పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
‘ఆర్సీఎస్ ఉడాన్’ పథకం కింద అస్సాంలో పలు హెలికాప్టర్ మార్గాలను ప్రారంభించిన ‘పవన్ హన్స్’
Posted On:
09 FEB 2023 3:23PM by PIB Hyderabad
అస్సాం రాష్ట్రంలో పవన్ హన్స్ లిమిటెడ్ సంస్థ తన హెలికాప్టర్ సేవలను ప్రారంభించింది. ఫిబ్రవరి 8, 2023న ఈ సేవలను ప్రారంభించింది. ఆర్సీఎస్ ఉడాన్ పథకం కింద ఈ సేవలను సంస్థ ప్రారంభించింది ప్రారంభించింది. ఈ కొత్త హెలికాప్టర్ సేవలు “దిబ్రూఘర్-జోర్హాట్-తేజ్‌పూర్-గౌహతి-తేజ్‌పూర్-జోర్హాట్ దిబ్రూగర్” మార్గంలో కనెక్టివిటీని అందిస్తాయి.
ఈ క్రింది మార్గాలు షెడ్యూల్ ప్రకారం సేవలు నిర్వహించబడతాయి:
సెక్టారు
|
సేవలు అందుబాటులో
ఉండే రోజులు
|
ప్రయాణం మొదలయ్యే
సమయం
|
గమ్య స్థానం
చేరు సమయం
|
దిబ్రూఘర్
|
జోర్హాట్
|
సోమ, బుధ, శుక్ర
|
0850 గం.
|
0935 గం.
|
జోర్హాట్
|
తేజ్‌పూర్
|
సోమ, బుధ, శుక్ర
|
0950 గం.
|
1040 గం.
|
తేజ్‌పూర్
|
గౌహతి
|
సోమ, బుధ, శుక్ర
|
1055 గం.
|
1145గం.
|
గౌహతి
|
తేజ్‌పూర్
|
సోమ, బుధ, శుక్ర
|
1215 గం.
|
1305 గం.
|
తేజ్‌పూర్
|
జోర్హాట్
|
సోమ, బుధ, శుక్ర
|
1320 గం.
|
1410 గం.
|
జోర్హాట్
|
దిబ్రూఘర్
|
సోమ, బుధ, శుక్ర
|
1425 గం.
|
1510 Hrs
|
పౌర విమానయాన మంత్రిత్వ శాఖ యొక్క ఆర్సీఎస్ ఉడాన్ పథకం రైలు మరియు రోడ్డు అనుసంధానం సరిగ్గా లేని ఈశాన్య రాష్ట్రాలలోని మారుమూల ప్రాంతాలకు విమాన కనెక్టివిటీని అందించడానికి ప్రత్యేక ప్రోత్సాహాన్ని అందిస్తోంది. అస్సాం రాష్ట్రంలో ఆర్సీఎస్ ఉడాన్ హెలికాప్టర్ సేవలు.. రాష్ట్ర రాజధాని నుండి తేజ్‌పూర్, జోర్హాట్ మరియు దిబ్రూగఢ్‌లను కనెక్ట్ చేయడానికి వేగవంతమైన ప్రయాణ విధానాన్ని అందించడం ద్వారా రాష్ట్రంలో ఎయిర్-కనెక్టివిటీని పెంచుతాయి. రాష్ట్రంలో పర్యాటక కార్యకలాపాలను ప్రోత్సహించడంలో హెలికాప్టర్ సేవలు కీలక పాత్ర పోషిస్తాయి. ఆర్సీఎస్ ఉడాన్ సేవల కోసం, పవన్ హన్స్ 11 మంది ప్రయాణికుల సీటింగ్ సామర్థ్యం కలిగిన ఒక ట్విన్ ఇంజన్ డౌఫిన్ హెలికాప్టర్‌ను ఏర్పాటు చేసింది. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఆర్సీఎస్ ఉడాన్ సేవలు నిర్వహించబడుతున్నాయి. సరసమైన విమాన ఛార్జీలను అందించడం ద్వారా ప్రాంతీయ ఎయిర్-కనెక్టివిటీని ప్రోత్సహించడానికి ఇది దోహదం చేస్తోంది.
గౌహతి విమానాశ్రయంలో ఆర్సీఎస్ ఉడాన్ హెలికాప్టర్ కార్యకలాపాల ప్రారంభోత్సవం అస్సాం ప్రభుత్వ అదనపు ప్రధాన కార్యదర్శి శ్రీ మణిందర్ సింగ్ సమక్షంలో జరిగింది. అస్సాం ప్రభుత్వ పర్యటక శాఖ కార్యదర్శి శ్రీ కుమార్ పద్మపాణి బోరా, ఏఏఐ రీజనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ షన్ముఖ్ జుగాని, పవన్ హన్స్ సంస్థ జనరల్ మేనేజర్ శ్రీ సంజయ్ కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
***
(Release ID: 1897847)
Visitor Counter : 182