రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

భారత్‌-ఈజిప్ట్ ఉమ్మడి శిక్షణ విన్యాసాలు 'సైక్లోన్ ఎడిషన్-I' రాజస్థాన్‌లో ప్రారంభం

Posted On: 20 JAN 2023 11:19AM by PIB Hyderabad

భారత సైన్యం-ఈజిప్టు సైన్యానికి చెందిన ప్రత్యేక దళాల మొట్టమొదటి ఉమ్మడి విన్యాసాలు రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో "ఎక్సర్‌సైజ్ సైక్లోన్-I" పేరుతో 14 జనవరి 2023 నుంచి కొనసాగుతున్నాయి. రెండు దేశాల మధ్య రక్షణ సహకారాన్ని పెంపొందించడంతో పాటు, తీవ్రవాద అణచివేత, నిఘా, దాడులు, ఇతర ప్రత్యేక కార్యకలాపాలను చేపట్టేటప్పుడు ఎడారి ప్రాంతాల్లో ప్రత్యేక దళాల నైపుణ్యాలను, సహకారాన్ని పంచుకోవడం ఈ విన్యాసాల ఉద్దేశం.

రెండు దేశాల ప్రత్యేక బలగాలను ఒకే వేదికపైకి తీసుకువచ్చే మొదటి దశ ఈ "సైక్లోన్ - I" విన్యాసాలు. రాజస్థాన్‌ ఎడారుల్లో 14 రోజుల పాటు సాగనున్న ఈ కసరత్తులో ఆయుధాలను ఉపయోగించడం, యుద్ధ పోరాటాలు, నిఘా & లక్ష్యాన్ని గుర్తించడం, ఆయుధాలు, పరికరాలు, ఆవిష్కరణలు, వ్యూహాలు, పద్ధతులు, విధానాల సమాచారాన్ని పరస్పరం పంచుకోవడం వంటి ప్రత్యేక దళాల నైపుణ్యాలను పెంచే విన్యాసాల్లో రెండు బృందాలు పాల్గొంటాయి. ఈ విన్యాసాల్లో పాల్గొనే సైనికులు ఆయుధ సహిత యుద్ధ పోటారాల్లో ప్రత్యేక దళాళ ఆపరేషన్ల కోసం ఉమ్మడి ప్రణాళికలు రచించి, అమలు పరుస్తారు. గన్స్‌తో దూరం నుంచే లక్ష్యాలను ఛేదించడం సహా తీవ్రవాద శిబిరాలు/స్థావరాల మీద మెరుపుదారులు చేస్తారు.

రెండు సైన్యాల సంస్కృతి, నైతికత అర్ధం చేసుకునే అవకాశాన్ని ఈ ఉమ్మడి విన్యాసాలు అందిస్తాయి. తద్వారా, భారత్‌-ఈజిప్టు మధ్య దౌత్య సంబంధాలను మరింత బలోపేతం చేసేలా సైనిక సహకారం & పరస్పర సమాచార మార్పిడిని ప్రోత్సహిస్తాయి.

*****



(Release ID: 1892663) Visitor Counter : 264