మత్స్య పరిశ్రమ, పశు పోషణ మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ

గుజరాత్‌లో యువ పశుపోషకుల జాతీయ సదస్సు

Posted On: 21 JAN 2023 2:00PM by PIB Hyderabad

1. సదస్సుకు హాజరైన 16 రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులు. భవిష్యత్తు,ఎదురవుతున్న సవాళ్లు, విధాన నిర్ణయ ఆవశ్యకత అంశాలపై చర్చించిన ప్రతినిధులు   

2. సదస్సును ప్రారంభించిన శ్రీ పురుషోత్తం రూపాలా 

3. సదస్సులో పాల్గొన్న మత్స్య, పశుసంవర్ధక, పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ అధికారులు 

మత్స్య, పశుసంవర్ధక, పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ అధికారులు 

 

 మత్స్య, పశుసంవర్ధక, పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ అధికారుల సమక్షంలో గుజరాత్‌లో యువ పశుపోషకుల జాతీయ సదస్సు ప్రారంభిస్తున్న కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడి పరిశ్రమ శాఖ మంత్రి శ్రీ పురుషోత్తం రూపాలా

 భవిష్యత్తు,ఎదురవుతున్న సవాళ్లు, విధాన నిర్ణయ ఆవశ్యకత అంశాలపై గుజరాత్‌లో భుజ్ కచ్ లో జరిగిన యువ పశుపోషకుల జాతీయ సదస్సులో విస్తృత చర్చలు జరిగాయి. కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడి పరిశ్రమ శాఖ మంత్రి శ్రీ పురుషోత్తం రూపాలా ప్రారంభించిన సదస్సులో 16 రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. పశుపోషణ, పాడి పరిశ్రమ అభివృద్ధి కోసం సహజీవన్ – సెంటర్ ఫర్ పాస్టోరలిజం పలు కార్యక్రమాలు అమలు చేస్తోంది.  ఒంటె పాల సేకరణ, మేలు జాతి పశువుల గుర్తింపు,  మేలు జాతి పశువుల పరిరక్షణ, పాల ఉత్పత్తుల  తయారీ తదితర అంశాల్లో కేంద్రం స్థానిక యువతకు శిక్షణ ఇస్తోంది. 

సదస్సును  ప్రారంభించిన అనంతరం ప్రసంగించిన శ్రీ పురుషోత్తం రూపాలా పాడి పరిశ్రమ అభివృద్ధికి కేంద్రం అమలు చేస్తున్న చర్యలు వివరించారు.కేంద్రం  క్రింది కార్యక్రమాలను అమలు చేస్తున్నదని అన్నారు.  

1. జాతీయ పశువుల గణనలో భాగంగా పశు పోషకులను చేర్చడం

2. పశు పోషకుల సమస్యలపై దృష్టి పెట్టడానికి  మత్స్య, పశుసంవర్ధక, పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ   పాస్టోరల్ సెల్‌ను ప్రారంభించడం 

3. జాతీయ పాడి పరిశ్రమ మిషన్ లో పశువుల ఉత్పత్తి వ్యవస్థ సంబంధిత పథకాలు మరియు కార్యక్రమాలను చేర్చే అవకాశాన్ని పరిశీలించడం 

త్వరగా పాడైపోయే అవకాశం ఉన్న వస్తువులను నిల్వ చేయడానికి, రవాణా చేయడానికి  స్వదేశీ ఉన్నిని ఉపయోగించడానికి గల అవకాశాలు కూడా ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి.    స్వదేశీ ఉన్ని అభివృద్ధిపై ఏర్పాటైన  జాతీయ మిషన్ మేక, గొర్రెలు, గాడిద,బర్రె పాలు, పాల ఉత్పత్తులను అభివృద్ధి చేసి ప్రచారం చేసే అంశంపై దృష్టి సారించింది. మేక, గొర్రెలు, గాడిద,బర్రె పాలు, పాల ఉత్పత్తులను ప్రజలకు పరిచయం చేసి మార్కెటింగ్ అవకాశాలు ఎక్కువ చేయడానికి గల అవకాశాలను కూడా మిషన్ పరిశీలిస్తోంది.  

సదస్సులో  మత్స్యశాఖ, పశుసంవర్ధక, పాడిప రిశ్రమ మంత్రిత్వ శాఖ అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పశుసంవర్ధక కమిషనర్ డాక్టర్ అభిజిత్ మిత్ర, పశుసంవర్ధక సంయుక్త కమిషనర్ డాక్టర్  సుజిత్ దత్తా, పశుసంవర్ధక సంయుక్త కమిషనర్ డాక్టర్ దేబాలినా దత్తా, మత్స్య, పశుసంవర్ధక, పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ  సలహాదారు శ్రీ సుమేద్ నగ్రారే సదస్సులో పాల్గొన్నారు.   ఒంటెల కోసం ఏర్పాటైన జాతీయ పరిశోధన  కేంద్రం డైరెక్టర్ డాక్టర్ ఎ సాహూ, జాతీయ  ఉన్ని పరిశోధనా కేంద్రం కి చెందిన డాక్టర్ వినోద్ కదమ్, జాతీయ వ్యవసాయ విధానం, పరిశోధన సంస్థ ప్రధాన సైంటిస్ట్ డాక్టర్ ఎ సాహూ, జాతీయ  ఉన్ని పరిశోధనా కేంద్రం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్  ఖేమ్ చంద్ కూడా సదస్సులో పాల్గొన్నారు. జీవనోపాధిపై సమగ్ర దృక్కోణం, పశుపోషకులను  ప్రధాన జీవన స్రవంతిలోకి తీసుకురావడానికి జరుగుతున్న ప్రయత్నాలు, అందించవలసిన సహకారం తదితర అంశాలు సదస్సులో చర్చకు వచ్చాయి.  

నేపధ్యం:

భారతదేశంలో పశువులను పోషిస్తూ జీవిస్తున్న వారి సంఖ్యపై స్పష్టమైన గణాంకాలు అందుబాటులో లేవు.   ప్రస్తుతం పశువులకు సంబంధించిన అందుబాటులో ఉన్న అధికారిక సమాచారం నిర్వహణ వ్యవస్థ ను ప్రతిబింబించడం లేదు. పశువుల పోషణ కోసం పశుకాపరులు ఒక ప్రాంతంలో లభించే వనరులను అందరూ కలిసి వినియోగించుకుంటారు. పశు పోషణ కోసం వివిధ పద్ధతులు వినియోగంలో ఉన్నాయి. కొంతమంది ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ప్రయాణిస్తూ తమ పశువులను పోషిస్తారు. ఒంటెలు, పశువులు, బాతులు, గాడిదలు, మేకలు, పందులు, గొర్రెలు బర్రెల పోషణలో ఈ విదానం అనుసరిస్తారు. కొన్ని రకాల పశువుల పోషణ నిలకడగా ఒకే ప్రాంతంలో జరుగుతుంది.  

చాలా మంది పశుపోషకులు సాంప్రదాయ కులాలకు చెందిన వారు, కానీ "సాంప్రదాయేతర పశుపోషకులు" అని అని గుర్తింపు పొందిన వారు సంచార పద్ధతిలో  పశువుల పెంపకంలో సాగిస్తున్నారు. దేశ పాలు, మాంసం అవసరాలను పశు పోషకులు ఎక్కువగా తీరుస్తున్నారు. పశువుల వ్యర్థాలు  ఎరువుగా ఉపయోగపడుతుంది.అనేక మంది పశువుల పెంపకం దారులకు ఎరువు  ప్రధాన ఆదాయ వనరుగా ఉంది. 



(Release ID: 1892688) Visitor Counter : 189