రైల్వే మంత్రిత్వ శాఖ

‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ పథకం కింద భారత్ గౌరవ్ డీలక్స్ ఏసీ టూరిస్ట్ రైలును ప్రవేశపెట్టనున్న భారతీయ రైల్వేలు


ఫిబ్రవరి 28న ఢిల్లీ సఫ్దర్‌జంగ్ స్టేషన్ నుండి బయలుదేరనున్న "గర్వి గుజరాత్" టూర్

Posted On: 05 FEB 2023 9:48AM by PIB Hyderabad
శక్తివంతమైన గుజరాత్ వారసత్వాన్ని ప్రదర్శించడానికి ఈ రైల్వే పర్యటనను కేంద్ర ప్రభుత్వ  "ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్" పథకం తరహాలో రూపొందించారు. .  కళాత్మకమైన భారత్ గౌరవ్ డీలక్స్ ఏసీ టూరిస్ట్ రైలు ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ క్లాస్‌తో 8 రోజుల పాటు టూర్‌లు నిర్వహిస్తారు. టూరిస్ట్ రైలులో 4  ఫస్ట్ క్లాస్ ఏసీ  కోచ్‌లు, 2 రెండవ క్లాస్ AC కోచ్‌లు ఉంటాయి. ఒక చక్కటి ప్యాంట్రీ కారు, రెండు రైలు రెస్టారెంట్లు ఉంటాయి. ఇందులో 156 మంది పర్యాటకులు ప్రయాణించవచ్చు. గుజరాత్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రాలు, వారసత్వ ప్రదేశాల సందర్శన అంటే స్టాచ్యూ ఆఫ్ యూనిటీ, చంపానేర్, సోమనాథ్, ద్వారక, నాగేశ్వర్, బేట్ ద్వారక, అహ్మదాబాద్, మోధేరా, ఈ ప్రయాణంలో ప్రధాన ఆకర్షణలు.
పర్యాటకులు ఈ టూరిస్ట్ రైలులో గురుగ్రామ్, రేవారి, రింగాస్, ఫుల్లెరా, అజ్మీర్ రైల్వే స్టేషన్లలో కూడా ఎక్కవచ్చు.
భారతీయ రైల్వేలు తమ భారత్ గౌరవ్ డీలక్స్ ఏసీ టూరిస్ట్ రైలును నడపడం ద్వారా వైబ్రెంట్ గుజరాత్ రాష్ట్ర సాంస్కృతిక, ఆధ్యాత్మిక వారసత్వాన్ని ప్రదర్శించడానికి గర్వి గుజరాత్‌తో చాలా ప్రత్యేకమైన టూర్‌తో ముందుకు వచ్చాయి. ఐఆర్సిటిసి నిర్వహించే ఈ ప్రత్యేక పర్యాటక రైలు, 8 రోజుల పర్యటనలో ఢిల్లీ సఫ్దర్‌జంగ్ రైల్వే స్టేషన్ నుండి ఫిబ్రవరి 28న బయలుదేరుతుంది. పర్యాటకుల సౌకర్యార్థం గురుగ్రామ్, రేవారి, రింగాస్, ఫుల్లెరా, అజ్మీర్ రైల్వే స్టేషన్లలో బోర్డింగ్, డీబోర్డింగ్ సౌకర్యం అందించారు.
ఈ రైలు టూర్ ప్యాకేజీని “ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్” తరహాలో రూపొందించారు. ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ జీవితం ఇతివృత్తంతో ఈ ప్రయాణం సాగుతుంది. ఈ రైలు టూర్ ప్యాకేజీ  మొదటి స్టాపే కేవడియాలో ఉంటుంది, ఇందులో స్టాట్యూ ఆఫ్ యూనిటీ ఆకర్షణకు కేంద్రంగా ఉంటుంది. మొత్తం రైలు 8 రోజుల ప్రయాణంలో సుమారుగా 3500 కి.మీ.ల దూరాన్ని కవర్ చేస్తుంది.
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహం - స్టాట్యూ ఆఫ్ యూనిటీ, యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందిన చంపానేర్ పురావస్తు ఉద్యానవనం, అద్లేజ్ స్టెప్ వెల్, అహ్మదాబాద్‌లోని అక్షరధామ్ ఆలయం, సబర్మతి ఆశ్రమం, మోధేరా సూర్య దేవాలయం, పటాన్‌లోని రాణి కి వావో యునెస్కో మరొక ప్రదేశం. టూర్ లో వారసత్వ సంపదలు చేర్చారు. పక్కన, సోమనాథ్ జ్యోతిర్లింగ సందర్శన, నాగేశ్వర్ జ్యోతిర్లింగ, ద్వారకాధీష్ ఆలయం, బేట్ ద్వారక 8 రోజుల పర్యటనలో కవర్ అయ్యే ఆధ్యాత్మిక ప్రదేశాలు. హోటళ్లలో రెండు రాత్రులు బస ఉంటుంది, కేవడియా,  అహ్మదాబాద్‌లో ఒక్కొక్కటి చొప్పున, సోమనాథ్,  ద్వారకలోని ప్రదేశాల సందర్శన పగటిపూట  ఉంటుంది.
 

ద్వారకాధీశ దేవాలయం

స్టేట్ ఆఫ్ ఆర్ట్ డీలక్స్ ఏసీ టూరిస్ట్ రైలులో రెండు ఫైన్ డైనింగ్ రెస్టారెంట్లు, ఆధునిక వంటగది, కోచ్‌లలో షవర్ క్యూబికల్స్, సెన్సార్ ఆధారిత వాష్‌రూమ్ ఫంక్షన్‌లు, ఫుట్ మసాజర్ వంటి అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి. పూర్తిగా ఎయిర్ కండిషన్డ్ రైలు ఫస్ట్ క్లాస్ ఏసీ, సెకండ్ క్లాస్ ఏసీ బోగీలు ఉంటాయి. రైలులో ప్రతి కోచ్‌కు సీసీటీవీ కెమెరాలు, సెక్యూరిటీ గార్డ్‌ల  మెరుగైన భద్రతా లక్షణాలు ఉన్నాయి. మొత్తం రైలులో ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ను కూడా ఉంటుంది. 

భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు ప్రారంభం దేశీయ పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వ చొరవ "దేఖో అప్నా దేశ్"కు అనుగుణంగా ఉంది. 
ధరల శ్రేణి: AC 2 టైర్‌లో ఒక్కొక్కరికి రూ. 52250/- ,  ఫస్ట్ ఏసీ (క్యాబిన్) ఒక్కొక్కరికి రూ. 67140, ఫస్ట్ ఏసీ (కూపే) ఒక్కొక్కరికి రూ. 77400/-. 
8 రోజుల మొత్తం కలిపి ఈ టూర్ ప్యాకేజీ ఉంటుంది. 
పైన పేర్కొన్న ప్యాకేజీ లో సంబంధిత తరగతిలో రైలు ప్రయాణం, ఏసీ హోటళ్లలో రాత్రి బస, అన్ని భోజనాలు (శాకాహారం మాత్రమే), అన్ని ట్రాన్స్ఫర్ లను కవర్ చేస్తుంది. పర్యాటక ప్రదేశాల సందర్శనకు అయ్యే బస్సు ప్రయాణం, ట్రావెల్ ఇన్సూరెన్స్,  గైడ్ సేవలు ఈ ప్యాకేజీ కింద ఉంటాయి. 
అవసరమైన అన్ని ఆరోగ్య జాగ్రత్త చర్యలు తీసుకుంటారు.  ఐఆర్సిటిసి ... అతిథులకు సురక్షితమైన, మరపురాని అనుభూతిని అందించడానికి ప్రయత్నాలు చేస్తుంది.
ఈ ప్యాకేజీని మరింత ఆకర్షణీయంగా, ఎక్కువ మందికి అందుబాటులో ఉండేలా చేయడానికి, ఈఎంఐ సౌకర్యాన్ని ఇచ్చే సంస్థలతో కూడా ఐఆర్సిటిసి కలిసి పనిచేస్తుంది. ఈఎంఐ చెల్లింపు ఎంపికను అందించడానికి చెల్లింపు గేట్‌వేలతో భాగస్వామ్యం అయింది. 
మరిన్ని వివరాల కోసం మీరు  ఐఆర్సిటిసి  వెబ్‌సైట్‌ని సందర్శించవచ్చు: https://www.irctctourism.com 
బుకింగ్ ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంది, ముందుగా వచ్చిన వారికి మొదట అవకాశం ఉంటుంది. 
 
***


(Release ID: 1896539) Visitor Counter : 218