పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
మిషన్ లైఫ్ ఆన్‌లైన గ్రీన్ టాక్ సిరీస్ - జ్ఞాన్ విజ్ఞాన్ ఔర్ హమ్ పేరుతో గ్రీన్ టాక్స్ సిరీస్
Posted On:
08 FEB 2023 1:54PM by PIB Hyderabad
మిషన్ లైఫ్ అవగాహనా కార్యక్రమంలో భాగంగా, నాచురల్ హిస్టరీ జాతీయ మ్యూజియం, పర్యావరణం, అడవులు, పర్యావరణ మార్పు మంత్రిత్వ శాఖ 06 నుంచి 10 ఫిబ్రవరి 2023 వరకు ఐదు రోజుల పాటు జ్ఞాన్ విజ్ఞాన్ ఔర్ హమ్ పేరుతో గ్రీన్ టాక్స్ సిరీస్‌ను నిర్వహిస్తోంది.
ఫిబ్రవరి 6న దేశం నలుమూలల నుంచి వచ్చిన ఇతర విద్యార్ధులతో కలిసి జమాల్‌పూర్, ఫజీల్‌పూ్ బద్లీ (హర్యానా)కు చెందిన విద్యార్ధులు డిజిటల్ లైబ్రరీల నుంచి పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రముఖ పరిశోధనా సంస్థలకు చెందిన శాస్త్రవేత్తలు ఉపన్యాసాలను ఇస్తున్నారు. తదనంతరం విద్యార్ధుల సందేహాలను తీరుస్తూ ముచ్చటిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని పర్యావరణానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలపై అవగాహనను సృష్టించే లక్ష్యంతో నిర్వహిస్తున్నారు.
***
(Release ID: 1897533)
Visitor Counter : 219