యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ

మొదటి యూత్ 20 (వై 20) ప్రారంభ సమావేశం 2023 గౌహతిలో ప్రారంభమవుతుంది


యువత ఉజ్వల భవిష్యత్తు కోసం వారి ఆలోచనల కోసం వారితో సంప్రదింపులు జరపాలని అందులో భాగంగా జరిగే ఈ వై 20 చర్చలు వారికి చేరువవుతాయని ఆశిస్తున్నాము: సెక్రటరీ, యువజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ

కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రి శ్రీ. అనురాగ్ సింగ్ ఠాకూర్ శ్వేతపత్రాన్ని ప్రారంభించిన తర్వాత 'యూత్ డైలాగ్' నిర్వహించనున్నారు

అస్సాం ముఖ్యమంత్రి శ్రీ. హిమంత బిస్వా శర్మ అస్సాం విద్యార్థులు మరియు విద్యావేత్తల నుండి పరిశోధనా పత్రాలను సమర్పించనున్నారు

వివిధ అంశాలపై ప్రముఖ వక్తల సాంకేతిక సెషన్‌లు మరియు చర్చలు ఐ ఐ టీ గౌహతిలో జరుగుతాయి.

జీ 20 దేశాల నుండి 150 మందికి పైగా యువ ప్రతినిధులు పాల్గొననున్నారు

ప్రారంభ సమావేశం విద్యార్థులకు తమ అభిప్రాయాలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రోతలకు తెలియజేయడానికి అవకాశం కల్పిస్తుంది.

Posted On: 06 FEB 2023 4:27PM by PIB Hyderabad

జీ 20 కిక్ కింద మొదటి యూత్20 (Y20) ప్రారంభ సమావేశం 2023 ఈరోజు గౌహతిలో ప్రారంభమైంది. సమావేశానికి ముందు మీడియాతో మాట్లాడిన యువజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీమతి. మీటా రాజీవ్‌లోచన్ మాట్లాడుతూ, యూత్ 20 చర్చలు యువతకు చేరువ కావాలని , వారి రేపటి ఉజ్వల భవిత  కోసం వారి ఆలోచనల కోసం వారితో సంప్రదింపులు జరపాలని భావిస్తున్నట్లు తెలిపారు.

 

ఎడమ నుండి కుడికి ఎస్ బీ నారాయణన్, డైరెక్టర్ జనరల్, ఎన్ ఈ జోన్, మినిస్ట్రీ ఆఫ్ ఐ & బీ, భారత ప్రభుత్వం, శ్రీమతి మీటా రాజీవ్లోచన్, ఎం/ఒ యూత్ అండ్ యూత్ అఫైర్స్, కళ్యాణ్ చక్రవర్తి, అసోం ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ మరియు ఐఐటీ గౌహతి డైరెక్టర్ ప్రొఫెసర్ పరమేశ్వర్ కె అయ్యర్

 

 మూడు రోజుల ఈవెంట్‌లో చర్చించాల్సిన వై20 యొక్క ఐదు థీమ్‌లను శ్రీమతి.రాజీవ్‌లోచన్ హైలైట్ చేశారు, అవి ఉపాధి యొక్క భవిష్యత్తు: పరిశ్రమ 4.0, ఆవిష్కరణలు మరియు 21వ శతాబ్దం; శీతోష్ణస్థితి మార్పు మరియు విపత్తు ప్రమాదాన్ని తగ్గించడం: సుస్థిరత్వాన్ని జీవిత మార్గంగా మార్చడం; శాంతి నిర్మాణం మరియు సయోధ్య: యుద్ధం లేని యుగంలో ప్రవేశించడం; ఉమ్మడి భవిత: ప్రజాస్వామ్యం - పాలన లో యువత ; ఆరోగ్యం, శ్రేయస్సు & క్రీడలు: యువత కోసం ఎజెండా. ప్రతి థీమ్ దేశంలోని వివిధ ప్రాంతాలలోని ప్రజల ఆకాంక్షలను ప్రతిధ్వనిస్తుంది మరియు ప్రతి ప్రాంతానికి ఈ ఇతివృత్తాలపై వారి స్వంత దృక్పధాలు  ఉన్నాయి, దేశమంతటా సంప్రదింపులను విస్తరించడానికి ఇదే కారణమని ఆమె చెప్పారు.

 

శ్రీమతి రాజీవ్‌లోచన్  కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రి శ్రీ. అనురాగ్ సింగ్ ఠాకూర్ వై 20 ప్రతినిధులతో 'యూత్ డైలాగ్' నిర్వహిస్తారు, తర్వాత ఫిబ్రవరి 8న వివిధ అంశాలపై శ్వేతపత్రాన్ని కూడా విడుదల చేస్తారని చెప్పారు. 

 

ఫిబ్రవరి 7న ఐఐటీ గౌహతిలో జరగనున్న ప్యానెల్ చర్చల గురించి ఆమె మాట్లాడుతూ, శాంతి నిర్మాణం మరియు సయోధ్య అనే ఈశాన్య ప్రాంతాలకు సంబంధించిన చాలా సంబంధిత అంశంపై ప్రముఖ వక్తలు చర్చిస్తారని చెప్పారు. ఈశాన్య ప్రాంతంలో తిరుగుబాటు చరిత్ర ఉందని, ఈ థీమ్ అస్సాం మరియు మొత్తం ఈశాన్య ప్రజలకు చాలా సందర్భోచితంగా ఉంటుందని ఆమె అన్నారు.

 

ప్యానెల్ చర్చలో ఉల్ఫా మరియు ఎన్‌డిఎఫ్‌బికి చెందిన ఇద్దరు లొంగిపోయిన తిరుగుబాటుదారులు కూడా ప్యానెల్ చర్చలో పాల్గొంటారు.

 

అస్సాం ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ కళ్యాణ్ చక్రవర్తి మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం యువజన వ్యవహారాల మంత్రిత్వ శాఖతో పాటు యువతకు వై 20 గురించి అవగాహన కల్పించడానికి మరియు దేశ నిర్మాణ ప్రక్రియలో వారిని భాగస్వామ్యం చేయడానికి అనేక కార్యక్రమాలు చేపట్టిందని తెలిపారు. వై20లోని 5 ఇతివృత్తాలపై నిర్వహించిన సెమినార్, డిబేట్, వర్క్‌షాప్‌లు, క్విజ్ పోటీల్లో అస్సాంలోని దాదాపు 36 విద్యాసంస్థలు పాల్గొన్నాయని ఆయన తెలిపారు. దాదాపు 4000 పాఠశాలలు వై20 కార్యక్రమాల్లో పాల్గొన్నాయని ఆయన తెలియజేశారు.

 

ఐఐటి గౌహతి డైరెక్టర్ ప్రొఫెసర్ పరమేశ్వర్ కె అయ్యర్ మాట్లాడుతూ వై20 ఈవెంట్‌ల టెక్నికల్ సెషన్‌లు మరియు చర్చలను ఐఐటి గౌహతి నిర్వహించడం గర్వించదగ్గ విషయమన్నారు. గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి వంటి అధునాతన సాంకేతికతలకు ఐ ఐ టీ గౌహతి ఒక ప్రధాన పరిశోధనా కేంద్రం అని ఆయన నొక్కి చెప్పారు; ఈ సాంకేతికతల్లో కొన్ని పరిశ్రమలకు బదిలీ ప్రక్రియలో ఉన్నాయి. ఉపాధి యొక్క భవిష్యత్తు, ఇరవై ఒకటవ శతాబ్దపు నైపుణ్యాలు, వాతావరణ మార్పు, స్థిరత్వాన్ని జీవన విధానంగా మార్చడం మరియు శాంతి నిర్మాణం మరియు సయోధ్యపై ఐఐటి గౌహతిలో కీలక చర్చలు జరుగుతాయని ఆయన తెలియజేశారు.

 

రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో జరిగిన వై20 అవగాహన కార్యక్రమాల గురించి మాట్లాడుతూ, ఐ & బీ మంత్రిత్వ శాఖ యొక్క ఎన్ ఈ జోన్ డైరెక్టర్ జనరల్ శ్రీ బీ నారాయణన్, అస్సాం ప్రభుత్వ విద్యా శాఖతో కలిసి పీ ఐ బీ గౌహతి అస్సాం వ్యాప్తంగా దాదాపు 50 మంది విద్యార్థులకు డాక్యుమెంటేషన్, మొబైల్ ఫోటోగ్రఫీ మరియు రిపోర్టింగ్‌పై శిక్షణ ఇచ్చిందని తెలియజేశారు. శ్రీ నారాయణన్ విద్యార్థుల కృషిని అభినందిస్తూ శిక్షణ పొందిన 50 మంది విద్యార్థులలో 9 మంది విద్యార్థులు తమ అత్యుత్తమ ప్రతిభను ప్రదర్సించినందుకు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో  సత్కారానికి ఎంపికయ్యారని తెలియజేశారు.

 

అస్సాం ముఖ్యమంత్రి శ్రీ. హిమంత బిస్వా శర్మ అస్సాం విద్యార్థులు మరియు విద్యావేత్తల నుండి పరిశోధన పత్రాలను కూడా సమర్పించనున్నారు. దీనికి అదనంగా, ఐ ఐ టీ గౌహతిలో సాంకేతిక సెషన్‌లు మరియు చర్చలు నిర్వహించబడతాయి. ప్రముఖ వక్తలు జనరల్ వీ కే సింగ్, శ్రీ. జీ పీ సింగ్, తేజస్వి సూర్య తదితరులు పాల్గొంటారు. ఇంకా, బ్రహ్మపుత్ర శాండ్‌బార్ ద్వీపంలో వై 20 ప్రతినిధులతో ఐస్ బ్రేకింగ్ సెషన్ జరుగుతుంది.

 

వై 20 - 2012లో ప్రారంభించబడింది, వై-20 అనేది జీ-20 సమ్మిట్‌ల యొక్క యవ విభాగం,  ఇది జీ-20తో నిమగ్నమవ్వడానికి యువతకు అధికారికంగా గుర్తింపు పొందిన ఏకైక వేదిక, ఇది యువ నాయకుల కోసం అత్యంత ప్రభావవంతమైన అంతర్జాతీయ దౌత్య వేదికలలో ఒకటి. జీ-20 గొడుగు కింద ఎనిమిది అధికారిక  సమూహాలలో ఇది కూడా ఒకటి.

 

ఆగస్టులో జరిగే యూత్ 20 సమ్మిట్‌తో ముగుస్తుంది దేశవ్యాప్తంగా జరిగే 17 సమావేశాలలో ఇది మొదటి సమావేశం.

 

BN/PG/SS/BM

 

ట్వీట్ ల కోసం ఈ క్రింది లింకులు 

 

https://twitter.com/PIB_Guwahati/status/1622494410767499266?t=1it4p8uCyFz3VZkcU1xh-Q&s=08

 

https://twitter.com/PIB_Guwahati/status/1622498321171644417?t=jm57XlB6Koz9jtCa_D7QTA&s=08

***



(Release ID: 1896823) Visitor Counter : 212