హోం మంత్రిత్వ శాఖ

ఈరోజు కర్ణాటక లోని హుబ్లీలో బీవీ భూమరద్ది ఇంజనీరింగ్, టెక్నాలజీ కాలేజ్ ప్లాటినం జూబిలీలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా


గత 107 సంవత్సరాలుగా లక్షలాది ప్రజల జీవితాలలో వెలుగులు నింపిన కర్ణాటక లింగాయత్ విద్యా సంస్థ
సంస్థ ధ్యేయాలను పాటిస్తూ లక్ష్యాలు సాధిస్తూ ముందుకు సాగి నిరుపేదల విద్యా, వైద్య అవసరాలు తీర్చిన సంస్థగా పేరు

మన స్వాతంత్ర్య సమరయోధులు కలలుగన్న మహోన్నత భారతదేశ నిర్మాణానికి పునాది వేసిన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ
ప్రపంచానికి భారతదేశాన్ని తయారీ కేంద్రంగా మార్చటానికి మేకిన్ ఇండియా కింద అనేక చర్యలు తీసుకున్న ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ: ఫలితంగా ప్రపంచ ఆర్ధిక వ్యవస్థలో 11వ స్థానం నుంచి 5వ స్థానానికి చేరిన భారత్, 2027 నాటికి 3వ స్థానం చేరుతుందని అంచనా

ఈ లక్ష్యం ముందుంచుకొని యువత సాగిపోవాలి, టెక్నాలజీలో భారతదేశాన్ని ముందు వరుసలో నిలపాలి

యువత సంప్రదాయ ఆలోచనలనుంచి బైటికివచ్చి కొత్తగా ధైర్యంగా ఆలోచించాలి, ధైర్యవంతులనే అదృష్టం వరిస్తుంది

ఏడాదిలో లక్షలకొద్దీ పేటెంట్ దరఖాస్తులు రావటమే భారతదేశంలో పరిశోధన ఎంత వేగంగా సాగుతోందో చెబుతున్నది

Posted On: 28 JAN 2023 5:52PM by PIB Hyderabad

ఈరోజు కర్ణాటక లోని హుబ్లీలో బీవీ భూమరద్ది  ఇంజనీరింగ్, టెక్నాలజీ కాలేజ్ ప్లాటినం జూ

కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈరోజు కర్ణాటక లోని హుబ్లేలో బీవీ భూమరద్దీ ఇంజనీరింగ్, టెక్నాలజీ కాలేజ్ ప్లాటినం జూబిలీ వేడుకలలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.  కేంద్ర మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషి, కర్ణాటక ముఖ్యమంత్రి శ్రీ బసవరాజ్ బొమ్మయ్, తిరుపతి విశ్వ ధర్మ చేతనా మంచ్ కి చెందిన స్వామి శ్రీ బ్రహ్మర్షి గురుదేవ్సహా పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

 

Description: Description: C:\Users\Sarla\Downloads\107A1268.jpeg

ఈ సందర్భంగా శ్రీ అమిత్ షా మాట్లాడుతూ, ఈరోజు జన్మదినమైన గొప్ప స్వాతంత్ర్య సమర యోధుడు లాలా లజపతిరాయ్ ని ఎన్నటికీ మరువలేమన్నారు. ఇదే రోజు స్వతంత్ర భారత తొలి సైన్యాధిపతి  కె ఎం కరియప్ప జన్మదినం కూడా అని గుర్తు చేశారు. భారతదేశం స్వాతంత్ర్య వజ్రోత్సవాలు జరుపుకుంటున్న ఈ సమయంలో తన స్థానాన్ని పటిష్టం చేసుకొని ప్రపంచానికి తన బలం చాటిందాన్నారు. గత 107 ఏళ్ల కాలంలో కర్ణాటక లింగాయత్  విద్యా సంస్థ విద్యా ద్వారా లక్షలాది ప్రజల జీవితాలలో వెలుగులు నింపిందన్నారు. 

 

 1916లో ఒక చిన్న స్కూల్ గా మొదలైన కే ఎల్ ఈ సొసైటీ నేడు 294 సంస్థలకు చేరిందన్నారు. ఇప్పుడు లక్షా 38 వేలమంది చదువుతున్నారన్నారు.  107 సంవత్సరాలుగా ఈ సొసైటీని ప్రజాస్వామికంగా, పారదర్శకంగా నడుపుతున్నారని అభినందించారు.  400 పడకలతో ఈ సొసైటీ ఇప్పుడు వైద్య మౌలిక సదుపాయాలలో తనదైన పాత్ర  పోషిస్తున్నదన్నారు. నిరుపేదలకు ఉచిత వైద్యం అందించటాన్ని శ్రీ అమిత్ షా గుర్తు చేశారు.  ఈ సంస్థ విద్యార్థులు అందిస్తున్న సేవలను కూడా మంత్రి కొనియాడారు. 

 

Description: Description: C:\Users\Sarla\Downloads\107A1129.jpeg

25 కోట్ల ఖర్చుతో 3500 మంది కూర్చునే సామర్థ్యం ఉన్న ఇండోర్ స్టేడియం ఈరోజు ప్రారంభమైందని ఇందులో అనేక సౌకర్యాలున్నాయని శ్రీ అమిత్ షా చెప్పారు. తమ విద్యాసంస్థ నుంచి ఒకరిని ఒలంపిక్స్ కు పంపుతామని ప్రధానికి చేసిన వాగ్దానాన్ని సంస్థ త్వరలోనే నిలబెట్టుకుంటుందని అన్నారు.  

స్వాతంత్ర్య సమరయోధులు కలలుగన్న ఉజ్వల భారతదేశాన్ని నిర్మించటానికి ప్రధాని మోదీ పునాది వేశారని షా చెప్పారు. ప్రపంచ ఆర్ధిక వ్యవస్థలో 2014లో భారత్ స్థానం 11 కాగా ఈ ఎనిమిదేళ్లలో అది 5వ స్థానానికి చేరిందంటే అది ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గొప్పదనమేనన్నారు. భారతదేశాన్ని 5 ట్రిలియన్ల ఆర్ధిక వ్యవస్థగా తయారుచేయాలన్నది ప్రధాని కల అని గుర్తు చేశారు. అది సాకారమయ్యాక ఇలాంటి సాంకేతిక విశ్వావిద్యాలయాలకు అనేక అవకాశాలు వస్తాయన్నారు.

Description: Description: C:\Users\Sarla\Downloads\107A1165.jpeg

Description: Description: C:\Users\Sarla\Downloads\107A1312.jpeg

75 ఏళ్ల స్వతంత్ర భారత దేశం తన స్థానాన్ని సుస్థిర పరచుకొని ప్రపంచానికి తనశక్తిని చాటిందన్నారు. మేకిన్  ఇండియా కింద ప్రధాని తీసుకున్న చొరవల ఫలితంగా ప్రపంచ ఉత్పత్తి కేంద్రంగా భారత ఆర్ధిక వ్యవస్థ తన స్థానాన్ని 11 నుంచి 5కు మెరుగుపరచుకుందని గుర్తు చేశారు. 2013-14లో పేటెంట్ కోసం దరఖాస్తులు  3,000 కాగా, 2021-22 నాటికి  లక్షన్నరకు చేరటాన్ని శ్రీ అమిత్ షా గుర్తుచేశారు. పరిశోధన రంగం ఎదుగుదలకు ఇది నిదర్శనమన్నారు. ప్రధాన మంత్రి ముద్ర యోజన కింద 4.3కోట్ల మంది లబ్దిదారులకు 2,66,000కోట్ల రుణాలు అందించామన్నారు. 

75ఏళ్ల స్వాతంత్ర్యాన్ని ఆజాదీకా అమృత్ మహోత్సవ్ గా జరుపుకుంటున్న సమయంలో 1857 నుంచి 1947 వరకూ సాగిన 90 ఏళ్ల స్వాతంత్ర్య పోరాట చరిత్రను యువతరం  చదవాలన్నది ప్రధాని ఆకాంక్ష అని శ్రీ అమిత్ షా గుర్తు చేశారు. 

 

**********



(Release ID: 1894504) Visitor Counter : 122