యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
కేఐవైజీ 2022లో అథ్లెట్ అనుభవాన్ని మెరుగుపరచడానికి ప్రత్యేక యాప్ ప్రారంభించబడింది; కేవలం మౌస్ క్లిక్‌తో పతకాల సంఖ్య,మ్యాచ్ షెడ్యూల్‌లు, వేదికలు, అథ్లెట్ ప్రశ్నలను పరిష్కరించడానికి చాట్‌బాట్ సెటప్ చేయబడింది
Posted On:
29 JAN 2023 4:00PM by PIB Hyderabad
ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2022 కోసం యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ప్రత్యేక మొబైల్ అప్లికేషన్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇందులో పాల్గొనే క్రీడాకారులు, కోచ్‌లు, సహాయక సిబ్బంది, అథ్లెట్ల తల్లిదండ్రులు మరియు గేమ్స్‌లో పాల్గొనే అన్ని రాష్ట్రాల అధికారులకు గేమ్ సమాచారం ఒక బటన్ క్లిక్‌తో అందించబడుతుంది. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ కోసం డెడికేటెడ్ యాప్‌ను ప్రారంభించడం ఇదే తొలిసారి.
ఈ యాప్‌లో అథ్లెట్ లాగిన్ ఉంటుంది. అతను లేదా ఆమె నమోదు చేసుకున్న సమయం నుండి గేమ్‌ల మొత్తం కోర్సు ద్వారా మద్దతు ఇస్తుంది. గేమ్‌లు ప్రారంభమయ్యే ముందు అతని లేదా ఆమె ధృవీకరించబడిన పత్రాలు అప్‌లోడ్ చేయబడి ఉన్నాయో లేదో తనిఖీ చేసే అవకాశాన్ని ఈ యాప్ అందిస్తుంది. ఇది రిజిస్ట్రేషన్ ప్రక్రియలో క్రీడాకారులకు మరింత పారదర్శకతను నిర్ధారిస్తుంది.
అతను లేదా ఆమె ఈ ఆటల్లో నమోదు చేసుకుని మధ్యప్రదేశ్‌లోని వేదికలకు చేరుకున్నప్పుడు అథ్లెట్‌కు వారి స్పోర్టింగ్ కిట్‌ల జారీ స్థితి, అథ్లెట్ బస చేయాల్సిన హోటల్, అథ్లెట్ల రవాణా వివరాలను తనిఖీ చేయవచ్చు. అలాగే అథ్లెట్లు అత్యవసర పరిస్థితుల్లో సంప్రదించాల్సిన ముఖ్యమైన నంబర్‌లు ఉంటాయి. ఇంకా గేమ్స్ జరిగే సమయంలో అథ్లెట్లు అడిగిన ప్రశ్నలకు తక్షణ సమాచారం అందించేందుకు వాట్సప్ చాట్‌బోట్ కూడా సృష్టించబడింది.
క్రీడా అభిమానులకు మ్యాచ్ షెడ్యూల్‌లు, పతకాల సంఖ్య, ఆటల వేదికల చిరునామా మరియు ఫోటో గ్యాలరీకి యాక్సెస్‌ను ఈ యాప్ అందిస్తుంది.
యాప్ ఆండ్రాయిడ్ మరియు యాపిల్ ఫోన్‌లకు అందుబాటులో ఉంది. అలాగే ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
యాప్ డౌన్‌లోడ్ లింక్‌లు:
ప్లేస్టోర్:
https://play.google.com/store/apps/details?id=com.sportsauthorityofindia.kheloindiagames
యాప్ స్టోర్:
https://apps.apple.com/in/app/khelo-india-games/id1665110083
వాట్సాప్ చాట్‌బాట్:
https://wa.me/919667303515?text=Hi%21
(Release ID: 1894520)
Visitor Counter : 248