ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ప్రాణాంతక వ్యాధులను ముందస్తుగా గుర్తించడంపై నవీకరణ


707 జిల్లా ఎన్సీడి క్లినిక్‌లు, 193 జిల్లా కార్డియాక్ కేర్ యూనిట్లు, 268 డే కేర్ సెంటర్‌లు, 5541 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు సంక్రమేతర వ్యాధులు (ఎన్సీడి) క్లినిక్‌లు క్యాన్సర్, డయాబెటిస్, కార్డియోవాస్కులర్ డిసీజెస్ (పిడిసిఎస్ వ్యాధులు) నివారణ, నియంత్రణ కోసం
జాతీయ కార్యక్రమం కింద ఏర్పాటు

జాతీయ ఆరోగ్య మిషన్ కింద జనాభా ఆధారిత చొరవ, సమగ్ర ప్రాథమిక ఆరోగ్య సంరక్షణలో
అంతర్భాగమైన సాధారణ సంక్రమేతర వ్యాధుల నివారణ, నియంత్రణ, స్క్రీనింగ్‌పై దృష్టి సారిస్తుంది.కేంద్రీకరణ

Posted On: 07 FEB 2023 3:31PM by PIB Hyderabad

ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్ హెచ్ ఎం)లో భాగంగా క్యాన్సర్, డయాబెటిస్, కార్డియోవాస్కులర్ వ్యాధులు, స్ట్రోక్ (ఎన్పీపిడిసిఎస్) నివారణ నియంత్రణ కోసం జాతీయ కార్యక్రమం కింద రాష్ట్రాలు/యుటీలకు సాంకేతిక, ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. రాష్ట్రాలు/యూటీల నుండి స్వీకరించిన ప్రతిపాదనలు  వనరులకు లోబడి ఉంటాయి. క్యాన్సర్  ఎన్పీపిడిసిఎస్ లో అంతర్భాగం. ఈ కార్యక్రమం మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం, మానవ వనరుల అభివృద్ధి, ఆరోగ్య కార్యక్రమాల ప్రోత్సాహం, అవగాహన కల్పన, స్క్రీనింగ్, ముందస్తు రోగ నిర్ధారణ, నిర్వహణ, క్యాన్సర్‌తో సహా  సంక్రమేతర వ్యాధుల ( ఎన్సీడిలు) చికిత్స కోసం తగిన స్థాయి ఆరోగ్య సంరక్షణ సదుపాయాన్ని సూచించడంపై దృష్టి పెడుతుంది.  ఎన్పీపిడిసిఎస్ ఆధ్వర్యంలో 707 జిల్లా  ఎన్సీడి క్లినిక్‌లు, 193 జిల్లా కార్డియాక్ కేర్ యూనిట్లు, 268 డే కేర్ సెంటర్లు, 5541 కమ్యూనిటీ హెల్త్ సెంటర్  ఎన్సీడి  క్లినిక్‌లు ఏర్పాటు అయ్యాయి. . 

సాధారణ  ఎన్సీడి ల నివారణ, నియంత్రణ, స్క్రీనింగ్ కోసం జనాభా-ఆధారిత చొరవ అంటే మధుమేహం, రక్తపోటు మరియు సాధారణ క్యాన్సర్‌ల కోసం ఎన్ హెచ్ ఎం క్రింద, సమగ్ర ప్రాథమిక ఆరోగ్య సంరక్షణలో భాగంగా దేశంలో ప్రారంభం అయింది. ఈ చొరవ కింద, 30 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తులు మూడు సాధారణ క్యాన్సర్‌లు అంటే నోటి, రొమ్ము, గర్భాశయ ముఖద్వార స్క్రీనింగ్  లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ సాధారణ  క్యాన్సర్‌లను పరీక్షించడం అనేది ఆయుష్మాన్ భారత్ - హెల్త్ అండ్ వెల్‌నెస్ సెంటర్‌ల క్రింద సర్వీస్ డెలివరీలో అంతర్భాగం.
 

ఆయుష్మాన్ భారత్- ఆరోగ్యం మరియు సంరక్షణ కేంద్రాలు (ఏబి-హెచ్ డబ్ల్యూ సిలు), ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ సేవలను ఎంపిక చేసిన వాటి నుండి సమగ్ర ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ (సిపిహెచ్సి) కి విస్తరించిన ఎన్సీడీ సేవలతో సహా సమాజానికి దగ్గరగా ఉన్నాయి. ఆయుష్మాన్ భారత్ హెల్త్ వెల్నెస్ సెంటర్ పథకం ద్వారా సమగ్ర ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ కింద క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల నివారణ అంశం సామాజిక స్థాయిలో వెల్‌నెస్ కార్యకలాపాలు,  లక్షిత కమ్యూనికేషన్‌ను ప్రోత్సహించడం ద్వారా బలోపేతం చేయడం అవుతుంది.

30 జనవరి 2023 నాటికి, 1,56,332 హెల్త్ & వెల్‌నెస్ సెంటర్‌లు పని చేస్తున్నాయి, ఇందులో 1,25,602 ఉప-ఆరోగ్య కేంద్రాల స్థాయి, ఏబీ-హెచ్డబ్ల్యూసి లు, 23,512 ప్రాథమిక ఆరోగ్య కేంద్రం స్థాయి  ఏబి-హెచ్ డబ్ల్యూ సి  లు,  7,218 అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ లెవెల్ లు ఉన్నాయి. -  ఏబి-హెచ్ డబ్ల్యూ సి  పోర్టల్, 30 జనవరి 2023 నాటికి). రాష్ట్రాలు/యూటీల వారీగా ఆరోగ్యం మరియు ఆరోగ్య కేంద్రాల వివరాలు https://ab-hwc.nhp.gov.in/home/satewisereport/లో అందుబాటులో ఉన్నాయి.
 

కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ ఈరోజు రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానంలో ఈ విషయాన్ని తెలిపారు.

 

****


(Release ID: 1897233)
Read this release in: English , Urdu , Marathi , Tamil