సూక్ష్మ‌, లఘు, మధ్య త‌ర‌హా సంస్థల మంత్రిత్వ శాఖష్
azadi ka amrit mahotsav

PMEGP పథకం కింద పశ్చిమ ప్రాంతంలో పంపిణీ అయిన సబ్సిడీ మొత్తం లోన్ రూ. 304.65 కోట్లు & రూ.100.55 కోట్లు మార్జిన్ మనీ


సంస్థను స్థాపించడం ద్వారా స్వయం ఉపాధి మరియు స్వావలంబన దిశగా అడుగులు

Posted On: 08 FEB 2023 10:17AM by PIB Hyderabad

స్వావలంబన భారతదేశం వైపు మరో ముందడుగు వేస్తూఖాదీ మరియు గ్రామ పరిశ్రమల కమీషన్ ఛైర్మన్ శ్రీ మనోజ్ కుమార్పశ్చిమ ప్రాంతంలోని 1463 మంది లబ్ధిదారులకు (గోవామహారాష్ట్రగుజరాత్డామన్ మరియు డయ్యూదాద్రా-నగర్ హవేలీ) రూ. 100.55 కోట్ల మార్జిన్ మనీ సబ్సిడీని పంపిణీ చేశారు. మంజూరైన రూ. 304.65 కోట్ల రుణం నుంచిఇందులో ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం కింద మహారాష్ట్ర రాష్ట్రంలోని 654 మంది లబ్ధిదారులకు మార్జిన్ మనీ గ్రాంట్ మొత్తం రూ. 24.38 కోట్లు పంపిణీ చేశారు. KVIC అనేది భారత ప్రభుత్వ ఉపాధి-ఆధారిత ప్రధాన పథకం.

 

ఈ సందర్భంగా కెవిఐసి చైర్మన్ ప్రసంగిస్తూ ప్రధానమంత్రి స్వయం సమృద్ధి భారత్ కల సాకారం చేయడంలో ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం కీలక పాత్ర పోషిస్తోందన్నారు. ఖాదీ మరియు గ్రామ పరిశ్రమల కమీషన్ చేపట్టే వివిధ కార్యక్రమాల ద్వారా చాలా తక్కువ ఖర్చుతో మారుమూల ప్రాంతాల్లోని చేతివృత్తుల వారికి ఉపాధి అవకాశాలను కల్పిస్తోంది. KVIC యొక్క గ్రామోద్యోగ్ వికాస్ యోజన కింద కుమ్హర్ సశక్తికరణ్ యోజనహనీ మిషన్చార్మ్ కరిగర్ సశక్తికరణ్ యోజనఅగరబత్తుల తయారీవంటి పథకాల ద్వారా అధునాతన శిక్షణ మరియు టూల్ కిట్‌లను అందించడం ద్వారా మరింత మంది కళాకారుల ఆర్థిక మరియు సామాజిక స్థితిని మెరుగుపరచడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. వీటిలో హ్యాండ్‌మేడ్ పేపర్ వంటి పర్యావరణసహితమైన పథకాలు కూడా ఉన్నాయని శ్రీ మనోజ్ కుమార్ అన్నారు.

 

సంపన్నమైనబలమైనస్వావలంబన మరియు సంతోషకరమైన దేశాన్ని నిర్మించడానికిచైర్మన్ KVIC వారి యూనిట్లను విజయవంతంగా నడిపే విధంగా ఈ సందర్భంగా మంత్రి లబ్ధిదారులను ప్రేరేపించారు. ఇది నిరుద్యోగ యువతను ప్రేరేపిస్తుంది. స్వావలంబన ద్వారా  "ఉద్యోగార్ధులకు బదులుగాఉద్యోగ ప్రదాతగా ఉండండి" అన్నది భారతదేశ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ జి అందించిన నినాదం. గ్రామీణపట్టణ ప్రాంతాల్లోని నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడంలో భారత ప్రభుత్వం రూపొందించిన ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం కీలక పాత్ర పోషిస్తుండడం గమనార్హం. ఈ పథకం కిందఏ పారిశ్రామికవేత్త అయినా తయారీ రంగంలో రూ. 50 లక్షల వరకు మరియు సేవా రంగంలో రూ. 20 లక్షల వరకు యూనిట్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ యూనిట్ల స్థాపన కోసంమొత్తం ప్రాజెక్ట్ వ్యయంలో 15% నుండి 25% పట్టణ ప్రాంతాల్లో లబ్ధిదారులకు మరియు 25% నుండి 35% గ్రామీణ ప్రాంతాల్లో భారత ప్రభుత్వం మంజూరు చేస్తుంది. దీనితో పాటులబ్ధిదారులను స్థాపించిన వ్యవస్థాపకులుగా చేయడానికి రుణ ఆమోదం పొందిన తర్వాత వారికి ఉచిత వ్యవస్థాపకత అభివృద్ధి శిక్షణ కూడా అందిస్తుంది.

 

కార్యక్రమంలోచైర్మన్ KVIC ప్రాంతంలో కొనసాగుతున్న ఖాదీ మరియు గ్రామ పరిశ్రమల కార్యకలాపాల ప్రచారం కోసం ఏర్పాటు చేసిన “ఖాదీ సంవాద్” చర్చలో ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల కళాకారులుసంస్థ ప్రతినిధులు మరియు వ్యవస్థాపకులతో కలిసి కాసేపు సంభాషించారు. అలాగే వారితో కలిసి ఉత్సాహభరితమైన వాతావరణంలో భోజనం చేశారు.

 

ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని ప్రముఖులుపీఎంఈజీపీ లబ్ధిదారులుఖాదీగ్రామీణ పరిశ్రమల సంస్థల ప్రతినిధులుకేవీఐసీ అధికారులు.. తదితరులు అందరూ పాల్గొన్నారు.

***


(Release ID: 1897311) Visitor Counter : 215