రక్షణ మంత్రిత్వ శాఖ
స్టార్టప్20 ప్రారంభ సమావేశం - ఎన్ఐఐఒ ప్రదర్శన
प्रविष्टि तिथि:
28 JAN 2023 3:22PM by PIB Hyderabad
భారతదేశ జి 20 అధ్యక్షత కింద జరిగిన స్టార్టప్ 20 ఎంగేజ్‌మెంట్ గ్రూప్ ప్రారంభ సమావేశం సందర్భంగా భారతీయ నావికాదళ అధికారులు చేసిన వైద్య ఆవిష్కరణలను నావల్ ఇన్నొవేషన్ అండ్ ఇండిజెనైసేషన్ ఆర్గనైజేషన్ (ఎన్ఐఐఒ - నావికాదళ ఆవిష్కరణ & దేశీయకరణ సంస్థ) ప్రదర్శించింది. ఆద్యంత్ ఆక్సిజన్ రీసైక్టింగ్ సిస్టం (ఒఆర్ఎస్ -ఆక్సిజన్ పునర్వినియోగ వ్యవస్థలు), స్పందన్ - తక్కువ ధరకే డిజిటల్ స్టెతస్కోప్, నెబొరో - స్మార్ట్ పోర్టబుల్ నెబులైజర్ ( పొందికైన, తేలికైన నెబులైజర్) సహా వివిధ వైద్యపరమైన ఆవిష్కరణలను ప్రదర్శించారు.
జి 20 దేశాలకు చెందిన ప్రతినిధి బృందాలు సహా జి 20 షెర్పా అమితబ్ కాంత్, నీతీ ఆయోగ్ సిఇఒ పరమేశ్వరన్ అయ్యర్ సహా పలువురు సీనియర్ అధికారులు నావికాదళ అధికారులతో ముచ్చటించి, భారతీయ నావికాదళం - దేశ నిర్మాణం దిశగా ఆవిష్కరణలు అన్న ఇతివృత్తం కింద భారతీయ నావికాదళం చేపడుతున్న వినూత్న పనిని ప్రశంసించారు.
భారత జి20 అధ్యక్షతన చేపట్టిన ఈ రెండు రోజుల కార్యక్రమం హైదరాబాద్‌లో జనవరి 28, 29వ తేదీలలో జరుగుతోంది. స్టార్టప్‌లకు మద్దతునిచ్చే అంతర్జాతీయ వృత్తాంతాన్ని సృష్టించాలని స్టార్టప్20 ఆకాంక్షిస్తోంది, దీనితోపాటుగా, స్టార్టప్‌లు, కార్పొరేట్‌లు, పెట్టుబడిదారులు, ఆవిష్కరణ ఏజెన్సీలు, ఇతర కీలక పర్యావరణ వ్యవస్థ భాగస్వాముల మధ్య సమన్వయాన్ని సృష్టించాలని ఆశిస్తోంది.
DBTW.jpeg)
G96L.jpeg)
***
______
(रिलीज़ आईडी: 1894384)
आगंतुक पटल : 193