ప్రధాన మంత్రి కార్యాలయం
సుసంపన్న కశ్మీర్ సంస్కృతి, కళలు, హస్తకళా వైభవం ప్రదర్శించిన వితస్తా కార్యక్రమంపై ప్రధాని ప్రశంసలు
Posted On:
29 JAN 2023 8:46PM by PIB Hyderabad
సుసంపన్న కశ్మీర్ సంస్కృతి, కళలు, హస్తకళా వైభవం ప్రదర్శించిన వితస్తా కార్యక్రమంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. కశ్మీర్‌కు ప్రత్యేకమైన సుసంపన్న సంస్కృతి, కళలు, హస్తకళా వైభవ ప్రదర్శన లక్ష్యంగా కేంద్ర సాంస్కృతికి మంత్రిత్వశాఖ 2023 జనవరి 27-30 తేదీల మధ్య వితస్తా కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. కశ్మీర్ తన చారిత్రక గుర్తింపును ఈ కార్యక్రమం ద్వారా ఇతర రాష్ట్రాలకూ విస్తరింపజేస్తోంది. ‘ఒకే భారతం - శ్రేష్ట భారతం స్ఫూర్తికి ఇది ప్రతీకగా నిలుస్తోంది. దీనిపై అమృత మహోత్సవ్ ట్వీట్లకు ప్రతిస్పందనగా ప్రధానమంత్రి పంపిన ట్వీట్‌లో:
“సుసంపన్న కశ్మీర్ వారసత్వం, వైవిధ్యం, విశిష్టతలను అనుభవంలోకి తెచ్చిన అద్భుత కృషికి ఈ కార్యక్రమం ఒక నిదర్శనం” అని పేర్కొన్నారు.
*******
DS/ST
(Release ID: 1894661)
Visitor Counter : 190
Read this release in:
Urdu
,
English
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam