హోం మంత్రిత్వ శాఖ

అండమాన్ నికోబార్‌ ద్వీపాల్లో పేరులేని 21 దీవులకు పరమవీర చక్ర గ్రహీతలపేరిట నామకరణం!


నామకరణ కార్యక్రమంలో వర్చువల్‌గా పాలుపంచుకున్న
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ

సుభాష్ చంద్రబోస్ ద్వీపంలో నేతాజీకి అంకితం చేసిన
జాతీయ స్మారక నమూనా ఆవిష్కరణ.

పోర్ట్ బ్లెయిర్‌లో జరిగిన చారిత్రాత్మక కార్యక్రమంలో
పాల్గొన్న కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి అమిత్ షా.

దేశ త్రివిధ దళాలకు ఇది ముఖ్యమైన రోజన్న అమిత్ షా..
సైనికుల ధైర్యసాహసాలను, త్యాగాలను ఇంత గొప్పగా

ప్రపంచంలో ఏ ఇతర దేశం గౌరవించలేదని వ్యాఖ్య..

పరమవీర చక్ర గ్రహీతల స్మారకాన్ని సృష్టించిన ప్రధాని
త్రివిధ దళాలకు ఇది ఎంతో ప్రోత్సాహకరమని ప్రశంసలు..

దేశ స్వాతంత్య్ర పోరాటంలో అసమాన కృషి చేసిన
నేతాజీ 126వ జయంతి రోజున
సుభాష్ స్మారక చిహ్నం ప్రకటన


21 దీవులకు సాహసవంతుల పేరిట నామకరణంతో
వారికి సముచిత గౌరవం ఇచ్చిన ప్రధాని మోదీ..

యావద్దేశ చరిత్రలో ఈ సంఘటన
సువర్ణాక్షరాలతో లిఖితం..

ప్రధాని తీసుకున్న ఈ రెండు నిర్ణయాలతో
అండమాన్ నికోబార్ దీవుల స్వాతంత్ర్య స్మృతులు యావద్దేశంతో అనుసంధానం చేస్తాయి...

ఈ నిర్ణయాలతో దేశంలోని యువతకు దేశభక్తి,
శౌర్య సందేశం యుగాలపాటు స్ఫూర్తిగా నిలుస్తాయి.

పరమవీర చక్ర అవార్డ

Posted On: 23 JAN 2023 5:13PM by PIB Hyderabad

       అండమాన్-నికోబార్ దీవులలో పేరులేని 21 పెద్ద దీవులకు 21 మంది పరమవీర చక్ర అవార్డు గ్రహీతల పేరిట నామకరణం చేసే కార్యక్రమంలో  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ  రోజు వీడియో కాన్ఫరెన్స్గింగ్ ద్వారా పాల్గొన్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ద్వీపంలో నిర్మించనున్న, నేతాజీకి అంకితం చేసిన జాతీయ స్మారక నమూనాను కూడా ప్రధానమంత్రి ఆవిష్కరించారు. ఈ చారిత్రాత్మక సందర్భాన్ని పురస్కరించకుని అండమాన్ నికోబార్ దీవుల రాజధాని పోర్ట్ బ్లెయిర్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి అమిత్ షా పాల్గొన్నారు. పరమవీర చక్ర అవార్డు గ్రహీతలు సుబేదార్ మేజర్ రిటైర్డ్ (గౌరవ కెప్టెన్) యోగేంద్ర సింగ్ యాదవ్, సుబేదార్ మేజర్ సంజయ్ కుమార్, నాయబ్ సుబేదార్ బానా సింగ్లను, ఇతర సైనికుల కుటుంబ సభ్యులను ఆయన సత్కరించారు. అండమాన్-నికోబార్ దీవుల లెఫ్టినెంట్ గవర్నర్ అడ్మిరల్ డి.కె. జోషి సహా పలువురు ప్రముఖులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

  https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001ZXGI.jpg

   ఈ సందర్భంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రసంగిస్తూ, దేశంలోని త్రివిధ దళాలకు ఈ ఇది ఎంతో ముఖ్యమైన రోజని అన్నారు. సైనికుల పరాక్రమాన్ని, ధైర్యసాహసాలను గౌరవిస్తూ వారి పేర్లతో దీవులకు నామకరణం చేయడం ఇంతకు ముందు ఏ దేశంలోనూ జరగలేదన్నారు.  ఈ రోజు, మన పరమవీర చక్ర అవార్డు గ్రహీతలను శాశ్వతంగా స్మరించుకోవడానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేసిన కృషి త్రివిధ దళాలకు చాలా ప్రోత్సాహకరంగా ఉందన్నారు. నేడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ 126వ జయంతిని దేశవ్యాప్తంగా పరాక్రమ్ దివస్‌గా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. స్వాతంత్య్రోద్యమ సమయంలో నేతాజీ బస చేసిన అండమాన్‌ నికోబార్‌ దీవుల్లోని సుభాష్‌ ద్వీపంలో ఆయన స్మారక చిహ్నం నిర్మించాలని కూడా ఈ సందర్భంగా నిర్ణయించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీసుకున్న ఈ రెండు నిర్ణయాలు అండమాన్ నికోబార్ దీవుల స్వాతంత్య్ర స్మృతులను దేశం మొత్తానికి అనుసంధానం చేస్తాయని, ఈ నిర్ణయాలు భారతదేశంలోని యువతలో యుగాల తరబడి దేశభక్తిని, శౌర్యాన్ని నింపుతుందని శ్రీ షా అన్నారు.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002E3MX.jpg

   ఒక్కోసారి ఒక్కో ప్రాంతం అందరి దృష్టిని ఆకర్షిస్తుందని కేంద్ర హోంమంత్రి అన్నారు. 1857 స్వాతంత్ర్య విప్లవం తరువాత, బ్రిటిష్ వారు స్వాతంత్ర్య సమరయోధులను నిర్దాక్షిణ్యంగా హింసించడం ప్రారంభించినప్పుడు, ఈ అండమాన్ మరియు నికోబార్ దీవులలో, మన విప్లవకారులను సెల్యులార్ జైలులో ఉంచారని, ఆ సమయంలో అండమాన్-నికోబార్ ప్రాతం స్వాతంత్ర్య సమరయోధులను తల్లిలా అక్కున చేర్చుకుని ఓదార్చిందని అన్నారు. స్వాతంత్య్ర పోరాటానికి సెల్యులార్ జైలు గొప్ప యాత్రాప్రాంతమని దేశ విముక్తి కోసం నేతాజీ చేసిన కృషి వల్ల ‘ఆజాద్ హింద్ ఫౌజ్’ దేశంలోని ఈ ప్రాంతాన్ని స్వాతంత్ర్యంతో గౌరవించిందని, నేతాజీ ఈ ద్వీపంలో మొదటిసారి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారని ఆయన అన్నారు.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003YVPS.jpg

  సెల్యులార్ జైలు కారణంగా అండమాన్-నికోబార్ దీవుల ప్రాంతం ఇప్పటికే స్వాతంత్ర్య పుణ్యభూమిగా, యాత్రాస్థలంగా మారిందని, అప్పుడు నేతాజీ ఈ పవిత్ర భూమికి విముక్తి కలిగించి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారని కేంద్ర హోం మంత్రి అన్నారు. నేతాజీ అడుగుజాడల్లో షహీద్ ద్వీప్, స్వరాజ్ ద్వీప్, సుభాస్ ద్వీప్ అని ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ నామకరణం చేశారని, దేశ స్వాతంత్య్రం, సార్వభౌమాధికారం కోసం తమ ప్రాణాలను త్యాగం చేసి పోరాడిన వారి పేరిట మీద 21 ద్వీపాలకు నామకరణం చేశారని ఆయన అన్నారు. ఈ సాహసవంతుల పేర్లను నేడు 21 దీవులకు పెట్టడం ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వారి శౌర్య పరాక్రమాలకు తగిన గౌరవం ఇచ్చారని అమిత్ షా అన్నారు. యావత్ భారతదేశ చరిత్రను ఎప్పుడు లిఖించినా, ఈ సంఘటన సువర్ణాక్షరాలతో లిఖించబడుతుందన్నారు.

   దేశ స్వాతంత్య్ర పోరాటంలో అసమానమైన కృషి చేసిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ 126వ జయంతి సందర్భంగా నేడు సుభాస్ స్మారక చిహ్నంపై కూడా ప్రకటన చేసినట్టు అమిత్ షా తెలిపారు. దేశ విముక్తి కోసం నేతాజీ సుభాష్ చంద్రబోస్ కోల్‌కతా నుంచి బెర్లిన్ వరకు మైనస్ 45 డిగ్రీల ఉష్ణోగ్రతలో పూర్తి ప్రతికూల వాతావరణ పరిస్థితుల మధ్య 15,000 కిలోమీటర్లు ప్రయాణించారని, అయితే దురదృష్టవశాత్తు ఆయన కృషిని అణగదొక్కేందుకు అనేక ప్రయత్నాలు జరిగాయని అన్నారు. కానీ వీరులు తమకు గుర్తింపుకోసం ఎవరిపైనా ఆధారపడరని, గుర్తింపు వారి ధైర్యంతో ముడిపడి ఉందని చెబుతారని అన్నారు. నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత మన జాతి గర్వించదగ్గ నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని ‘కర్తవ్య పథం’లో ఏర్పాటు చేశామని చెప్పారు. జనవరి 23వ తేదీని పరాక్రమ్ దివస్‌గా ప్రకటించామని, ఇక తరతరాలు ప్రజలు నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కు నివాళులు అర్పించేందుకు వీలుగా సుభాష్ ద్వీప్‌ను సుభాష్ చంద్రబోస్ స్మారక చిహ్నంగా అభివృద్ధి చేయబోతున్నట్లు ఈ రోజు ప్రకటించామని కేంద్ర హోంమంత్రి తెలిపారు. ప్రధాని తీసుకున్న ఈ రెండు నిర్ణయాలకు యావద్దేశం తరపున ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అమిత్  షా అన్నారు.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004HXSD.jpg

  సెల్యులార్ జైల్లో విప్లవకారుల స్మారకార్థం నిర్మించాల్సిన అమరజ్యోతి అసంపూర్తిగా మిగిలిపోయిందని, అయితే, వారికి యుగాలపాటు నివాళులు అర్పించేందుకు అమరజ్యోతిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో భారత ప్రభుత్వం పూర్తి చేసిందని అమిత్ షా తెలిపారు. నేడు, మేజర్ సోమనాథ్ శర్మ నుండి సుబేదార్ మేజర్ యోగేంద్ర సింగ్ యాదవ్ వరకు దేశంలోని ఈ వీర సైనికులను ఎప్పటికీ చిరస్మరణీయంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మార్చారని, దీని నుంచి అనేక తరాలు స్ఫూర్తి పొందగలవని, దేశభక్తి మరియు ధైర్య విలువలను అన్ని తరాలు అలవర్చుకుంటాయని ఆయన అన్నారు.

  ఈ రోజు సుభాష్ ద్వీపంలో నేతాజీ స్మారక చిహ్నాన్ని ప్రకటించినట్లు అమిత్ షా తెలిపారు. దీంతోపాటు మ్యూజియం, రోప్‌వే, లేజర్‌ లైట్‌ అండ్‌ సౌండ్‌ షో, అమ్యూజ్‌మెంట్‌ పార్క్‌, తినుబండారాల ఏర్పాట్లు కూడా చేయనున్నారని ఆయన తెలిపారు. స్వాతంత్య్ర సమరయోధుడు సుభాష్ చంద్రబోస్ ధైర్యసాహసాలను స్ఫూర్తిగా తీసుకుని అనేక తరాలపాటు ప్రజలు స్ఫూర్తిని పొందేలా ఈ స్మారక చిహ్నాన్ని అభివృద్ధి చేయడానికి భారత ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని ఆయన అన్నారు. నరేంద్రమోదీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2015 నుంచి రక్షణ దళాల పటిష్టత కోసం అనేక చర్యలు తీసుకున్నామని, ఒక ర్యాంకు ఒకే పెన్షన్ (వన్ ర్యాంక్ వన్ పెన్షన్) సమస్య పరిష్కారమైందని, సైనిక పరిపాలనా వ్యవస్థలో చారిత్రక మార్పులు చేశామని కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి తెలిపారు. సైనిక పరిపాలనా నిర్మాణం, వ్యవస్థను స్వయం సమృద్ధిగా మార్చడానికి  ఎంతో కృషి జరిగిందని, అధునాతన ఆయుధాలు, ఆధునిక కమ్యూనికేషన్ వ్యవస్థతో త్రివిధ దళాలను సన్నద్ధం చేయడానికి అనేక చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఈరోజు, 21 మంది పరమవీర చక్ర గ్రహీతల పేరిట 21 దీవులకు నామకరణం చేయడం ద్వారా వారిని సముచిత రీతిన గౌరవించుకున్నట్టు తెలిపారు. ఈ రెండు నిర్ణయాలు భారతదేశ యువ తరానికి మరిన్ని యుగాలపాటు దేశభక్తి, ధైర్యసాహసాల సందేశాన్ని, విలువలను అందిస్తాయని అమిత్ షా అన్నారు.

******



(Release ID: 1893164) Visitor Counter : 159