ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ
తన పథకాల ద్వారా ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ మంత్రిత్వ శాఖ (ఎంఒఎఫ్‌పిఐ - ఆహార శుద్ధి, తయారీ ప్రక్రియ) దేశవ్యాప్తంగా బలమైన ఫుడ్ ప్రాసెసింగ్/ పరిరక్షణ మౌలిక సదుపాయాలను ప్రభావవంతమైన సరఫరా లంకెను బలోపేతం చేయడం ద్వారా పంటానంతర నష్టాలు& ఉత్పత్తి, ప్రాసెసింగ్ మధ్య ఉన్న అంతరాన్ని తగ్గిస్తున్న ఆహార పరిశ్రమల మంత్రిత్వ శాఖ
Posted On:
07 FEB 2023 2:20PM by PIB Hyderabad
తన పథకాల ద్వారా ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ మంత్రిత్వ శాఖ (ఎంఒఎఫ్‌పిఐ - ఆహార శుద్ధి, తయారీ ప్రక్రియ) దేశవ్యాప్తంగా బలమైన ఫుడ్ ప్రాసెసింగ్/ పరిరక్షణ మౌలిక సదుపాయాలను ప్రభావవంతమైన సరఫరా లంకెను బలోపేతం చేయడం ద్వారా పంటానంతర నష్టాలు& ఉత్పత్తి, ప్రాసెసింగ్ మధ్య ఉన్న అంతరాన్ని తగ్గిస్తుంది. ప్రధానమంత్రి కిసాన్ సంపద యోజన (పిఎంకెఎస్‌వై) అన్న కేంద్ర రంగ గొడుగు పథకాన్ని 2016-17 నుంచి ఎంఒఎఫ్‌పిఐ అము చేస్తోంది. పిఎంకెఎస్‌వై గల కాంపొనెంట్ పథకాల ఫలితంగా దాదాపు 194 లక్షల మెట్రిక్ టన్నుల పరిరక్షణ & ప్రాసెసింగ్ సామర్ధ్యాన్ని సృష్టించడంలో సఫలమైంది.
లోక్‌సభలో అడిగిన ఒక ప్రశ్నకు లిఖితపూర్వకంగా ఇస్తూ కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల సహాయ మంత్రి శ్రీ ప్రహ్లాద్ సింగ్ పటేల్ వెల్లడించారు. ఆత్మనిర్భర్ భారత్ అభియాన్‌లో భాగంగా ఎంఒఎఫ్‌పిఐ కేంద్ర ప్రాయోజిత పిఎం ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్‌ప్రైజెస్ (పిఎంఎఫ్ఎంఇ ) పథకాన్ని 2020-21 నుంచి మైక్రోఫుడ్ ప్రాసెసింగ్ సంస్థలకు ఆర్ధిక, సాంకేతిక, వ్యాపార మద్దతునిచ్చేందుకు పని చేస్తోంది. నేటివరకూ లబ్దిదారులు చేసుకునన్న దరఖాస్తులలో 18472 దరఖాస్తులను ఈ పథకం కింద మంజూరు చేయడం జరిగింది. అంతేకాకుండా, రూ. 10,900 కోట్ల వ్యయంతో ఆరేళ్ళపాటు (2021-22 నుంచి 2026-27) ఎంఒఎఫ్‌పిఐ అమలు చేస్తున్న కేంద్ర రంగ పథకమైన ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ ఫర్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ ( ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమకు ఉత్పత్తితో లంకె గల ప్రోత్సాహక పథకం -పిఎల్ఐఎస్ఎఫ్‌పిఐ) ఆహార ప్రాసెసింగ్ రంగంలో చాంపియన్ బ్రాండ్లను సృష్టించేందుకు ఆహార ప్రాసెసింగ్ సామర్ధ్యాన్ని విస్తరింపచేయడాన్ని సులభతరం చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. పిఎల్ఐఎస్ఎఫ్‌పిఐ కింద వివిధ వర్గాలలో సహాయాన్ని అందించేందుకు మొత్తం 180 ప్రతిపాదనలను ఆమోదించడం జరిగింది.
***
(Release ID: 1897004)
Visitor Counter : 188