రైల్వే మంత్రిత్వ శాఖ

జ‌న‌వ‌రి 2023 ఆర్థిక సంవ‌త్స‌రంలో రూ. 135387 కోట్ల స‌రుకు రుసుమును ఆర్జించిన రైల్వేలు


గ‌త ఏడాది ఇదేకాలంతో పోలిస్తే 16% పెరిగిన స‌రుకు రుసుం ఆర్జిన‌

గ‌త ఏడాది చేసిన సురుకు లోడింగ్‌తో పోలిస్తే 7% మెరుగుద‌ల‌ను సాధిస్తూ జ‌న‌వ‌రి 2023 నాటికి 1243 మెట్రిక్ ట‌న్నుల సరుకు లోడింగ్‌ను సాధించిన రైల్వేలు

Posted On: 06 FEB 2023 3:22PM by PIB Hyderabad

 భార‌తీయ రైల్వేలు ఆర్థిక‌ సంవ‌త్స‌రం 2022-23 తొలి ప‌ది నెల‌ల్లో  స‌రుకు ర‌వాణా గ‌త ఏడాది ఇదే కాలంలో జ‌రిగిన లోడింగ్‌, ఆదాయాన్ని మిష‌న్ మోడ్‌లో అధిగ‌మించింది. 
ఏప్రిల్ - జ‌న‌వ‌రి 23 సంచిత ప్రాతిప‌దిక‌న‌, గ‌త సంవ‌త్స‌రం ర‌వాణా చేసిన 1159.08 మెట్రిక్ ట‌న్నుల‌తో పోలిస్తే 7% మెరుగుద‌ల‌తో 1243.46 మెట్రిక్ ట‌న్నుల‌ను సాధించింది. గ‌త ఏడాది ఆర్జించిన రూ. 117212 కోట్ల‌తో పోలిస్తే రైల్వేలు రూ. 135387 కోట్ల‌ను ఆర్జించింది. ఇది గ‌త ఏడాదితో పోలిస్తే 16% మెరుగుద‌ల‌. 
జ‌న‌వ‌రి 23లో మూల స‌రుకు లోడింగ్ గ‌త ఏడాది జ‌న‌వ‌రిలో సాధించిన‌ 129.12 మెట్రిక్ ట‌న్నుల క‌న్నా 4% అధికంగా 134.07 మెట్రిక్ ట‌న్నుల‌ను సాధించింది. గ‌త ఏడాది జ‌న‌వ‌రితో ఆర్జించిన 13172 కోట్ల స‌రుకు రుసుంకు వ్య‌తిరేకంగా ఈ ఏడాది స‌రుకు ఆదాయం రూ. 14907 కోట్లుగా ఉంది. ఇది గ‌త ఏడాదిక‌న్నా 13% మెరుగుద‌ల‌. 
హంగ్రీ ఫ‌ర్ కార్గో (స‌రుకు కోసం ఆక‌లి) అన్న మంత్రాన్ని అనుస‌రించి, భార‌తీయ రైల్వేలు సుల‌భంగా వ్యాపారం చేయ‌డాన్ని మెరుగుప‌రిచేందుకు, పోటీ ధ‌ర‌ల‌లో సేవ‌ల బ‌ట్వాడాను మెరుగుప‌రిచేందుకు చేసినందుకు నిరంత‌ర కృషి ఫ‌లితంగా సంప్ర‌దాయ‌, సంప్ర‌దాయేత‌ర స‌రుకు ప్ర‌వాహంతో రైల్వేల‌కు నూత‌న ర‌ద్దీ రావ‌డం మొద‌లైంది. వినియోగ‌దారుడు కేంద్రంగా, ప్ర‌త్యామ్నాయ ప్ర‌ణాళిక‌తో చురుకైన విధానాల‌ను రూపొందించ‌డం అన్న‌ది రైల్వేలు ఈ మైలురాయి విజ‌యాన్ని సాధించ‌డంలో తోడ్ప‌డింది. 

 

***



(Release ID: 1896818) Visitor Counter : 144