మత్స్య పరిశ్రమ, పశు పోషణ మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ

2023-24 బడ్జెట్‌లో ఫిషరీస్ డిపార్ట్‌మెంట్‌కు కేటాయింపు 2022-23 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌తో పోలిస్తే 38.45% పెరుగుదలను సూచిస్తుంది.


ఈ కేటాయింపు డిపార్ట్‌మెంట్‌కు ఎన్నడూ లేని విధంగా అత్యధిక వార్షిక బడ్జెట్ మద్దతుగా ఉంది

Posted On: 05 FEB 2023 6:41PM by PIB Hyderabad

ప్రధాన్ మంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సాహ్-యోజన (పిఎం-ఎంకేఎస్‌ఎస్‌వై) పేరుతో కొత్త ఉప పథకాన్ని ప్రకటించిన కేంద్ర ఆర్థిక మంత్రి:పిఎంఎంఎస్‌వై కింద సెంట్రల్ సెక్టార్ సబ్-స్కీమ్.
పంచాయతీ స్థాయిలో మత్స్య సహకార సంఘాలతో పాటు ప్రాథమిక సహకార సంఘాల ఏర్పాటుపై బడ్జెట్ ప్రసంగం నొక్కి చెప్పింది.
పశుసంవర్ధక, పాడిపరిశ్రమ, మత్స్య పరిశ్రమలపై దృష్టి సారించి వ్యవసాయం, అనుబంధ రంగాలకు రుణ లక్ష్యాన్ని 20 లక్షల కోట్లకు పెంచుతున్నట్లు ప్రకటించారు.
డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మరియు అగ్రికల్చరల్ యాక్సిలరేటర్ ఫండ్ మత్స్య సంపద విలువ గొలుసు చుట్టూ ఆవిష్కరణలను ముమ్మరం చేస్తుంది.
 

2023-24 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను సమర్పించిన కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ తన ప్రసంగంలో ఫిషరీస్ శాఖకు రూ. 2248.77 కోట్లు కేటాయించినట్లు ప్రకటించారు.  2022-23లో ఈ మొత్తం రూ.1624.18 కోట్లుగా ఉంది. అదే విధంగా 2021-22లో ఈ మొత్తం రూ.1360 కోట్లగా ఉంది. ఇది గత ఆర్థిక సంవత్సరం 2022-23 ఆర్థిక సంవత్సరపు బడ్జెట్‌తో పోలిస్తే ఇది 38.45% పెరుగుదలను సూచిస్తుంది. అలాగే డిపార్ట్‌మెంట్‌కు అత్యధిక వార్షిక బడ్జెట్ మద్దతులో ఇది ఒకటి నిలిచింది.

ప్రధాన్ మంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సాహ్-యోజన (పిఎం-ఎంకెఎస్‌ఎస్‌వై) పేరుతో కొత్త ఉప-పథకాన్ని ఆమె ప్రకటించారు: పిఎంఎంఎస్‌వై కింద సెంట్రల్ సెక్టార్ సబ్-స్కీమ్ రూ.6,000 కోట్ల లక్ష్య పెట్టుబడితో ఆదాయాలను మరింత పెంచే లక్ష్యంతో మత్స్యకారులు, చేపల విక్రేతలు మరియు మత్స్య రంగంలో నిమగ్నమైన సూక్ష్మ & చిన్న సంస్థలకు ప్రభుత్వం అండగా నిలుస్తుంది. పిఎం-ఎంకెఎస్‌ఎస్‌వై  మత్స్య రంగాన్ని లాంఛనప్రాయంగా తీసుకురావడానికి కేంద్రీకృత జోక్యాన్ని ఊహించింది. ఇందులో డిజిటల్ ఇన్‌క్లూజన్, క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్ మరియు వర్కింగ్ క్యాపిటల్ కోసం ఇన్‌స్టిట్యూషనల్ ఫైనాన్స్‌కు యాక్సెస్‌ను సులభతరం చేయడం, ఆక్వాకల్చర్ మరియు ఫిషరీస్ ప్రోత్సహిస్తున్న మైక్రో ఎంటర్‌ప్రైజెస్‌లో రిస్క్ తగ్గించడానికి సిస్టమ్ మరియు ఇన్‌స్టిట్యూట్‌లను తీసుకురావడానికి ప్రోత్సాహకాలు ఉన్నాయి. ఫిషరీస్ మరియు ఆక్వాకల్చర్ రంగ విలువ-గొలుసు సామర్థ్యాలపై పనిచేయడానికి, వినియోగదారులకు సురక్షితమైన  ఉత్పత్తులను అందించడానికి సరఫరా గొలుసులను ఏర్పాటు చేయడంలో సూక్ష్మ మరియు చిన్న సంస్థలను ప్రోత్సహించడం, తద్వారా దేశీయ మార్కెట్‌ను విస్తరించడం మరియు ఈ రంగంలో మహిళలకు ఉద్యోగాల సృష్టి మరియు నిర్వహణ కోసం ప్రోత్సాహకాలు ఈ పథకం కింద ఉంటాయి.

పంచాయతీ స్థాయిలో మత్స్య సహకార సంఘాలతో పాటు ప్రాథమిక సహకార సంఘాల ఏర్పాటుపై కూడా బడ్జెట్ ప్రసంగం వివరించింది. గ్రాస్ రూట్ స్థాయిలో సహకార సంఘాలను ఏర్పాటు చేయడం వల్ల ఈ రంగాన్ని బలోపేతం చేస్తుంది. అలాగే మత్స్యకారులు మరియు చేపల పెంపకందారులు చేపల ఉత్పత్తిని మరియు దాని పంటకోత అనంతర కార్యకలాపాలను వ్యవస్థీకృత పద్ధతిలో నిర్వహించడానికి అధికారం పొందుతారు. సహకార మంత్రిత్వ శాఖకు రూ.900 కోట్ల కేటాయింపుతో సహకార సంఘాల అభివృద్ధికి, రుణాలకు పరిమితులు పెంపు, టీడీఎస్ పరిమితులు మరియు నగదు డిపాజిట్లు మరియు జాతీయ సహకార డేటాబేస్ నిర్మాణానికి తీసుకోవలసిన చర్యలు సహకార కార్యకలాపాలు మరియు ఫైనాన్సింగ్‌ను సులభతరం చేస్తాయి. ఈ రంగం వేగంగా అభివృద్ధి చెందడానికి సహాయం చేస్తుంది. నేషనల్ కో-ఆపరేటివ్ ఎక్స్‌పోర్ట్ సొసైటీ, నేషనల్ కో-ఆపరేటివ్ సొసైటీ ఫర్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ మరియు నేషనల్ లెవెల్ మల్టీ-స్టేట్ సీడ్ కో-ఆపరేటివ్ సొసైటీ స్థాపనపై గతంలో చేసిన ప్రకటనతో పాటు, పైన పేర్కొన్నవి విత్తన రంగాలలో మత్స్య సంపదకు తోడ్పడతాయని భావిస్తున్నారు.

పశుపోషణ, పాడిపరిశ్రమ, మత్స్య రంగాలపై దృష్టి సారించిన ప్రభుత్వం వ్యవసాయం, అనుబంధ రంగాల రుణ లక్ష్యాన్ని 20 లక్షల కోట్లకు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఇది మత్స్య రంగానికి సంస్థాగత ఫైనాన్స్ ప్రవాహాన్ని గణనీయంగా మెరుగుపరుస్తుంది. ఇంకా రొయ్యల మేత కోసం అవసరమైన కొన్ని ఇన్‌పుట్‌లపై దిగుమతి సుంకాన్ని తగ్గించే ప్రకటన దిగుమతుల ఖర్చు మరియు ఉత్పత్తి వ్యయాన్ని తగ్గిస్తుంది మరియు ఫలితంగా ఆక్వాకల్చర్ ఎగుమతులను పెంచుతుంది మరియు ప్రోత్సహిస్తుంది. చేపల మేతపై ప్రాథమిక కస్టమ్స్ సుంకాన్ని 15% నుండి 5%కి, క్రిల్ మీల్‌పై 15% నుండి 5%కి, ఆల్గల్ ప్రైమ్ (పిండి)పై 30% నుండి 15%కి, ఫిష్ లిపిడ్ ఆయిల్‌పై 30% నుండి 15% వరకు తగ్గింపు,  మినరల్ మరియు విటమిన్ ప్రీమిక్స్ 15% నుండి 5% వరకు తగ్గింపు ఆక్వాటిక్ ఫీడ్ తయారీ ధరను తగ్గిస్తుంది. ఈ చర్యలు దేశీయ దాణాను ప్రోత్సహిస్తుంది మరియు భారతీయ రొయ్యల ఎగుమతి పోటీని గణనీయంగా మెరుగుపరుస్తుంది.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం భారతదేశంలో 3 సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్‌ల ప్రకటన భారతదేశంలోని ఏఐ పర్యావరణ వ్యవస్థను మెరుగుపరుస్తుందని భావిస్తున్నారు. ఇది చేపల మార్కెటింగ్ వ్యవస్థలను మెరుగుపరచడానికి మరియు గుర్తించదగిన మరియు నాణ్యత కోసం బ్లాక్-చైన్ ఆధారిత పరిష్కారాన్ని వేగవంతంగా అమలు చేయడం ద్వారా విలువను పెంచడానికి గొప్ప అవకాశాన్ని అందిస్తుంది.

ప్రతిపాదిత డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మరియు అగ్రికల్చరల్ యాక్సిలరేటర్ ఫండ్ మత్స్య సంపద విలువ గొలుసు ఆధారిత ఆవిష్కరణలను తీవ్రతరం చేస్తుంది. మొత్తంమీద 2023-24 బడ్జెట్ సంస్థాగత క్రెడిట్‌కు మెరుగైన ప్రవాహం, నష్టాలను తగ్గించడానికి పెరిగిన సాధనాలు, దేశీయ మరియు ఎగుమతి మార్కెట్ల విస్తరణకు ప్రోత్సాహకాలు మరియు వేగవంతం చేయడం ద్వారా మత్స్య మరియు ఆక్వాకల్చర్ రంగంలో వేగవంతమైన వృద్ధికి కొత్త దశను అందించడంలో సహాయపడుతుంది. ఈ ఆవిష్కరణల ద్వారా భారతదేశం వివిధ అంశాల్లో ముందుకు సాగుతుంది మరియు ప్రపంచవ్యాప్తంగా తన ఉనికిని చాటుతుంది.

వివిధ రంగాలలో  భారతీయ మత్స్య రంగం చాలా ఆరోగ్యకరమైన వేగంతో అభివృద్ధి చెందుతోంది. భారతదేశం ఇప్పటికే 3వ అతిపెద్ద చేపల ఉత్పత్తిదారుగా, 2వ అతిపెద్ద ఆక్వాకల్చర్ ఉత్పత్తిదారుగా మరియు చేపలు మరియు మత్స్య ఉత్పత్తులలో 4వ అతిపెద్ద ఎగుమతిదారుగా అవతరించింది. ఇది 2021-22 ఆర్థిక సంవత్సరంలో రెండంకెల వార్షిక వృద్ధి రేటు 10.34%గా ఉంది మరియు సమీప భవిష్యత్తులో మరింత వృద్ధితో 162.48 లక్షల టన్నుల చేపల ఉత్పత్తిని రికార్డు చేసింది. ఈ రంగం 28 మిలియన్లకు పైగా ప్రజలకు స్థిరమైన జీవనోపాధిని కల్పిస్తోంది మరియు పేదలు మరియు అణగారిన వర్గాల సామాజిక-ఆర్థిక పరిస్థితులలో స్థిరమైన మెరుగుదలను తీసుకురావడంలో కీలకపాత్ర పోషిస్తోంది.

నాలుగు సంవత్సరాల క్రితం, 5 ఫిబ్రవరి 2019న పశుసంవర్ధక, పాడిపరిశ్రమ & ఫిషరీస్ శాఖ నుండి ఫిషరీస్ శాఖను రూపొందించడం ద్వారా మత్స్య రంగానికి పెద్ద ప్రోత్సాహం లభించింది. అదే సమయంలో, ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన (పిఎంఎంఎస్‌వై) వంటి దార్శనిక పథకాలు మరియు కార్యక్రమాలు, ఫిషరీస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ ఫండ్ (ఎఫ్‌ఐడిఎఫ్) మరియు కిసాన్ క్రెడిట్ కార్డ్ (కెసిసి)లు రూ. 27500 కోట్ల మొత్తం పెట్టుబడితో ప్రారంభించబడ్డాయి. ఈ కార్యక్రమాలు వాటి ప్రభావాన్ని చూపడం ప్రారంభించాయి. తద్వారా అమృత్ కాల్ సమయంలో కొత్త ఎత్తులను సాధించేందుకు రంగం సిద్ధమైంది.

****



(Release ID: 1896512) Visitor Counter : 197