పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ
30 జనవరిన మంథన్ః నూతన మార్గాలలో పయనం అన్న ఇతివృత్తంతో ఒకరోజు చర్చా సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్న పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ
మరింత ప్రభావవంతమైన ఇ-గ్రామ్‌స్వరాజ్ 2.0 అప్లికేషన్‌ను సృష్టించడంపై వివిధ భాగస్వాముల చర్చలు
Posted On:
28 JAN 2023 11:39AM by PIB Hyderabad
భారతదేశంలో నిరంతరం అభివృద్ధి చెందుతున్న డిజిటల్ పర్యావరణం కారణంగా గ్రామీణ ప్రాంతాలకు కూడా ప్రభుత్వం నుంచి మెరుగైన ఇ- గవర్నెన్స్ వేదికల అవసరం అనుభవంలోకి వచ్చింది. గరిష్ట పాలన- కనీస ప్రభుత్వం అన్న విధాన లక్ష్యంతో రాబోయే తరం సంస్కరణలను అనుసరించే డిజిటల్ టెక్నాలజీని ఉసపయోగించుకునేందుకు పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ 30 జనవరి 2023న న్యూఢిల్లీలో ప్రధానంగా ఇ-గ్రామ్‌స్వరాజ్ సహా ప్రస్తుత ఇ-గవర్నెన్స్ అప్లికేషన్లను మెరుగుపరిచే రోడ్మ్యాప్‌ను అభివృద్ధి చేసేందుకు మేథోమథనం కోసం మంథన్ః నూతన మార్గాలలో పయనం అన్న సమావేశాన్ని నిర్వహిస్తోంది.
అందుబాటు, విషయాంశాల లభ్యత, సులభమైన ఉపయోగం, భద్రత & గోప్యత సమాచారం, సమగ్ర సేవల బట్వాడా తదితర కీలక పరామితుల పరిణామం, పరిధిని పరివర్తన చేసేందుకు మరింత ప్రభావవంతమైన ఇ-గ్రామ్ స్వరాజ్ 2.0 ను సృష్టించేందుకు ఒక ఏకీకృత అవగాహనను అభివృద్ధి చేసేందుకు సంపూర్ణ ఇన్‌పుట్లను ఖరారు చేస్తుంది. తద్వారా అప్లికేషన్ల పునర్వ్యవస్తీకరణ లేదా పునరుద్దరణను మరింత సమర్ధవంతమైన పద్ధతిలో చేపట్టడమే కాక పంచాయతీరాజ్ వ్యవస్థల (పిఆర్ఐ) రోజువారీ పనిని సరళతరం చేయడం జరుగుతుంది.
ఈ కార్యక్రమానికి జాతీయ/ అంతర్జాతీయ ప్రతిష్ఠకలిగిన సంస్థల నుంచి పరిశ్రమ నిపుణులు, పలు రాష్ట్రాల నుంచి ప్రతినిధులు/ సీనియర్ అధికారులు, విధానకర్తలు, పాలనారంగంలో పని చేస్తున్న రిసోర్స్ పర్సన్స్ హాజరుకానున్నారు. సోమవారం, 30 జనవరి 2023న జరుగనున్న మంథన్ సమావేశ ప్రత్యక్ష వెబ్ ప్రసారాలు ఉదయం 10 గంటల నుంచి ఎన్ఐసి వెబ్‌సైట్ లింక్ - https://webcast.gov.in/moprలో అందుబాటులో ఉంటాయి.
***
(Release ID: 1894325)
Visitor Counter : 154