కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

దేశంలో 5జీ సేవలు విస్తరణ

Posted On: 08 FEB 2023 1:41PM by PIB Hyderabad

టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు (టి.ఎస్.పి.లు) 01.10.2022 నుండి దేశంలో 5జీ సేవలను అందించడం ప్రారంభించారు. 31.01.2023 నాటికి, అన్ని లైసెన్స్ సేవా ప్రాంతాలలోని 238 నగరాల్లో 5జీ సేవలు ప్రారంభించబడ్డాయి. 5జీ సేవలను అందుబాటులోకి తెచ్చే బాధ్యతలో భాగంగా దేశంలోని వివిధ ప్రాంతాలలో 5G టెలికాం సేవలను అందుబాటులోకి తేవడానికి  ప్రభుత్వం రోడ్ మ్యాప్‌ను సిద్ధం  చేసింది. స్పెక్ట్రమ్ వేలం మరియు లైసెన్స్ షరతుల కోసం 15-06-2022 నాటి నోటీసు ఆహ్వానిత దరఖాస్తు (ఎన్ఐఏ) ప్రకారం, స్పెక్ట్రం కేటాయింపు తేదీ నుండి దశలవారీగా ఐదేళ్ల వ్యవధిలో టి.ఎస్.పిలు రోల్ అవుట్ బాధ్యతలను నెరవేర్చాల్సి ఉంటుంది.  తప్పనిసరి రోల్‌అవుట్ బాధ్యతల కంటే మొబైల్ నెట్‌వర్క్‌ల మరింత విస్తరణ టెలికాం సర్వీస్ ప్రొవైడర్ల (టీ.ఎస్.పిల) సాంకేతిక-వాణిజ్య పరిశీలనపై ఆధారపడి ఉంటుంది. ఈ రోజు లోక్‌సభకు లిఖిత పూర్వకంగా ఇచ్చిన సమాధానంలో సమాచార ప్రసార శాఖల సహాయ మంత్రి శ్రీ దేవుసిన్హ చౌహాన్ ఈ సమాచారాన్ని అందించారు.

***



(Release ID: 1897535) Visitor Counter : 149