ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

సంత్ రవిదాస్ జయంతి సందర్భంగా ఆయనకు ప్రధాని నివాళి

Posted On: 05 FEB 2023 8:55AM by PIB Hyderabad

   సంత్ రవిదాస్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు నివాళి అర్పించారు.

ఈ మేరకు ఒక ట్వీట్ ద్వారా ఇచ్చిన సందేశంలో:

‘‘సంత్ రవిదాస్ గారి జయంతి నేపథ్యంలో ఆయనకు నమస్కరిస్తున్నప్పుడు మనం ఆయన ప్రబోధాలను స్మరించుకుంటాం. ఈ సందర్భంగా ఆయన ఆదర్శాలకు అనుగుణంగా న్యాయమైన, సామరస్యపూర్వక, సుసంపన్న సమాజం కోసం మన సంకల్పాన్ని పునరుద్ఘాటిద్దాం. ఈ మేరకు అనేక కార్యక్రమాల ద్వారా పేదలకు సేవ, సాధికారత కల్పన ద్వారా ఆయన చూపిన బాటలో లక్ష్య సాధనకు కృషి చేద్దాం.’’ అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.


(Release ID: 1896510)