సూక్ష్మ‌, లఘు, మధ్య త‌ర‌హా సంస్థల మంత్రిత్వ శాఖష్
azadi ka amrit mahotsav

ఖాదీ అనుబంధ కార్మికుల ఆదాయాన్ని పెంచేలా కేవీఐసీ చారిత్రాత్మక నిర్ణయం

Posted On: 09 FEB 2023 2:02PM by PIB Hyderabad

2023 జనవరి 30న గుజరాత్‌లోని కచ్‌ ప్రాంతంలో ‘ఖాదీ మరియు విలేజ్ ఇండస్ట్రీస్ కమీషన్’ (కేవీఐసీ) 694వ సమావేశం జరిగింది. ఖాదీ మరియు విలేజ్ ఇండస్ట్రీస్ కమీషన్ ఛైర్మన్ శ్రీ మనోజ్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. ప్రధాన మంత్రి ఇచ్చిన స్ఫూర్తితో.. ఖాదీ పత్తి-నేత కార్మికుల సహకారాన్ని దృష్టిలో ఉంచుకుని, చేతి వృత్తుల వారి నెలవారీ ఆదాయం సుమారు 33% మరియు నేతl కార్మికుల వేతనాలలో 10%  పెంచడం ద్వారా ఆదాయ ఉత్పత్తి కోసం.. హాంక్‌కు చెల్లిస్తున్న వేతనాన్ని  రూ.7.50 నుండి రూ.10కి పెంచాలని నిర్ణయించారు. ఈ నిర్ణయం ఏప్రిల్ 1, 2023 నుండి అమలులోకి వస్తుంది. స్వదేశీయతను ప్రోత్సహించాలని  ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ జాతీయ మరియు అంతర్జాతీయ వేదికలపై నిరంతరం విజ్ఞప్తి చేస్తూ వస్తున్నారు. ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల ఉత్పత్తులను కొనుగోలు చేయాలని, పేదవారి చేతికి పని కల్పించి వారి ఆదాయాన్ని పెంచే లక్ష్యంతో ముందుకు సాగాలని ఆయన అందరికీ సూచిస్తూ వస్తున్నారు. ఫలితంగా మన చేతివృత్తుల వారి చేతికి మరింత ఆదాయం సమకూరుతుంది.

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన రేడియో ప్రసార కార్యక్రమం "మన్ కీ బాత్" ద్వారా ఖాదీ ఉత్పత్తులను వినియోగించాలని కోరారు..  "ముఖ్యంగా యువత" ఖాదీ ఉత్పత్తులను కొనాలని చాలా సార్లు విజ్ఞప్తి చేశారు. దీంతో ఖాదీ ఉత్పత్తుల విక్రయాలు ఏటా రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఖాదీని మళ్లీ మళ్లీ ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి "ఖాదీ ఫర్ నేషన్..  ఖాదీ ఫర్ ఫ్యాషన్ మరియు ఖాదీ ఫర్ ట్రాన్స్‌ఫర్మేషన్" అనే నినాదంతో ఖాదీని స్వీకరించడం మరియు ఖాదీ యొక్క ఉత్పత్తి మరియు అమ్మకాలను పెంచడానికి సాధ్యమైన ప్రతి ప్రయత్నాన్ని ప్రధాన మంత్రి ప్రశంసిస్తున్నారు.

ప్రధాని ప్రోత్సాహంతో రికార్డు స్థాయిలకు..

ఈ సందర్భంగా కేవీఐసీ చైర్మన్ శ్రీ మనోజ్ కుమార్ మాట్లాడుతూ 2021-2022 ఆర్థిక సంవత్సరంలో ఖాదీ, గ్రామీణ పరిశ్రమల ఉత్పత్తుల ఉత్పత్తి రూ.84,290 కోట్లు కాగా, రూ.1,15,415 కోట్ల విక్రయాలు జరిగాయి. ఈ సంవత్సరం అక్టోబర్ 2వ తేదీన, ఖాదీ ఇండియాకు చెందిన సీపీ అవుట్‌లెట్ ఒకే రోజు రూ.1.34 కోట్ల అమ్మకాలతో ఖాదీ విక్రయాల్లో సరికొత్త రికార్డును నెలకొల్పింది.  ఖాదీని కొనుగోలు చేయాలని దేశ ప్రజలకు, ఖాదీ ఉత్పత్తి మరియు విక్రయాల పనిలో నిమగ్నమైన లక్షలాది మంది చేనేతకారులు మరియు ఖాదీ కార్మికులకు మేలు జరిగేలా చూసేందుకు  అవిశ్రాంతంగా శ్రమిస్తున్న మన విశిష్ట ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.. దేశ ప్రజలకు చేసిన పిలుపునకే ఈ ఘనత దక్కుతుందని అన్నారు. గ్రామ స్థాయిలో ఖాదీ కార్మికులను ప్రోత్సహించడం మరియు ఖాదీ ఉత్పత్తిని పెంపొందించడం, ఫలితంగా సరైన ఉపాధిని సృష్టించడం ద్వారా గ్రామీణ-ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం వంటి లక్ష్యంతో, కేవీఐసీ గత కొన్ని నెలలుగా ఖాదీ కార్మికులు, ఖాదీలతో ఖాదీ సంవాద్ సిరీస్‌ను నిర్వహించింది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న సంస్థలు ,  వారి సమస్యను అర్థం చేసుకోవడానికి మరియు వారిలో కొత్త శక్తిని నింపడానికి ప్రధాని నేరుగా వారితో సంభాషించారని తెలిపారు.  'ఖాదీసంవాద్' సందర్భంగా ఖాదీ రంగంలోని స్పిన్నర్లు, నేత కార్మికులు ఖాదీ ఉత్పత్తిని పెంచడంలో విశేష కృషి చేశారని, వారి పారితోషికం పెంచాలనే డిమాండ్ కూడా దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉందని ఆయన అన్నారు. ఈ డిమాండ్ తీవ్రంగా పరిగణించబడిందని. ఈ కేవీఐసీ యొక్క 694 సమావేశంలో  ఈ దిశగా నిర్ణయంలో తీసుకోబడింది.

చైర్మన్ శ్రీ మనోజ్ కుమార్ ఛైర్మన్ షిప్ ఆధ్వర్యంలో వారి ఆదాయాన్ని పెంచడానికి మరియు ఎక్కువ మంది దేశస్థులను ఖాదీ వైపు ఆకర్షించడానికి వేతనాలను 33 శాతం పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. ఖాదీ కార్మికులు మరియు ఖాదీ సంస్థల ఈ డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకుని, కేవీఐసీ తన 694వ సమావేశంలో ఖాదీ-విలేజ్ ఇండస్ట్రీస్ ప్రోగ్రామ్‌తో అనుబంధ కార్మికులకు  గరిష్టంగా డబ్బు అందించాలని, వారి ఆదాయ వనరులను పెంచాలని మరియు వారి ఆర్థిక స్థితిని మెరుగుపరచాలని నిర్ణయించింది. ఈ చారిత్రాత్మక నిర్ణయం బలమైన, సుసంపన్నమైన మరియు స్వావలంబన భారతదేశాన్ని నిర్మించడంలో సహాయపడుతుంది. ఖాదీని ప్రపంచానికి స్థానికంగా మార్చడానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గత 9 సంవత్సరాలలో ఖాదీ పట్ల తనకున్న ప్రేమతో ఖాదీని వివిధ మార్గాల ద్వారా  పునరుద్ధరించారు. ఖాదీతో సహా భారతదేశపు స్వదేశీ ఉత్పత్తులకు డిమాండ్ పెరిగిన ఫలితంగా ఈ నిర్ణయంతో ఖాదీ రంగంలో సంతోషం వెల్లివిరిసింది, ఖాదీ రంగంలో మరింత ఎక్కువ ఉపాధిని సృష్టించే గొప్ప ప్రోత్సాహం ఉంటుంది.

********


(Release ID: 1897848) Visitor Counter : 217