు తీయబోయేటటువంటి పదో వందే భారత్ రైలు కానుంది. ఇది కూడా మహారాష్ట్ర లోని ప్రముఖ తీర్థయాత్ర కేంద్రాలైన నాశిక్, త్రయంబకేశ్వర్, సాయినగర్ శిర్ డీ, ఇంకా శని శింగణాపుర్ లకు సంధానాన్ని మెరుగు పరచనుంది.

 

ముంబయి లో రహదారుల మీద వాహనాల రాకపోకల తాలూకు రద్దీ ని కాస్త తగ్గుముఖం పట్టించడం కోసం సాంతాక్రూఝ్-చెంబూర్ లింక్ రోడ్డు (ఎస్ సిఎల్ఆర్) ను మరియు కురార్ అండర్ పాస్ ను ప్రధాన మంత్రి దేశ ప్రజల కు అంకితం చేయనున్నారు. కుర్ లా నుండి వకోలా, ఇంకా ఎమ్ టిఎన్ఎల్ జంక్షన్ వరకు, బికెసి నుండి కుర్ లా లోని ఎల్ బిఎస్ ఫ్లయ్ ఓవర్ వరకు సాగిపోయే ఎలివేటెడ్ కారిడార్ ను కొత్తగా నిర్మించడం జరిగింది. ఇది నగరం లో తూర్పు ప్రాంతానికి మరియు పశ్చిమ ప్రాంతానికి మధ్య కనెక్టివిటీ ని పెంపొందింప చేయడానికి తోడ్పడనుంది. ఈ రాస్తాలు వెస్టర్న్ ఎక్స్ ప్రెస్ హైవే (డబ్ల్యుఇహెచ్) నను ఈస్టర్న్ ఎక్స్ ప్రెస్ హైవే తో కలిపి తద్వారా తూర్పు శివారు ప్రాంతాల ను మరియు పడమర శివారు ప్రాంతాల ను చక్కగా సంధానించ గలుగుతాయి. కురార్ అండర్ పాస్ అనేది డబ్ల్యుఇహెచ్ తాలూకు ట్రాఫిక్ సమస్యల ను తగ్గించడం లో ఎంతో కీలకమైన పాత్ర ను పోషించేటటువంటి ప్రాజెక్టు. ఇది డబ్ల్యుఇహెచ్ లో మలాడ్ ను, కురార్ ను జతపరుస్తుంది. ఈ అండర్ పాస్ వల్ల ప్రజలు సులభం గా రోడ్డు ను దాటి పోగలుగుతారు. అంతేకాదు, వాహనాలు డబ్ల్యుఇహెచ్ మీది భారీ ట్రాఫిక్ లోకి చేరే అగత్యం లేకుండానే పయనించగలుగుతాయి.

*****

DS/TS


 

 


(Release ID: 1898140) Visitor Counter : 179