రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
వివిధ మౌలిక సదుపాయాల అమలు సంబంధించి ఉనికిలో ఉన్న అంతర్ మంత్రిత్వ శాఖల సమస్యలను పరిష్కరించేందుకు మౌలిక సదుపాయాల కమిటీ గ్రూపు 10వ సమావేశానికి అధ్యక్షత వహించిన శ్రీ నితిన్ గడ్కరీ
పిఎం గతిశక్తి పథకం పురోగతిని వేగవంతం చేసేందుకు కార్యాచరణ ప్రణాళికను ప్రవేశపెట్టినట్టు వెల్లడించిన శ్రీ గడ్కరీ
Posted On:
24 JAN 2023 6:26PM by PIB Hyderabad
వివిధ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల అమలుకు సంబంధించి ఉనికిలో ఉన్న అంతర్ మంత్రిత్వ శాఖ సమస్యలను పరిష్కరించేందుకు మౌలిక సదుపాయాల కమిటీ గ్రూపు 10వ సమావేశానికి మంగళవారంనాడు కేంద్ర రోడ్డు రవాణా & రహదారుల శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ అధ్యక్షత వహించారు. పిఎం గతిశక్తి పథక పురోగతిని వేగవంతం చేసేందుకు కార్యాచరణ ప్రణాళికను ప్రవేశపెట్టినట్టు శ్రీ గడ్కరీ తెలిపారు.
కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయెల్, కేంద్ర రైల్వేలు, కమ్యూనికేషన్లు, ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్, కేంద్ర పర్యావరణ, అటవీ & పర్యావరణ మార్పు, శ్రామికులు & ఉపాధిశాఖ మంత్రి శ్రీ భూపేందర్ యాదవ్, ఆర్‌టి&హెచ్ & పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి జనరల్ (డాక్టర్) వికె సింగ్ (రిటైర్డ్), విద్యుత శాఖ సహాయమంత్రి శ్రీ క్రిషన్ పాల్ గుజ్జర్, ఓడరేవులు, షిప్పింగ్ & జలమార్గాల శాఖ సహాయమంత్రి శ్రీ శ్రీపాద్ నాయక్, రక్షణ& పర్యాటక మంత్రిత్వ శాఖ సహాయమంత్రి శ్రీ అజయ్‌భట్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.
రోడ్డు రవాణా & రహదారులు (ఎంఒఆర్‌టిహెచ్) మంత్రిత్వ శాఖ, రక్షణ మంత్రిత్వ శాఖ (ఎంఒడి), పర్యావరణం, అడవులు, పర్యావరణ మార్పు (ఎంఒఇఎఫ్‌సిసి), రైల్వే మంత్రిత్వ శాఖ (ఎంఒఆర్), వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ (ఎంఒసిఐ), విద్యుత్ మంత్రిత్వ శాఖ (ఎంఒపి), పౌర విమానయాన మంత్రిత్వ శాఖ (ఎంఒసిఎ), భారత జాతీయ రహదారుల ప్రాధికరణ సంస్థ (ఎన్‌హెచ్ఎఐ), నేషనల్ హైవేస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్‌హెచ్ఐడిసిఎల్) సీనియర్ అధికారులు, రాష్ట్రాల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
కొనసాగుతున్న మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల పురోగతిని వేగవంతం చేసేందుకు చర్చించేందుకు వివిధ అంశాలను అజెండాలో పొందుపరిచారు. ఇందులో పెండింగులో ఉన్న అటవీ, పర్యావరణ అనుమతులు, పని అనుమతులు/ ఆమోదాలు, భూమి కేటాయింపు/ బదిలీ ఖరారు, నిధుల విడుదల వంటి అంశాలు ఇందులో ఉన్నాయి. పర్యావరణం/ అడవులు/ వన్యప్రాణులు, రైల్వేలు, విద్యుత్ కు సంబంధించిన ఆమోదాలు, పర్యావరణ అనుమతులు,రైల్వేలు &ఎంఒఆర్‌టిహెచ్ భూ విధానాలు, పర్యావరణ, అటవీ అనుమతులకు సమగ్రమైన మార్గదర్శకాలను రూపొందించడం సహా విధానపరమైన వివిధ అంశాలను కూలంకుషంగా చర్చించారు.
పైన పేర్కొన్న అంశాలలో అనుమతుల ప్రక్రియను వేగవంతం చసి, అమలు అయ్యే ప్రక్రియను వేగవంతం చేయవలసిందిగా సంబంధిత అధికారులను నిర్దేశించారు. మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు వేగవంతంగా పూర్తయ్యేందుకు సమావేశంలో లేవనెత్తిన పలు అంశాలను పరిశీలించి,పరిష్కరించేందుకు భాగస్వామ్య మంత్రిత్వ శాఖలు/ విభాగాలు అంగీకరించాయి.
****
(Release ID: 1893483)
Visitor Counter : 160