ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

జాతీయ కుష్టు వ్యాధి నిరోధక దినోత్సవాన్ని ఉద్దేశించి వర్చువల్‌గా ప్రసంగించిన కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్. మన్సుఖ్ మాండవియ


"ప్రభుత్వ మరియు పూర్తి సమాజ సహకారంతో మనం 2027 నాటికి అంటే ఎస్‌డిజీకి మూడు సంవత్సరాల ముందుగానే లెప్రసీ ముక్త్ భారత్ లక్ష్యాన్ని సాధించగలము"

ఈ కుష్టు వ్యాధి కార్యక్రమం వ్యాధిని ముందస్తుగా గుర్తించడం, వైకల్య నివారణకు ఉచిత చికిత్స మరియు ఇప్పటికే ఉన్న వైకల్యం ఉన్నవారికి వైద్య పునరావాసంపై దృష్టి పెడుతుంది: డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్

పునర్నిర్మాణ శస్త్రచికిత్స కోసం రోగులకు సంక్షేమ భత్యం రూ.8,000 నుండి రూ.12,000కి పెంచబడింది: డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్

కుష్టు వ్యాధి వ్యాప్తి రేటు 0.69/10,000 జనాభా (2014-15) నుండి 0.45 (2021-22)కి తగ్గింది

ప్రతి 100,000 జనాభాకు వార్షిక కొత్త కేసు గుర్తింపు రేటు 9.73 (2014-15) నుండి 5.52 (2021-22)కి తగ్గింది.

కుష్టు వ్యాధి చుట్టూ ఉన్న అపోహల గురించి మనం అవగాహన పెంచుకోవాలి: డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్

Posted On: 30 JAN 2023 3:23PM by PIB Hyderabad

"భారతదేశం పురోగతి సాధిస్తోంది మరియు ప్రతి సంవత్సరం కొత్త కుష్టువ్యాధి కేసులు తగ్గుతున్నాయి. ప్రభుత్వం, సమాజ మద్దతు, సమ్మేళనం మరియు సహకారంతో  మనం 2027 నాటికి ఎస్‌డిజీ కంటే మూడు సంవత్సరాల ముందుగానే లెప్రసీ ముక్త్ భారత్ లక్ష్యాన్ని సాధించగలము”. అని ఈ రోజు ఇక్కడ జరిగిన జాతీయ కుష్టు వ్యాధి నిరోధక దినోత్సవాన్ని పురస్కరించుకుని జరిగిన కార్యక్రమంలో తన వీడియో ప్రసంగంలో కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా ఈ విషయాన్ని తెలిపారు. ఈ సంవత్సరం థీమ్ “కుష్టు వ్యాధితో పోరాడుదాం మరియు లెప్రసీని చరిత్రగా మారుద్దాం”.

image.png


కుష్టు వ్యాధితో బాధపడుతున్న వ్యక్తుల పట్ల మహాత్మా గాంధీ నిరంతర ఆందోళనను పునరుద్ఘాటించిన కేంద్ర ఆరోగ్య మంత్రి..కుష్టు వ్యాధికి చికిత్స చేయాలనే శ్రద్ధ మరియు నిబద్ధత మన చరిత్రలో ఉందని పేర్కొన్నారు. " కృష్టు వ్యాధి గ్రస్తులకు చికిత్స చేయడమే కాకుండా మన సమాజంలో వారిని ప్రధాన స్రవంతిలో ఉంచడం కూడా మహాత్మా గాంధీ సంకల్పమని తెలిపారు. జాతీయ కుష్టు వ్యాధి నిర్మూలన కార్యక్రమం కింద ఈ దేశం నుండి కుష్టు వ్యాధిని నిర్మూలించడానికి మేము చేస్తున్న కృషి ఆయన దార్శనికతకు గొప్ప నివాళి. మేము 2005లో జాతీయ స్థాయిలో 10,000 జనాభాకు 1 కేసు ప్రాబల్యం రేటును సాధించడంలో విజయవంతమయ్యాము. కుష్టు వ్యాధిని నిర్మూలించడానికి నిరంతరం కృషి చేయడం నేటి అవసరం. ఇది నయం చేయగల వ్యాధి, అయితే ఇది ప్రారంభ దశలో గుర్తించి చికిత్స చేయకపోతే ఇది బాధిత వ్యక్తిలో శాశ్వత వైకల్యాన్ని కలిగిస్తుంది. ఇది సమాజంలో అలాంటి వ్యక్తులు మరియు వారి కుటుంబ సభ్యులపై వివక్షకు దారితీస్తుందిని తెలిపారు.

“గౌరవనీయులైన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి దూరదృష్టితో కూడిన నాయకత్వంలో మేము వ్యాధి అభివృద్ధి నివారణకు సమగ్ర చర్యలను అనుసరించాము. 2016 సంవత్సరం నుండి, లెప్రసీ కేస్ డిటెక్షన్ క్యాంపెయిన్ (ఎన్‌సిడిసీ) కింద కేసులను చురుగ్గా గుర్తించేందుకు కొత్త ప్రయత్నాలు జరిగాయి” అని ఆయన తెలిపారు.

 

image.png


జాతీయ కుష్టు వ్యాధి నిర్మూలన కార్యక్రమంపై కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ మాట్లాడుతూ “దేశంలో ప్రభుత్వం చేపట్టిన లెప్రసీ ప్రోగ్రామ్ వీలైనంత త్వరగా కేసులను గుర్తించి చికిత్స చేయడానికి ప్రయత్నిస్తుంది. వైకల్యాల అభివృద్ధిని నివారించడానికి ఉచితంగా చికిత్సను అందిస్తుంది. మరియు  ఇప్పటికే  వైకల్యాలు ఉన్నవారికి వైద్య సహాయం రోగులకు వారి పునర్నిర్మాణ శస్త్రచికిత్స కోసం సంక్షేమ భత్యం రూ. 8,000 నుండి రూ. 12,000 కు పెంచబడిందని వెల్లడించారు.

కార్యక్రమం సాధించిన విజయాలను తెలుపుతూ 2014-15లో 10,000 జనాభాకు 0.69గా ఉన్న కుష్టువ్యాధి ప్రాబల్యం 2021-22లో 0.45కి తగ్గిందని ఆమె తెలియజేశారు. ఇంకా, 100,000 జనాభాకు వార్షిక కొత్త కేసుల గుర్తింపు రేటు 2014-15లో 9.73 ఉండగా 2021-22 నాటికి 5.52కి తగ్గింది. "ఈ కార్యక్రమం అవగాహనను వ్యాప్తి చేయడానికి మరియు వ్యాధితో ముడిపడి ఉన్న అపోహలను తగ్గించడానికి కూడా పని చేస్తుంది. కుష్టు వ్యాధి అనుమానితుల కోసం ఏఎస్‌హెచ్‌ఏ-ఆధారిత నిఘా (అబ్‌సుల్స్)ను ప్రవేశపెట్టడం ద్వారా కూడా నిఘా బలోపేతం చేయబడింది, ఇక్కడ అట్టడుగు స్థాయి కార్మికులు నిరంతరం అనుమానితులను పరీక్షించి నివేదించడంలో నిమగ్నమై ఉంటారు. ఫోకస్డ్ లెప్రసీ క్యాంపెయిన్ (ఎఫ్‌ఎల్‌సి) కింద ప్రత్యేక ప్రాధాన్యతను యాక్సెస్ చేయడం కష్టంగా ఉన్న లేదా పిల్లల కేసులు మరియు వైకల్యాలున్న కేసులకు ఇవ్వబడింది. 2015 నుండి ఎన్‌ఎల్‌ఈపీ కింద నిరంతర ప్రయత్నాలతో  కుష్టు వ్యాధి కారణంగా అనేక వైకల్య కేసులను నివారించగలిగాము ”అని ఆమె తెలియజేశారు. కుష్టు వ్యాధికి సంబంధించిన అపోహలపై అవగాహన కల్పించాల్సిన అవసరాన్ని కూడా ఆమె నొక్కి చెప్పారు.

శ్రీ. కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యదర్శి ఎస్. గోపాలకృష్ణన్ 2027 కుష్టు వ్యాధి నిర్మూలన లక్ష్యాన్ని నొక్కి చెబుతూ 2027 చివరి మైలు లక్ష్యం ఇప్పటివరకు సాధించిన దానికంటే కఠినంగా ఉండబోతోందని పేర్కొన్నారు. అయితే గత అనుభవాలు  ప్రభుత్వం మరియు సమాజ విధానం, కొత్త వ్యూహాలు మరియు నికుస్త్‌ 2.0 పోర్టల్‌తో మనం దానిని సాధించగలమని విశ్వాసం వ్యక్తం చేశారు.

 

image.png


ఈ కార్యక్రమంలో నికుస్త్ 2.0 పోర్టల్‌ను ప్రారంభించడంతో పాటు లెప్రసీ కోసం జాతీయ వ్యూహాత్మక ప్రణాళిక & రోడ్‌మ్యాప్ (2023-27) మరియు యాంటీమైక్రోబయల్ రెసిస్టెన్స్ (ఏఎమ్‌ఆర్‌) నిఘా కోసం జాతీయ మార్గదర్శకాలు కూడా విడుదల చేయబడ్డాయి. వ్యూహం మరియు రోడ్‌మ్యాప్ కుష్టు వ్యాధికి వ్యతిరేకంగా ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్లడం, ప్రసారాన్ని ఆపడం, కేసుల గుర్తింపు ప్రయత్నాలను వేగవంతం చేయడం ద్వారా మరియు పటిష్టమైన నిఘా మౌలిక సదుపాయాలను నిర్వహించడం ద్వారా సహాయపడుతుంది. భారతదేశం కుష్టు వ్యాధి నిర్మూలన దిశగా పురోగమిస్తున్నందున వ్యవస్థను సన్నద్ధం చేయడానికి బలమైన ఏఎంఆర్ నిఘా వ్యవస్థ అవసరం. ఈ మార్గదర్శకాలు కుష్టు రోగులలో ఏఎమ్‌ఆర్ నిఘా కోసం ఒక బలమైన నిఘా వ్యవస్థను అభివృద్ధి చేయడంలో మరియు కొనసాగించడంలో సాంకేతిక మార్గదర్శకత్వం అందించడం అవసరం. నికుస్త్‌ 2.0 అనేది నేషనల్ లెప్రసీ ఎరాడికేషన్ ప్రోగ్రామ్ (ఎన్‌ఎల్‌ఈపీ) కింద లెప్రసీ కేస్ మేనేజ్‌మెంట్ కోసం ఒక ఇంటిగ్రేటెడ్ పోర్టల్. ఇది సమర్థవంతమైన డేటా రికార్డింగ్‌లో సూచికల రూపంలో డేటాను విశ్లేషించడం మరియు నివేదించడం మరియు కేంద్రం, రాష్ట్ర మరియు జిల్లా స్థాయిలలో రియల్ టైమ్
డాష్‌బోర్డ్‌లో సహాయపడుతుంది.

డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ దేశవ్యాప్త అవగాహన ప్రచారంలో భాగంగా కుష్టు వ్యాధికి సంబంధించిన అపోహలను రూపుమాపడానికి ఒక వీడియోను కూడా ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో ఎంఎస్ రోలీ సింగ్, ఏఎస్&ఎండీ (ఎన్‌హెచ్‌ఎం),ఎంఓహెచ్‌ఎఫ్‌డబ్లూ, శ్రీ రాజీవ్ మాంఝీ, జాయింట్ సెక్రటరీ లెప్రసీ, ప్రొఫెసర్ (డా) అతుల్ గోయెల్, డిజిహెచ్‌ఎస్, డా.రొడెరికో హెచ్‌ ఆఫ్రిన్, భారతదేశ డబ్లూహెచ్‌ఓ ప్రతినిధి, డాక్టర్ సుదర్శన్ మండల్,డిడిజీ మరియు ఇతర ప్రముఖులు మరియు అధికారులు పాల్గొన్నారు.


 

****


(Release ID: 1894786) Visitor Counter : 694