వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 8.88 ఎల్ ఎం టీ గోధుమలు ఓ ఎం ఎం ఎస్ (డీ) కింద ఇ-వేలం ద్వారా మొదటి రోజు 22 రాష్ట్రాల్లో విక్రయించింది.


మొదటి ఇ వేలంలో 1100 మందికి పైగా బిడ్డర్లు పాల్గొన్నారు.

Posted On: 02 FEB 2023 10:26AM by PIB Hyderabad

ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఫిబ్రవరి,1, 2023న జరిగిన మొదటి ఇ వేలంలో బహిరంగ మార్కెట్ అమ్మకం పధకం  (దేశీయ) కింద వివిధ మార్గాల ద్వారా సెంట్రల్ పూల్ స్టాక్ నుండి  ఇ-వేలం కోసం కేటాయించిన 25 ఎల్ ఎం టీ గోధుమ స్టాక్‌లో 22.0 ఎల్ ఎం టీ ని మార్కెట్‌కి అందించింది. మొదటి ఇ వేలంలో పాల్గొనేందుకు 1100 మంది పైగా బిడ్డర్లు ముందుకు వచ్చారు. మొదటి రోజు వేలంలో 22 రాష్ట్రాల్లో  8.88 ఎల్ ఎం టీ పరిమాణం విక్రయించింది. 

 

రాజస్థాన్‌లో బిడ్డింగ్ 02.02.2023న నిర్వహించబడుతుంది.

 

ఈ వేలం ద్వారా గోధుమల తదుపరి విక్రయం 2023 మార్చి 2వ వారం వరకు ప్రతి బుధవారం దేశవ్యాప్తంగా కొనసాగుతుంది.

 

ప్రభుత్వం  3 ఎల్ ఎం టీ గోధుమలను కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు భండార్, ఎన్ సీ సీ ఎఫ్  మరియు ఎన్ ఏ ఎఫ్ ఈ డీ వంటి పీ ఎస్ యూ లు/సహకార సంస్థలు/ఫెడరేషన్‌లకు  క్వింటాల్ కు రూ. 2350/ రాయితీ రేటుతో గరిష్ట రిటైల్ ధర కిలోకు రూ 29.50 తో ఇ-వేలం లేకుండా గోధుమలను అట్టాగా మార్చి విక్రయించటానికి రిజర్వ్ చేసింది.  పైన పేర్కొన్న పథకం కింద 7 రాష్ట్రాలలో 50000 ఎం టీ గోధుమ స్టాక్‌ను ఎన్ సీ సీ ఎఫ్ తీసుకోవడానికి అనుమతించబడింది. దేశవ్యాప్తంగా ఆటా ధరను తగ్గించేందుకు ఈ పథకం కింద 1 ఎల్ ఎం టీ  గోధుమలను ఎన్ ఏ ఎఫ్ ఈ డీ కి మరియు 1 ఎల్ ఎం టీ గోధుమలను కేంద్రీయ భండార్‌కు కేటాయించారు.

 

బహుళ మార్గాల ద్వారా రెండు నెలల వ్యవధిలో ఓ ఎం ఎం ఎస్ (డీ) పథకం ద్వారా 30 ఎల్ ఎం టీ గోధుమలను మార్కెట్‌లో ఆఫ్‌లోడ్ చేయడంతో గోధుమలు మార్కెట్‌లో  విస్తృతంగా చేరుకోవడంతో పెరుగుతున్న గోధుమ ధరలు అలాగే అట్టా ధరలపై తక్షణ ప్రభావం చూపుతుంది కాబట్టి పెరుగుతున్న ధరలను అదుపు చేయడంలో సహాయపడుతుంది. దీనితో సామాన్యులకు ఉపశమనం కలుగుతుంది.

 

దేశంలో పెరుగుతున్న గోధుమలు మరియు ఆటా ధరలను నిలువరించడానికి హోం మంత్రి శ్రీ అమిత్ షా నేతృత్వంలోని మంత్రుల బృందం ఆహార మరియు ప్రజా పంపిణీ శాఖ అనుసరించే కొన్ని సిఫార్సులను చేసింది.

*****


(Release ID: 1896198) Visitor Counter : 197