సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ

సవాళ్లను పరిష్కరించడానికి సుశిక్షితులైన సివిల్ సర్వెంట్ల సమూహాన్ని సృష్టించడానికి ఎన్ సి జి జి కృషి


బంగ్లాదేశ్, మాల్దీవులు, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వోద్యోగులకు రెండు వారాల శిక్షణా కార్యక్రమాలు పూర్తి

ఇది మొత్తం పొరుగుదేశాల అభివృద్ధి, సౌభాగ్యం పై ప్రధాన మంత్రి దార్శనికతను మరింత ముందుకు తీసుకువెళ్లే కార్యక్రమం

ఈశాన్య భారతదేశం ఎన్ సి జి జి కేంద్రీకృత ప్రాంతం.

Posted On: 22 JAN 2023 4:05PM by PIB Hyderabad

భారత ప్రభుత్వ అత్యున్నత స్థాయి స్వయంప్రతిపత్తి సంస్థ అయిన నేషనల్ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (ఎన్ సి జి జి) కొత్త ఉత్సాహంతో, దేశ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్ ,సబ్ కా ప్రయాస్ అనే ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ దార్శనికతకు అనుగుణంగా తన కార్యకలాపాలను విస్తరిస్తోంది. వాటి స్థాయిని పెంచుతోంది.

 

బంగ్లాదేశ్, మాల్దీవులు, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వోద్యోగుల కోసం 2023 జనవరి 9 నుంచి 20 వరకు రెండు వారాల పాటు సామర్థ్య పెంపు కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బంగ్లాదేశ్ (56వ బ్యాచ్) నుంచి 39 మంది సివిల్ సర్వెంట్లు, మాల్దీవుల నుంచి 26 మంది సివిల్ సర్వెంట్లు (20వ బ్యాచ్), అరుణాచల్ ప్రదేశ్ (మొదటి బ్యాచ్) నుంచి 22 మంది సివిల్ సర్వెంట్లు పాల్గొన్నారు.

అరుణాచల్ ప్రదేశ్ కు చెందిన అధికారులకు ముస్సోరీ, న్యూఢిల్లీల్లో ఎన్ సీజీజీలో శిక్షణ ఇచ్చారు. సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పింఛన్ల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఆదేశాల ప్రకారం ఈశాన్య ,సరిహద్దు రాష్ట్రాల్లో పాలన ,ప్రజా సేవను మరింత మెరుగుపరచడానికి ఇది దోహద పడుతుంది. అరుణాచల్ ప్రదేశ్ కు చెందిన 500 మంది అధికారులకు వచ్చే ఐదేళ్లలో శిక్షణ ఇచ్చేందుకు 2022లో

ఎన్ సీజీజీతో ఎంవోయూ కుదుర్చుకుంది.

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 'పొరుగువారికి ముందు ప్రాధాన్యం ' విధానం స్ఫూర్తి కి అనుగుణంగా భారత ప్రభుత్వ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ భాగస్వామ్యంతో పొరుగు దేశాలకు వారి పౌర సేవకుల సామర్థ్యాలను పెంపొందించడంలో ఎన్ సి జి జి సహాయపడుతోంది. ఎన్ సి జి జి ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి సుపరిపాలన ,పారదర్శక పాలన సంబంధిత వివిధ అంశాలపై దృష్టి సారించే సామర్థ్యాన్ని పెంపొందించే కార్యక్రమాలను రూపొందించి అమలు చేస్తోంది.

 

మూడు దేశాలకు చెందిన వారి మధ్య మేధోపరమైన సంప్రదింపులు, చర్చలకు వీలుగా తొలిసారిగా సంయుక్తంగా సెషన్లు నిర్వహించారు. రెండు వారాల సామర్థ్యాన్ని పెంపొందించే కార్యక్రమాన్ని ఎన్సిజిజి బృందం శాస్త్రీయంగా రూపొందించింది. విస్తృత సమాచారం, విజ్ఞానం, కొత్త ఆలోచనలు, పౌర-కేంద్రీకృత పాలనను ప్రోత్సహించే ఉత్తమ పద్ధతుల మార్పిడిని ఇది కలిగి ఉంది. ఆయా దేశాల అవసరాన్ని బట్టి, భారత రాయబార కార్యాలయాలతో సంప్రదింపులు జరిపి ప్రతి శిక్షణా కార్యక్రమానికి సంబంధించిన సెషన్లను ఎన్సీజీజీ అధ్యాపకులు రూపొందించారు.

ఆయా దేశాలు/ రాష్ట్రాల్లో విధానాలు, అమలు మధ్య అంతరాలను పూడ్చడానికి అంకితభావంతో కృషి చేయడంలో ప్రభుత్వోద్యోగులకు ఈ సామర్థ్యాన్ని పెంపొందించే కార్యక్రమం సహాయపడుతుంది.

 

బంగ్లాదేశ్, మాల్దీవులు , అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర సివిల్ సర్వెంట్ల కోసం రెండు వారాల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో, సివిల్ సర్వెంట్లు ఈ-గవర్నెన్స్, భారతదేశ విజన్ @ 2047 - సివిల్ సర్వెంట్ల పాత్ర, వికేంద్రీకృత మునిసిపల్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, డిజిటల్ ఇండియా, అరుణాచల్ ప్రదేశ్ లో విద్యుత్ రంగంఅవకాశాలు,సవాళ్లు, 2030 నాటికి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకు విధానం వంటి వివిధ అంశాలపై డొమైన్ నిపుణులతో సంభాషించారు.  భారతదేశంలో ఆరోగ్య పాలన, వాతావరణ మార్పు ,జీవవైవిధ్యంపై దాని ప్రభావం - విధానాలు ,ప్రపంచ పద్ధతులు, అవినీతి వ్యతిరేక పద్ధతులు, ఎల్ఐఎఫ్ఇ, సర్క్యులర్ ఎకానమీ మొదలైనవి చర్చించిన ఇతర ముఖ్యమైన అంశాలు.

 

జనవరి 20న జరిగిన ముగింపు సమావేశంలో సీబీఐ డైరెక్టర్ ఎస్ కె జైస్వాల్ పాల్గొన్నారు. తన ముగింపు ప్రసంగంలో, భారతదేశంలో అవినీతికి వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయాత్మక, బహుముఖ చర్యలను ఆయన వివరించారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని విరివిగా వినియోగించుకోవడం, పారదర్శకతకు పెద్దపీట వేస్తూ ప్రభుత్వం చేపట్టిన అనేక నియంత్రణ చర్యలు భారీ విజయం సాధించాయని వివరించారు. పారదర్శకత, జవాబుదారీతనం, పౌరుల కేంద్రీకరణ నేటి పాలనలో ప్రామాణికాలుగా మారాయని అన్నారు. మాల్దీవులు, బంగ్లాదేశ్, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల సివిల్ సర్వెంట్ల కోసం ఇంత అర్థవంతమైన కార్యక్రమాన్ని అందించినందుకు డిజి శ్రీ భరత్ లాల్ ను, ఆయన బృందాన్ని అభినందించారు.

 

ప్రభుత్వ పాత్ర, ప్రజాసేవల భవిష్యత్తు నిరంతరం అభివృద్ధి చెందుతున్న కొద్దీ, ప్రభుత్వోద్యోగుల పాత్ర కూడా అభివృద్ధి చెందుతోంది. అన్ని సవాళ్లను పరిగణనలోకి తీసుకొని ఎన్సిజిజి ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో సహాయపడే సామర్థ్య అభివృద్ధి కార్యక్రమాన్ని రూపొందిస్తొంది.

 

డిజి శ్రీ భరత్ లాల్ తన ప్రసంగంలో, శిక్షణ తీసుకున్న వారు తమ పౌరుల జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి తాము నేర్చుకున్న దానిని కార్యాచరణ ప్రణాళిక రూపం లోకి మార్చి అమలు చేయాలని సలహా ఇచ్చారు. ఎన్ సి జి జి రూపొందించిన సామర్థ్య పెంపు పెంపొందించే కార్యక్రమాలు ప్రధాని నరేంద్ర మోదీ సూచించిన 'పొరుగుదేశాలకు ప్రథమం' విధానానికి అనుగుణంగా ఉన్నాయని, 'వసుధైక కుటుంబం' స్ఫూర్తిని నిలబెట్టాయని ఆయన ఉద్ఘాటించారు. పౌరులు తమ పూర్తి సామర్థ్యాన్ని గ్రహించే వాతావరణాన్ని సృష్టించాలని, ఎవరినీ విస్మరించవద్దని ఆయన కోరారు. నేటి భారతదేశంలో అన్ని కార్యక్రమాలు పథకాలు సమ్మిళిత రూపంలో ప్రజల జీవన నాణ్యతను మెరుగుపరచడంపై దృష్టి పెట్టాయి. నిరుపేదల అవసరాన్ని ప్రభుత్వం పారదర్శకంగా, ఎవరినీ విస్మరించకుండా పరిష్కరిస్తోంది.

 

అవినీతి నిరోధక వ్యూహంపై జరిగిన సెషన్ లో చివరి రోజు సీబీఐ స్పెషల్ డైరెక్టర్ ప్రవీణ్ సిన్హా, జాయింట్ డైరెక్టర్ అనురాగ్, కేంద్ర విజిలెన్స్ కమిషన్ కార్యదర్శి పి.డేనియల్, ఇతర అధికారులతో కలిసి అవినీతిని రూపుమాపడానికి, సుపరిపాలన అందించడానికి సాంకేతిక పరిజ్ఞానం వినియోగంపై సెషన్స్ నిర్వహించారు.

 

చివరి రోజు అవినీతి నిరోధక వ్యూహంపై జరిగిన సెషన్ లో సీబీఐ స్పెషల్ డైరెక్టర్ ప్రవీణ్ సిన్హా, జాయింట్ డైరెక్టర్ అనురాగ్, కేంద్ర విజిలెన్స్ కమిషన్ కార్యదర్శి పి.డేనియల్, ఇతర అధికారులతో కలిసి అవినీతిని రూపుమాపడానికి, సుపరిపాలన అందించడానికి సాంకేతిక పరిజ్ఞానం వినియోగంపై సెషన్స్ నిర్వహించారు.

 

కోర్సు కోఆర్డినేటర్లు డాక్టర్ ఏపీ సింగ్ (మాల్దీవులు), డాక్టర్ బీఎస్ బిష్త్ (అరుణాచల్ ప్రదేశ్), డాక్టర్ ముఖేష్ భండారీ (బంగ్లాదేశ్) ల అలుపెరగని కృషితో జరిగిన ఈ వారాల హై ఇంటెన్సిటీ కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్  కు మొత్తం ఎన్ సి జీ జీ బృందం సహకరించింది.

భారతదేశంతో పాటు ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలలో సుపరిపాలన, విధాన సంస్కరణలు, ప్రభుత్వోద్యోగుల శిక్షణ సామర్థ్యాన్ని పెంపొందించడంపై పనిచేయడానికి భారత ప్రభుత్వం 2014 లో దేశంలో అత్యున్నత స్థాయి సంస్థగా నేషనల్ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ను ఏర్పాటు చేసింది. ఇది ప్రభుత్వ థింక్ ట్యాంక్ గా కూడా పనిచేస్తుంది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ భాగస్వామ్యంతో ఎన్సీజీజీ ఇంతవరకు బంగ్లాదేశ్, కెన్యా, టాంజానియా, ట్యునీషియా, సీషెల్స్, గాంబియా, మాల్దీవులు, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, లావోస్, వియత్నాం, భూటాన్, మయన్మార్, కంబోడియా మొదలైన 15 దేశాల సివిల్ సర్వెంట్లకు శిక్షణ ఇచ్చింది.

కంటెంట్ ,డెలివరీకి ప్రసిద్ధి చెందిన ఈ సామర్థ్య పెంపు కార్యక్రమానికి చాలా డిమాండ్ ఉంది. ఎన్ సి జి జి వివిధ దేశాలతో పాటు భారతదేశంలోని వివిధ రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో సివిల్ సర్వెంట్లను వారి అవసరానికి అనుగుణంగా చేర్చడానికి తన సామర్థ్యాన్ని విస్తరిస్తోంది.

 

***



(Release ID: 1892894) Visitor Counter : 146