రైల్వే మంత్రిత్వ శాఖ
2022లో రూ.7.37 కోట్ల విలువైన రైల్వే చోరీ సొత్తును స్వాధీనం చేసుకుని ,11268 మంది నేరస్థులను అరెస్టు చేసిన ఆర్ పి ఎ ఫ్
అదే ఏడాది 17,756 మంది చిన్నారులను రక్షించిన ఆర్ పి ఎ ఫ్ సిబ్బంది.
స్మగ్లర్ల బారి నుంచి 559 మందిని రక్షించి194 మంది స్మగ్లర్లను అరెస్టు చేసిన ఆర్ పి ఎ ఫ్ .
ఆపరేషన్ నార్కోస్ కింద 1081 మంది నేరస్తులను అరెస్టు చేసి సుమారు రూ.80 కోట్లవిలువైన ఎన్ డి పి ఎస్ ను రికవరీ చేయడంలో విజయం సాధించిన ఆర్ పి ఎ ఫ్
Posted On:
25 JAN 2023 10:48AM by PIB Hyderabad
రైల్వే ఆస్తులకు మెరుగైన రక్షణ ,భద్రత, కల్పించడానికి, రైల్వే ఆస్తుల రవాణాకు ఏవైనా అడ్డంకులను తొలగించడానికి, రైల్వే ఆస్తులకు మెరుగైన రక్షణ ,భద్రతకు దోహదపడే మరే ఇతర చర్య అయినా తీసుకోవడానికి భారత ప్రభుత్వం రైల్వే మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 1957,
ఆర్ పి ఎఫ్ చట్టం కింద రైల్వే రక్షక దళం- ఆర్ పి ఎఫ్ - ఏర్పాటు చేసింది. రైల్వే ప్రాపర్టీ (చట్టవిరుద్ధ స్వాధీనం) చట్టం, 1966 నిబంధనల ప్రకారం రైల్వే ఆస్తిపై నేరాల కేసులను పరిష్కరించే అధికారం ఆర్ పి ఎఫ్ కు ఉంది. 2004 నుంచి రైల్వే ప్రయాణికుల భద్రత బాధ్యతలను కూడా ఆర్ పి ఎఫ్ కు అప్పగించారు. రైల్వే ప్రయాణికులు, ప్రయాణీకుల ప్రాంతం ,రైల్వే ఆస్తులను రక్షించడంలో, ప్రజల రైలు ప్రయాణం సులభతరం చేయడంలో, మహిళలు ,పిల్లల అక్రమ రవాణాను నివారించడానికి అప్రమత్తంగా ఉండటం, రైల్వే ప్రాంతాలలో కనిపించే నిరుపేద పిల్లలకు పునరావాసం కల్పించడానికి తగిన చర్యలు తీసుకోవడంలో ఈ దళం అలుపెరగని కృషి చేస్తోంది. ఈ దళం అత్యధికంగా మహిళలు (9%) ఉన్న కేంద్ర దళంగా ప్రత్యేకత కలిగి ఉంది.
2022లో ఆర్ పి ఎఫ్ సాధించిన విజయాలు
ఆపరేషన్ "రైల్ సురక్ష" - ఈ ఆపరేషన్ కింద, రైల్వే ఆస్తిని రక్షించే ఆదేశం ప్రకారం, ఆర్ పి ఎఫ్ రైల్వే ఆస్తితో సంబంధం ఉన్న నేరాలకు వ్యతిరేకంగా చట్టపరమైన చర్యలు తీసుకుంది. 2022 ఏడాదిలో ఆర్ pi ఎఫ్ 6,492 రైల్వే ఆస్తి దొంగతనం కేసులను నమోదు చేసింది, ఇందులో 11268 మంది నేరస్థులను అరెస్టు చేసి, రూ .7.37 కోట్ల విలువైన దొంగిలించిన రైల్వే సొత్తును తిరిగి స్వాధీనం చేసుకున్నారు.
ఆపరేషన్ ‘ఉపలబ్ధ్' కింద దళారులపై చర్యలు- రిజర్వ్ డ్ వసతి కోసం రైల్వే టికెట్లను దళారులు పెద్దఎత్తున కొల్లగొడుతుండడం సామాన్యులకు చాలా ఇబ్బందిగా మారింది. కన్ఫర్మ్డ్ రైల్వే రిజర్వేషన్లను ఆన్ లైన్ లో కార్నర్ చేయడానికి చట్టవిరుద్ధమైన సాప్ట్ వేర్ ను ఉపయోగించడం వల్ల సామాన్యులకు కన్ఫర్మ్ టికెట్ల లభ్యతపై ప్రతికూల ప్రభావం పడింది. రైల్వే టికెట్ల కొనుగోలు, సరఫరా వ్యాపారాన్ని అనధికారికంగా నిర్వహిస్తున్న వ్యక్తులపై ఆర్ పి ఎఫ్ ముమ్మర, నిరంతర చర్యలు తీసుకుంటోంది.ఈ ఆపరేషన్ లో భాగంగా 5179 మంది దళారులను అరెస్టు చేసి, వారిపై 4884 కేసులు నమోదు చేశారు. ఇందులో ఐఆర్సీటీసీకి చెందిన 1021 మంది అధీకృత ఏజెంట్లు అక్రమ మార్గాలను ఉపయోగించి రిజర్వ్డ్ టికెట్లను కార్నర్ చేశారు. 140కి పైగా అక్రమ సాప్ట్ వేర్ల డెవలపర్లు, సూపర్ సెల్లర్లు, అమ్మకందారులు , రిటైలర్లను అరెస్టు చేశారు.
ఆపరేషన్ ‘నన్హే ఫరిస్టే‘ కింద పిల్లల రక్షణ- వివిధ కారణాల వల్ల వ కుటుంబం నుండి తప్పిపోయిన / విడిపోయిన ,సంరక్షణ/ రక్షణ అవసరమైన పిల్లలను గుర్తించడం రక్షించడం అనే ఉదాత్తమైన లక్ష్యాన్ని
ఆర్ పి ఎఫ్ చేపట్టింది. రైల్వే మంత్రిత్వ శాఖ 2021 డిసెంబర్ లో రైల్వే కు సంబంధించి ఆపదలో ఉన్న పిల్లల మెరుగైన సంరక్షణ ,రక్షణ కోసం సవరించిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ను జారీ చేసింది, ఇది 2022 లో అమలులోకి వచ్చింది. ఎస్ఓపీ ప్రకారం ప్రస్తుతం 143 రైల్వే స్టేషన్లలో సీహెచ్ డి లు పనిచేస్తున్నాయి. తమ కుటుంబం నుండి అనేక కారణాల వల్ల కోల్పోయిన / విడిపోయిన పిల్లలను తిరిగి కలపడంలో నూ, భారతీయ రైల్వేతో సంబంధంలోకి వచ్చిన సంరక్షణ / రక్షణ అవసరమైన పిల్లలను రక్షించడంలో ఆర్ పి ఎఫ్ ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. దీనికి సంబంధించి, రైళ్లు / రైల్వే స్టేషన్లలో సంరక్షణ ,రక్షణ అవసరమైన పిల్లలను రక్షించడానికి భారతీయ రైల్వేలో 'నన్హే ఫారిస్టే' అనే ఇంటెన్సివ్ డ్రైవ్ ప్రారంభించబడింది ఇది అద్భుతమైన ఫలితాలను చూపుతోంది. 2022 ఏడాది లో 17,756 మంది చిన్నారులను
ఆర్ పి ఎఫ్ సిబ్బంది రక్షించారు.
ఆపరేషన్ ‘ఎ ఎ హెచ్ టి - ఆర్ పి ఎఫ్‘ కింద మానవ అక్రమ రవాణాపై చర్యలు - పాన్ ఇండియా రీచ్ ఉన్న జాతీయ ప్రయాణ సంస్థకు కాపలాదారుగా ఉన్న ఆర్ పి ఎఫ్, మానవ అక్రమ రవాణాకు వ్యతిరేకంగా దేశం చేస్తున్న పోరాటంలో తన వంతు కర్తవ్యాన్ని భుజాల పై వేసుకుంది. మానవ అక్రమ రవాణా (హ్యూమన్ ట్రాఫికింగ్) కు వ్యతిరేకంగా 'ఆపరేషన్ ఎ ఎ హెచ్ టి ' పేరుతో ఈ దళం ఆపరేషన్ ప్రారంభించింది.
మానవ అక్రమ రవాణాదారుల ప్రయత్నాలను నివారించడానికి సమర్థవంతమైన యంత్రాంగాన్ని కలిగి ఉండటానికి, 2022 లో జారీ చేసిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ప్రకారం, ఆర్ పి ఎఫ్ కు చెందిన యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్లు భారతీయ రైల్వేలో 740 కి పైగా ప్రదేశాలలో పోస్ట్ లెవల్ (ఠాణా స్థాయి) వద్ద పనిచేస్తాయి. గత ఏడాదిలో ఈ
ఆపరేషన్ కింద 194 మంది స్మగ్లర్లను అరెస్టు చేయడంతో పాటు 559 మందిని స్మగ్లర్ల బారి నుంచి కాపాడారు.
మానవ అక్రమ రవాణాపై సమాచారాన్ని పంచుకోవడం, దాడులు నిర్వహించడం, సామర్థ్యాన్ని పెంపొందించడంలో భాగస్వామ్యం కోసం బచ్ పన్ బచావో ఆందోళన్ అని కూడా పిలిచే అసోసియేషన్ ఆఫ్ వాలంటరీ యాక్షన్ (నోబెల్ బహుమతి గ్రహీత శ్రీ కైలాష్ సత్యార్థి ఫౌండేషన్) తో ఆర్ పి ఎఫ్ 06.05.2022 న ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది.
మిషన్ "జీవన్ రక్ష" - హడావుడిలో ప్రయాణీకులు కదులుతున్న రైలు ఎక్కడానికి/ దిగడానికి ప్రయత్నించడం, జారిపడి రైలు చక్రాల కింద పడే ప్రమాదం ఉన్న సంఘటనలు ఉన్నాయి. ఆపదలో ఉన్నవారు ఉద్దేశపూర్వకంగా నడుస్తున్న రైలు ముందు వచ్చి ఆత్మహత్యకు ప్రయత్నించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ ఆపరేషన్ లో భాగంగా ఆర్పీఎఫ్ సిబ్బంది తమ ప్రాణాలను పణంగా పెట్టి ఇతరుల ప్రాణాలను కాపాడేందుకు ప్రయత్నిస్తారు. అలా 2022 లో ఆర్ పి ఎఫ్ సిబ్బంది 852 మంది ప్రాణాలను కాపాడారు.
ఆపరేషన్ "నార్కోస్"- మాదకద్రవ్యాలు యువత ఆరోగ్యాన్ని నాశనం చేయడమే కాకుండా దేశ ఆర్థిక వ్యవస్థను ,శ్రేయస్సును కూడా దెబ్బతీస్తాయి. 2019లో ఎన్‌డిపిఎస్ చట్టం కింద సెర్చ్, సీజ్ అరెస్ట్ చేయడానికి ఆర్‌పిఎఫ్‌కి అధికారం లభించింది. రైలు ద్వారా మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు వ్యతిరేకంగా డ్రైవ్‌పై దృష్టి కేంద్రీకరించడానికి, ఆర్‌పిఎఫ్ ఆపరేషన్ నార్కోస్‌ను ప్రారంభించింది .1081 మంది నేరస్థులను అరెస్టు చేసింది .తదుపరి చట్టపరమైన చర్యల కోసం సాధికారత గల ఏజెన్సీలకు అప్పగించింది. సుమారు రూ. 80 కోట్లు విలువైన మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకోవడం లో విజయం సాధించింది.
ఆపరేషన్ "అమానత్" కింద లగేజీని తిరిగి పొందడం అప్పగించడం - చాలా మంది ప్రయాణీకులు రైలు ఎక్కడానికి లేదా రైలు / స్టేషన్ నుండి బయలుదేరడానికి హడావుడిలో తమ వస్తువులన్నింటినీ తీసుకెళ్లడం మర్చిపోతారు. ఈ ఆపరేషన్ కింద ఆర్ పి ఎఫ్ సిబ్బంది అటువంటి వస్తువులను భద్రపరచడానికి ,వాటిని నిజమైన యజమానికి తిరిగి అప్పగించడానికి సహాయపడతారు. ఈ ఆపరేషన్ లో భాగంగా ఆర్ పి ఎఫ్ రూ.46.5 కోట్ల విలువైన 25500 లగేజీని స్వాధీనం చేసుకుంది.
ఆపరేషన్ ‘విలెప్‘'- వన్యప్రాణులు, జంతువుల భాగాలు ,అటవీ ఉత్పత్తులను అక్రమంగా రవాణా చేయడం ప్రకృతి వ్యతిరేక నేరం. ఆర్ పి ఎఫ్ ఈ సమస్య దృష్టి పెట్టింది. రైల్వేల ద్వారా వన్యప్రాణుల అక్రమ వ్యాపారంలో పాల్గొన్న స్మగ్లర్లపై ఈ ఆపరేషన్ కింద కఠినమైన చర్యలు తీసుకుంటోంది.
గత సంవత్సరంలో 129 నిషేధిత వన్యప్రాణుల అక్రమ వ్యాపారం కేసులు 75 మంది అరెస్టుతో గుర్తించబడ్డాయి. ఈ విభాగం లో డబ్ల్యు సి సి బి. ఇతర వాటాదారులతో ఆర్ పి ఎఫ్ కలసి పని చేస్తోంది.
ఆపరేషన్ 'యాత్రి సురక్ష'- ప్రయాణికులను, వారి వస్తువులను భద్రపరిచేందుకు ఆర్ పి ఎఫ్ అహర్నిశలు శ్రమిస్తోంది. ఈ దిశగా ఆర్ పి ఎఫ్ చేస్తున్న ప్రయత్నాలపై దృష్టి సారించేందుకు 2022లో ఆపరేషన్ యాత్రి సురక్షను ప్రారంభించారు.ఇది అత్యవసర ప్రతిస్పందనను మెరుగుపరచడం ద్వారా సకాలం లో ప్రయాణికుల భద్రతా సంబంధిత ఫిర్యాదులను పరిష్కరించడమే కాకుండా, ప్రయాణీకుల సంబంధిత నేరాల నివారణ ,గుర్తింపు కోసం జి ఆర్ పి తో కలిసి పనిచేస్తుంది.
ఎమర్జెన్సీ రెస్పాన్స్ - ఈ చొరవ కింద రైల్వేల ద్వారా ప్రయాణికుల భద్రత, సురక్షిత ప్రయాణంపై ఆర్ పి ఎఫ్ ప్రత్యేక దృష్టి సారిస్తుంది. టోల్ ఫ్రీ నంబర్ 139 (ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టమ్ నెం.112తో ఇంటిగ్రేటెడ్) ,ఇతర సోషల్ మీడియా ఫోరమ్ లు అంటే ట్విట్టర్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్, కూ మొదలైన వాటి ద్వారా కూడా ప్రయాణీకుల భద్రత ఇతర ఫిర్యాదులను స్వీకరించడానికి మరియు పరిష్కరించడానికి 24 గంటలూ.
ఆర్ పి ఎఫ్ కాల్ లో అందుబాటులో ఉంటుంది. ఈ ఏడాదిలో సకాలంలో సెక్యూరిటీ సంబంధిత సహాయం అవసరమైన ప్రయాణికుల రెండు లక్షలకు పైగా కాల్స్ ను ఆర్ పీ ఎఫ్ పరిష్కరించింది.
ప్రయాణీకుల నేరాల నిరోధం -గుర్తింపు: ఈ ఆపరేషన్ కింద, ఆర్ పి ఎఫ్ రైల్వేల ద్వారా ప్రయాణీకుల భద్రత ,సురక్షిత ప్రయాణంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఐపిసి కింద ప్రయాణీకుల సంబంధిత నేరాల కేసులలో ఆర్ పి ఎఫ్ గుర్తించిన కేసులు, అరెస్టు చేసిన వ్యక్తులను తదుపరి చట్టపరమైన చర్యల కోసం జిఆర్పి / పోలీసులకు అప్పగిస్తారు. ఈ ఏడాదిలో ఆర్ పి ఎఫ్ ఐపిసి కింద వివిధ రకాల ప్రయాణీకుల సంబంధిత నేరాలకు పాల్పడిన 5749 మంది నేరస్థులను అరెస్టు చేసి జిఆర్పి / పోలీసులకు అప్పగించింది.వీరిలో 82 మంది మాదకద్రవ్యాల రవాణా కు పాల్పడిన వారు, 30 మంది బందిపోట్లు, 380 మంది దోపిడీ దారులు, 2628 మంది దొంగలు, 1016 మంది చైన్ స్నాచర్లు, మహిళలపై నేరాలకు పాల్పడిన వారు 93 మంది ఉన్నారు.
మహిళల భద్రతకు ఆపరేషన్ మహిళా సురక్ష - 2020 అక్టోబర్ నుండి భారతీయ రైల్వే అంతటా 'మేరీ సహేలీ‘ చొరవ కింద మహిళల భద్రతను మరింత మెరుగుపరిచారు. సుదూర రైళ్లలో ఒంటరిగా లేదా మైనర్లతో ప్రయాణించే మహిళా ప్రయాణీకులకు వారి ప్రారంభ స్టేషన్ నుండి ముగింపు స్టేషన్ వరకు వారి మొత్తం ప్రయాణానికి భద్రత, రక్షణ అందించడం ఈ చొరవ లక్ష్యం.దీని అమలు కోసం అన్ని జోనల్ రైల్వేల్లో ప్రత్యేకంగా మహిళా ఆర్ పి ఎఫ్ సిబ్బంది తో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం, భారతీయ రైల్వేలో సగటున రోజుకు 640 కి పైగా రైళ్లను కవర్ చేయడానికి సగటున 243 బృందాలను నియమించారు. ఈ మేరీ సహేలీ బృందాలను శక్తివంతం చేయడానికి, భద్రత ,భరోసా అవసరమయ్యే మహిళా ప్రయాణీకుల లక్ష్య సమూహాన్ని గుర్తించడంలో ఈ బృందాలకు సహాయపడటానికి 2022 లో మేరీ సహేలీ ఐటి మాడ్యూల్ ను ప్రారంభించారు.
మహిళా ప్రయాణీకుల భద్రత భారతీయ రైల్వే ప్రాధాన్యతా అంశం. మహిళా ప్రయాణీకుల భద్రత కోసం పురుష, మహిళా ఆర్ పి ఎఫ్ సిబ్బందితో రైలు ఎస్కార్ట్, 861 స్టేషన్లు, 6368 బోగీల్లో సీసీటీవీ వ్యవస్థ, లేడీస్ స్పెషల్ సబర్బన్ రైళ్లలో లేడీ ఎస్కార్ట్స్, లేడీస్ కోచ్ లలో అనధికారిక ప్రయాణికులపై రెగ్యులర్ డ్రైవ్ లు వంటి ఇతర నివారణ చర్యలను అమలు చేశారు.
ఆపరేషన్ మాతృశక్తి కింద ప్రసవ సమయంలో గర్భిణులకు సహాయం- ఆర్ పి ఎఫ్ సిబ్బంది ముఖ్యంగా మహిళా సిబ్బంది రైలు ప్రయాణంలో ప్రసవంలో ఉన్న గర్భిణులకు ఆపరేషన్ మాతృశక్తి కింద సహాయం చేస్తున్నారు. గత ఏడాది ఆర్ పి ఎఫ్ మహిళా సిబ్బంది 209 మంది చిన్నారుల జననాలకు సహకరించారు.
ఆపరేషన్ "సేవ" కింద రోగులు, క్షతగాత్రులు, వికలాంగులకు సహాయం - ఈ ఆపరేషన్ కింద ఆర్ పి ఎఫ్ సిబ్బంది వృద్ధులు, మహిళలు, శారీరక వికలాంగులు ,అనారోగ్యంతో / గాయపడిన వ్యక్తులకు రైలు ప్రయాణం లో వీల్ చైర్లు, స్ట్రెచర్, వైద్య సహాయం, అంబులెన్స్, మందులు , పిల్లలకు ఆహారం వంటి ఇతర సౌకర్యాలను అందిస్తారు. గత ఏడాది ఇలా 37,000 మందికి పైగా ఆర్ పి ఎఫ్ సాయం చేసింది.
ఆపరేషన్ "సతార్క్" కింద నిషిద్ధ / అక్రమ వస్తువుల రవాణాపై చర్యలు: రైళ్ల ద్వారా నిషేధిత వస్తువుల రవాణా పన్ను ఎగవేతదారులకు/ చట్టాన్ని ఉల్లంఘించేవారికి ప్రధాన మార్గంగా మారింది. పొగాకు ఉత్పత్తులు, మద్యం, ఎఫ్ఐసిఎన్ / లెక్కల్లోకి రాని బంగారం / లెక్కల్లోకి రాని నగదు / లెక్కల్లోకి రాని ఇతర విలువైన లోహాలు / స్మగ్లింగ్ వస్తువులు / ఆయుధాలు ,మందుగుండు సామగ్రి / పేలుడు పదార్థాలు ,నిషేధిత మందులు వంటి వస్తువులను రికవరీ చేయడంలో ఆర్ పి ఎఫ్ తనంతట తానుగా ఇతర ఎల్ఇఎలకు సహాయపడటం ఈ ఆపరేషన్ లక్ష్యం.
గత సంవత్సరం లో 23,311 మందిని అరెస్టు చేసి తదుపరి చట్టపరమైన చర్యల కోసం సంబంధిత ఎల్ఈఏలకు అప్పగించింది. ఈ డ్రైవ్ లో రూ. 7.47 కోట్ల విలువైన పొగాకు ఉత్పత్తులు; రూ.3.32 కోట్ల విలువైన మద్యం. , క్రింద పేర్కొన్న ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నారు.
సరకు/వస్తువు
|
స్వాధీనం చేసుకున్న
ఆస్తి విలువ (రూ. కోట్లలో).
|
లెక్కల్లోకి రాని బంగారం
|
48.8
|
లెక్కల్లోకి రాని వెండి
|
8.21
|
లెక్కల్లోకి రాని ఇతర విలువైన లోహాలు
|
0.35
|
విదేశాలకు చెందిన ఇతర స్మగ్లింగ్ వస్తువులు
|
2.77
|
లెక్కల్లోకి రాని నగదు
|
25.37
|
ఆయుధాలు/మందుగుండు సామగ్రి/పేలుడు పదార్థాలు
|
0.82
|
నిషేధిత ఇంజెక్షన్లు వంటి ఇతర రికవరీలు.
|
1.7
|
ఆపరేషన్ 'సంరక్ష' కింద రైలు కార్యకలాపాల భద్రతను పెంచే ప్రయత్నాలు: ప్రయాణికుల భద్రతను పెంచడానికి ఈ ఆపరేషన్ ప్రారంభించబడింది. కదులుతున్న రైలుపై రాళ్లు రువ్వడం, రైలులో బాణసంచా కాల్చడం వంటి నేరాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటున్నారు. ఈ ఏడాదిలో కదులుతున్న రైళ్లపై రాళ్లు రువ్విన 1503 కేసులను ఆర్ పి ఎఫ్ నమోదు చేసి 488 మందిని అరెస్టు చేసింది. రైల్వే ట్రాక్ సమీపంలో నివాసితులకు అవగాహన కల్పించడానికి ఆర్ పి ఎఫ్ వివిధ మార్గాలను ఉపయోగించి అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఈ డ్రైవ్ లో రైళ్లలో మండే/ టపాసులు తరలిస్తున్న 100 మందికి పైగా వ్యక్తులను కూడా అరెస్టు చేశారు.
హిమాచల్ ప్రదేశ్, గుజరాత్, గోవా, మణిపూర్, పంజాబ్, ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో మోహరించిన ఆర్ పి ఎఫ్ దళాలు స్వేచ్ఛాయుత, నిష్పాక్షిక ఎన్నికల నిర్వహణకు, అసెంబ్లీ / పార్లమెంటరీ ఎన్నికల సమయంలో ఎటువంటి దురదృష్టకరమైన
సంఘటనలు జరగకుండా నివారించడంలో సహాయపడ్డాయి.
ఆపరేషన్ 'సాథీ' కింద సివిక్ యాక్షన్ ప్రోగ్రామ్- ఈ ఆపరేషన్ కింద, రైల్వే ట్రాక్ లకు ఆనుకుని ఉన్న ప్రాంతాలలో యువత నైపుణ్యాభివృద్ధికి లాభదాయక ఉపాధిని సులభతరం చేయడానికి.
అనేక కమ్యూనిటీ అవుట్ రీచ్ కార్యక్రమాలు అమలు చేశారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్ ద్వారా
పీఎస్ యూ లను అనుసంధానం చేసే వారికి సరైన శిక్షణ ఇచ్చారు. సమాజంతో నమ్మక బంధాన్ని పెంపొందించడం, నిస్సహాయ యువతను నేరాల మార్గం నుంచి విముక్తం చేయడం, రైల్వేలు, దాని ప్రయాణికులపై నేరాల భద్రత, నియంత్రణకు కమ్యూనిటీ సహాయం పొందడం దీని ఉద్దేశం.
ఆపరేషన్ డిగ్నిటీ కింద సంరక్షణ, రక్షణ అవసరమైన వయోజనులను రక్షించడం- ఈ ఆపరేషన్ కింద పారిపోవడం, వదిలేయడం, మాదకద్రవ్యాలకు బానిస కావడం, నిరాశ్రయులు, అపహరణకు గురికావడం, అదృశ్యం కావడం, వైద్య సహాయం అవసరమైనవారు, కిందపడి, మానసికంగా దిక్కుతోచని స్థితిలో ఉన్న సంరక్షణ మరియు రక్షణ అవసరమైన మహిళలతో సహా పెద్దలను రక్షించడం జరుగుతుంది. 2022లో దాదాపు 3400 మందిని రక్షించారు.
ఆపరేషన్ రైల్ ప్రహరి కింద రైళ్లలో పారిపోతున్న అనుమానితులను పట్టుకోవడంలో రాష్ట్ర పోలీసులు ,ఇతర చట్టాల అమలు సంస్థలకు అందించడం- ఆర్ పి ఎఫ్ సిబ్బంది ప్రధాన స్టేషన్లలో వారి వ్యూహాత్మక స్థానాలు, వారి పాన్-ఇండియా ముద్ర, వారి కమాండ్ ఐక్యత ,పర్యవేక్షణ ,అత్యవసర పరిస్థితికి సత్వర ప్రతిస్పందనలో వారి యు ఎస్ పి ని కలిగి ఉంటారు.ఫలానా రాష్ట్ర పోలీసులు తమ అనుమానితులు ప్రస్తుతం వేరే రాష్ట్రం గుండా రైళ్ల ద్వారా తప్పించుకు తిరుగుతున్నట్లు గుర్తించినప్పుడు ఇది ఉపయోగ పడుతుంది. అంతేకాకుండా, చట్టం చేయి నుంచి తప్పించుకునే చాలా మంది అనుమానితులు తమ రొటీన్ చెకింగ్ ప్రోటోకాల్ సమయంలో ఆర్ పి ఎఫ్ వలలో చిక్కుకుంటారు. ఆపరేషన్ రైల్ ప్రహరి కింద, ఆర్ పి ఎఫ్ తన
యు ఎస్ పి ని ఇతర పోలీసు దళాలకు/ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలకు రైళ్ల ద్వారా పారిపోతున్న అనుమానితులను పట్టుకోవడంలో ఉపయోగిస్తుంది. 2022లో ఇలాంటి 151 మంది అనుమానితులను రైల్వే ప్రాంతం వెలుపల వారు చేసిన నేరాలకు సంబంధించి ఆర్ పి ఎఫ్ పట్టుకుని సంబంధిత ఏజెన్సీలకు అప్పగించింది.
********
(Release ID: 1893616)
Visitor Counter : 164