సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ
సమ్మిళిత అభివృద్ధి మీద ప్రభుత్వం దృష్టి
పేద, అట్టడుగు వర్గాలకు వివిధ పథకాల అమలు జరుగుతోంది
ఎస్సీ, ఓబీసీ, ఈబీసీల సంక్షేమానికి గత 5 ఏళ్లలో బీహార్ కు రూ. 1042 కోట్ల మంజూరు
Posted On:
07 FEB 2023 4:56PM by PIB Hyderabad
భారత ప్రభుత్వం సబ్ కా సాథ్, సబ్ కా వికాస్ కు కట్టుబడి సమ్మిళిత అభివృద్ధి మీద దృష్టి సారించింది. ఈ క్రమంలోనే దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న ప్రజల అభ్యున్నతి కోసం అనేక చర్యలు తీసుకుంటోంది. ఈ శాఖ కూడా పేదరిక నిర్మూలనకు, షెడ్యూల్డ్ కులాలు, ఇతర వెనుకబడిన తరగతులతో బాటు సీనియర్ సిటిజెన్లు, ట్రాన్స్ జెండర్లు, డీ నోటిఫై చేసిన సంచార జాతులు, పాక్షిక సంచార జాతులు, బిచ్చగాళ్ల సామాజిక, ఆర్థిక అభివృద్ధికి అనేక పథకాలు అమలు చేస్తోంది. ఈ పథకాలలో జీవనోపాధి కల్పన, నైపుణ్యాభివృద్ధికిసంబంధించిన కార్పొరేషన్లు పనిచేస్తున్నాయి. రకరకాల స్కాలర్ షిప్పులు, హాస్టళ్ల ద్వారా విద్యారంగంలో సాధికారతకు, ఎస్సీల అభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తోంది. అదే విధంగా సీనియర్ సిటిజెన్ల కోసం వృద్ధాశ్రమాలు, ట్రాన్స్ జెండర్ల ఆశ్రమాలు, కులాంతర వివాహాలకు ఆర్థిక ప్రోత్సాహకాలు లాంటివి కూడా అందులో భాగాలే. అదే విధంగా పౌర హక్కుల పరిరక్షణ చట్టం, 1955 కింద అస్పృశ్యత పాటించే వారిని శిక్షించటం, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల మీద ఆత్యాచారాల నిరోధక చట్టం, 1989 ద్వారా ఆ కులాల వారిమీద అత్యాచారాలను నిరోధించటం, అలాంటి నేరాలను ప్రత్యేక కోర్టుల ద్వారా విచారణ జరిపించటం, బాధితులకు సహాయ, పునరావాస కార్యక్రమాలు చేపట్టటం కూడా ఇందులో భాగమే.
గడిచిన ఐదేళ్ల కాలంలో షెడ్యూల్డ్ కులాలు, ఇతర వెనుకబడిన తరగతులు, ఆర్థికంగా వెనుకబడిన తరగతుల సంక్షేమానికి బీహార్ రాష్ట్రానికి రూ.1042.786 కోట్లు మంజూరయ్యాయి.
సామాజిక న్యాయం, సాధికారత శాఖ సహాయ మంత్రి శ్రీ నారాయణ స్వామి ఈ రోజు లోక్ సభకు ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానంలో ఈ సమాచారం అందజేశారు. .
***
(Release ID: 1897128)
Visitor Counter : 234