భారత ఎన్నికల సంఘం

రాబోయే ఎన్నికల్లో ఓటర్లను ఆకట్టుకునేందుకు ఎన్నికల సంఘం రూపొందించిన 'మై భారత్ హూ' పాట సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది.


ఈ పాట విడుదలైన వారం రోజుల్లోనే 3.5 లక్షల వ్యూస్, 5.6 లక్షల ఇంప్రెషన్స్ వచ్చాయి.

జాతీయ కర్తవ్యాన్ని గుర్తించి ఓటు వేసిన ప్రతి ఓటరుకు ఈ పాట అంకితం: సీఈసీ

Posted On: 03 FEB 2023 5:26PM by PIB Hyderabad

వినూత్న కమ్యూనికేషన్ వ్యూహాల ద్వారా ఓటర్ల శాతాన్ని పెంచే లక్ష్యంతో ఈ ఏడాది తొమ్మిది అసెంబ్లీ ఎన్నికలు, వచ్చే ఏడాది ప్రారంభంలో లోక్ సభ ఎన్నికలకు భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగా సుభాష్ ఘాయ్ ఫౌండేషన్ సహకారంతో ఈసీఐ వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో 'మై భారత్ హూం, హమ్ భారత్ కే మత్తతా హై' అనే పాటను రూపొందించి ఓటు హక్కు వినియోగించుకోవాలని, రాజ్యాంగ కర్తవ్యాన్ని నిర్వర్తించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేసింది. 13వ జాతీయ ఓటరు దినోత్సవం (ఎన్ వీడీ) - 2023 జనవరి 25న గౌరవ రాష్ట్రపతి సమక్షంలో ప్రదర్శించిన ఈ పాట ఇప్పటికే ప్రముఖులు,ప్రజలను ప్రభావిత ఉన్న శక్తి కలిగిన వారి సహకారంతో సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా గుర్తింపు పొందింది.  హిందీతో పాటు ఇతర భారతీయ భాషల్లో రూపొందిన పాట  విడుదలైన వారం రోజుల్లోనే  ఫేస్బుక్, ఇంస్టాగ్రామ్, ట్విట్టర్, యూట్యూబ్ వంటి నాలుగు ప్రధాన సోషల్ మీడియాల్లో  3.5 లక్షల వ్యూస్, 5.6 లక్షల ఇంప్రెషన్స్ పొందింది.

'ప్రతి ఒక్క ఓటరు తన ఓటు హక్కు వినియోగించుకోవాలి' అన్న నినాదం కార్యరూపం దాల్చేలా చూడడానికి కేంద్ర ఎన్నికల సంఘం 'సిస్టమాటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టోరల్ పార్టిసిపేషన్ (స్వీప్) కార్యక్రమం రూపొందించింది. ప్రతి ఒక్క ఓటరు తన ఓటు హక్కు వినియోగించుకునేలా చూసేందుకు ఈసీఐ వ్యూహాలు, కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసింది. దీనిలో భాగంగా  'మై భారత్ హూం, హమ్ భారత్ కే మత్తతా హై' పాటను ఈసీఐ సిద్ధం చేసింది. . ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో ఓటర్లకు తమ హక్కులు, బాధ్యత గురించి అవగాహన కల్పించడంతో పాటు ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములు ఆయేలా చూడాలన్న లక్ష్యంతో పాటను  ఈసీఐ రూపొందించింది.

ప్రధాన ఎన్నికల కమిషనర్ శ్రీ రాజీవ్ కుమార్ నేతృత్వంలోని ఎన్నికల సంఘంతో శ్రీ సుభాష్ ఘాయ్ నేతృత్వంలోని బృందం  అనేకసార్లు చర్చలు జరిపిన తరువాత పాటకు తుది రూపు ఇచ్చారు. చర్చల్లో ఎన్నికల కమిషనర్లు  శ్రీ అనూప్ చంద్ర పాండే,  శ్రీ అరుణ్ గోయల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన  ప్రధాన ఎన్నికల కమిషనర్ "  జాతీయ కర్తవ్యాన్ని గుర్తించి అన్ని అడ్డంకులను అధిగమించి ఓటు వేసే ప్రతి ఓటరుకు ఈ పాటను అంకితం చేస్తున్నాము.  కొత్గా ఓటు హక్కు పొందిన వారిని, భావి ఓటర్లను, యువ ఓటర్లు,సర్వీస్ ఓటర్లు , దివ్యాంగ ఓటర్లకు అవగాహన కల్పించి, 100 సంవత్సరాల వయస్సు గల ఓటర్ల ఆకాంక్షలు  ప్రతిబింబించేలా పాట రూపొందింది. ప్రజాస్వామ్యంపై విశ్వాసం చూపి 2019 ఎన్నికల్లో పురుషులను  మించి ఓటు హక్కు వినియోగించుకున్న మహిళా ఓటర్లను  కీర్తిస్తూ పాట సాగుతుంది. భారతదేశ వైవిధ్యం, భౌగోళిక అంశాల ప్రాధాన్యత తెలియజేసే విధంగా 'ఓటుకు మించింది లేదు  నేను ఖచ్చితంగా ఓటు వేస్తాను' అని ప్రతి ఓటరును చైతన్యం చేయాలన్న ఎన్నికల సంఘం లక్ష్యం సాధనకు పాట సహకరిస్తుంది" అని అన్నారు.

ఈ పాటలో కొన్ని విశేషాలు:

స్ఫూర్తిదాయకమైన, స్ఫూర్తిదాయకమైన ఈ పాటను ప్రముఖ చిత్ర నిర్మాత  సుభాష్ ఘాయ్ ముంబైలోని విజిలింగ్ వుడ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ మ్యూజిక్ సహకారంతో రచించి, స్వరపరిచారు.

హిందీతో పాటు బెంగాలీ, మరాఠీ, గుజరాతీ, పంజాబీ, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, అస్సామీ, ఒడియా, కాశ్మీరీ, సంతాలి వంటి 12 ప్రాంతీయ భాషల్లో ఈ పాటను ఆలపించారు.

'మై భరత్ హూ' పాట కోరస్ అన్ని భాషల్లో  ఒకేలా ఉంది.

హిందీలో సుఖ్వీందర్ సింగ్, కవితా కృష్ణమూర్తి, సోనూ నిగమ్, హరి హరన్, అల్కా యాగ్నిక్, జావేద్ అలీ, కేఎస్ చిత్ర, కౌశికి చక్రవర్తి, ఉస్తాద్ రషీద్ ఖాన్ వంటి ప్రముఖులు పాట పాడారు.

ప్రాంతీయ భాషల్లో కౌశికి చక్రవర్తి, వైశాలి సామంత్, భూమి త్రివేది, మికా సింగ్, కె.ఎస్.చిత్ర, మనో, విజయ్ ప్రకాష్, విజయ్ యేసుదాస్, పాపన్, దీప్తి రేఖా పాడి, మెహమీత్ సయ్యద్, పంకజ్ జల్ వంటి ప్రముఖులు పాట పాడారు.

ఈ పాట వివిధ  రూపాల్లో విడుదల అయ్యింది. హిందీతో పాటు వివిధ భారతీయ భాషలు, ఇన్స్ట్రుమెంటల్ , పియానో , ఇంటర్నేషనల్ సౌండ్ ట్రాక్, రింగ్ టోన్ రూపాల్లో పాట సాగుతుంది.

 మహిళా ఓటర్లు, యువ ఓటర్లు, సెంటినరీ ఓటర్లు, దివ్యాంగ ఓటర్లతో కూడిన వైవిధ్యమైన ఓటరు సమూహాన్ని ఈ పాటలో చిత్రీకరించారు.

ఓటరు శక్తి తెలిసేలా దేశ ప్రాంతీయ వైవిధ్యం, సాంస్కృతిక, సామాజిక, ఆర్థిక, భౌగోళిక అంశాల ఆధారంగా  పాటను రూపొందించారు.

  పంకజ్ త్రిపాఠితో పాటు ఈసీఐ ఐకాన్ లు అనిల్ కపూర్, సిద్ధార్థ్ మల్హోత్రా, ఆర్ మాధవన్, సుబోధ్ భావే, ప్రసేన్జిత్ ఛటర్జీ, మోహన్ లాల్, కపిల్ బోరా, సూర్య, గిప్పీ గ్రేవాల్, శుభ్ మన్ గిల్, హర్షల్ పటేల్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, యుజ్వేంద్ర చాహల్, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్ వంటి ప్రముఖులు వీడియో రూపంలో  'ఒక ఓటు విలువ' ను పాట ద్వారా వివరించారు.

ప్రముఖ దర్శకుడు, నిర్మాత, రచయిత సుభాష్ ఘాయ్, గాయకులు సోనూ నిగమ్, ఉస్తాద్ రషీద్ ఖాన్, కె ఎస్ చిత్ర, దీప్తి రేఖ పాధి, వైశాలి సామంత్, మెహమీత్ సయ్యద్, పాపన్, అభిషేక్ బొంతు, ఈసీఐ ఐకాన్ పంకజ్ త్రిపాఠి తదితరులు 13వ జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు.        

ప్రతి భారతీయుడు భారతదేశాన్ని ప్రేమిస్తాడు అన్న నమ్మకం నుంచి ఈ పాట సాహిత్యం ప్రేరణ పొందింది. ప్రజల ఆలోచన, హృదయాలు, మనస్సు భారతదేశం గురించి గర్వంగా మాట్లాడతాయి.  పురాతన మూలాలు  ప్రగతిశీల ఆధునిక  భావాలు కలిగిన భారతదేశం  భవిష్యత్తులో  ప్రపంచంలో బలమైన ప్రజాస్వామ్య దేశంగా అభివృద్ధి చెందడానికి సిద్ధంగా ఉంది. భారతదేశ భవిష్యత్తు నిర్దేశించడానికి ఓటర్లు ఉత్తమ పరిపాలకులు ఓటు ద్వారా ఎన్నుకోవాల్సి ఉంటుంది. హోదా, వర్గం, మతం, కులం, ప్రదేశం, భాష, లింగం తో సంబంధం లేకుండా ప్రతి భారతీయుడు ఓటు అనే శక్తిని ఉపయోగించి  'నేను భారతీయుడిని' (మై భారత్ హూన్) అని చెప్పడానికి గర్వపడుతున్నాడు. తమ కర్తవ్యాన్ని, దేశం కోసం ఓటు హక్కును అర్థం చేసుకున్న ప్రతి ఓటరు ఆధునిక భారతదేశం  ఉత్తమ రూపశిల్పి లో ఒకరిగా ఉండాలని ఆకాంక్షించే విధంగా  ' 'మై భారత్ హూం – భారత్ హై ముజ్మే – హమ్ భారత్ కే మత్తతా హై – మత్తన్ దేనే జాయేంగే భారత్ కే లియే' అంటూ సాగుతుంది.

 

*****



(Release ID: 1896203) Visitor Counter : 339