సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ

మల్టీ టాస్కింగ్ (నాన్ టెక్నికల్) స్టాఫ్ ఎగ్జామ్ 2022ను తొలిసారి హిందీ,ఇంగ్లిష్ తో పాటు 13 ప్రాంతీయ భాషల్లో నిర్వహించాలని నిర్ణయించిన ఎస్ ఎస్ సి కి కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రశంస


ఉద్యోగార్థులందరికీ సమాన అవకాశాలు కల్పించాలన్న ప్రధాని నరేంద్ర మోదీ దార్శనికతకుఅనుగుణంగా భాషాపరమైన అవరోధం వల్ల ఏ ఒక్కరికీ అవకాశం దక్కకుండా, నష్టపోకుండా ఈ నిర్ణయందోహదపడాలి: డాక్టర్ జితేంద్ర సింగ్

ఈ చారిత్రాత్మక చర్య తరువాత, రాజ్యాంగంలోని ఎనిమిదవ షెడ్యూల్ లో పేర్కొన్న అన్ని భాషలను క్రమంగా చేర్చడానికి ప్రయత్నాలు

జరుగుతున్నాయి: డాక్టర్ జితేంద్ర సింగ్

Posted On: 20 JAN 2023 3:20PM by PIB Hyderabad

మల్టీ టాస్కింగ్ (నాన్ టెక్నికల్) స్టాఫ్ ఎగ్జామ్ 2022ను తొలిసారిగా హిందీ, ఇంగ్లిష్ తో పాటు 13 ప్రాంతీయ భాషల్లో నిర్వహించాలని నిర్ణయించిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ ఎస్ సి) కృషిని కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా) ఎర్త్ సైన్సెస్ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా) ; పీఎంవో, పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్స్, పెన్షన్స్, అటామిక్ ఎనర్జీ అండ్ స్పేస్ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రశంసించారు.

 

ఉద్యోగార్థులందరికీ సమాన అవకాశాలు కల్పించాలన్న ప్రధాని నరేంద్ర మోదీ దార్శనికతకు అనుగుణంగా ఉన్న ఈ నిర్ణయం భాషాపరమైన అవరోధం వల్ల ఏ ఒక్కరికీ అవకాశం దక్కకుండా, నష్టపోకుండా చూడాలని జితేంద్ర సింగ్ అన్నారు.

 

పదమూడు ప్రాంతీయ భాషలలో ఉర్దూ, తమిళం, మలయాళం, తెలుగు, కన్నడ, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కొంకణి, మణిపురి (మీతీ), మరాఠీ, ఒడియా, పంజాబీ.

 

ఇంతకుముందు ఇంగ్లిష్, హిందీ లాంగ్వేజెస్ లో మాత్రం జరిగే ఈ పరీక్షల ను ప్రాంతీయ భాషల్లో జరపాలన్న వివిధ రాష్ట్రాలకు, ముఖ్యంగా దక్షిణ భారతదేశానికి చెందిన అభ్యర్థుల చిరకాల డిమాండ్ ను ఈ చర్య నెరవేరుస్తుందని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. దీనివల్ల దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో అభ్యర్థులకు లబ్ధి చేకూరే అవకాశం ఉందని మంత్రి తెలిపారు.

 

ఈ చారిత్రాత్మక నిర్ణయం తర్వాత క్రమంగా రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్ లో పేర్కొన్న అన్ని భాషలను చేర్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని జితేంద్ర సింగ్ పేర్కొన్నారు.

 

2022 నవంబర్ లో వారణాసిలో "కాశీ తమిళ సంగమం" ప్రారంభోత్సవం సందర్భంగా మోదీజీ "ప్రపంచంలోని పురాతన సజీవ భాషల (ఉదా:తమిళం) లో ఒకటిగా ఉన్నప్పటికీ, దానిని పూర్తిగా గౌరవించడంలో మనచిత్తశుద్ధి లోపించింది" అని వ్యాఖ్యానించడాన్ని డాక్టర్ జితేంద్ర సింగ్ గుర్తు చేశారు. ‘‘తమిళ వారసత్వాన్ని పరిరక్షించి సుసంపన్నం చేయాల్సిన బాధ్యత 130 కోట్ల మంది భారతీయులపై ఉంది.. భాషా భేదాలను తొలగించి భావోద్వేగ ఐక్యతను నెలకొల్పాలని గుర్తుంచుకోవాలి.‘‘ అన్నారు.

 

ప్రాంతీయ అసమానతలను రూపుమాపడానికి, రాజ్యాంగ ఆదర్శాలను సాధించడానికి, అదే సమయంలో మన దేశంలోని భాషా వైవిధ్యాన్ని కీర్తించడానికి జనాభాలోని వివిధ వర్గాలకు సమాన అవకాశాలు కల్పించడం స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిరంతర కృషి అని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు.

 

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్వహించే పరీక్షల విధానం, సిలబస్, పరీక్షలు నిర్వహించే మాధ్యమంతో సహా సమీక్షించడానికి సిబ్బంది, శిక్షణ శాఖ నిపుణుల కమిటీని ఏర్పాటు చేసిందని మంత్రి తెలిపారు.

 

బహుళ భాషల్లో కింది స్థాయి పోస్టులకు పరీక్షలు నిర్వహించడం మంచిదని, తొలుత కొన్ని భాషలతో ప్రారంభించి, ఆ తర్వాత క్రమంగా రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూలులో పేర్కొన్న అన్ని భాషలను చేర్చేలా పెంచాలని కమిటీ సిఫార్సు చేసినట్టు చెప్పారు. కమిటీ సిఫారసులను ప్రభుత్వం ఆమోదించింది.

 

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ భారత ప్రభుత్వ అతిపెద్ద రిక్రూటింగ్ ఏజెన్సీలలో ఒకటి, భారత ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు/డిపార్ట్‌మెంట్లలోని అన్ని గ్రూప్ బి (నాన్-గెజిటెడ్) , గ్రూప్ సి(నాన్-టెక్నికల్ పోస్టులు)కి రిక్రూట్‌మెంట్ చేయడం దీని ప్రధాన బాధ్యత. కమిషన్ నిర్వహించే పరీక్షల మాధ్యమం సాధారణంగా హిందీ ఇంగ్లీష్. .

 

<><><><>



(Release ID: 1892521) Visitor Counter : 158