నూతన మరియు పునరుత్పాదక శక్తి మంత్రిత్వ శాఖ

2022-23 సంవత్సరానికి వార్షిక పనితీరు లక్ష్యాన్ని నిర్దేశిస్తూ ఎంఎన్ఆర్ఈతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న ఐఆర్ఈడీఏ

Posted On: 20 JAN 2023 12:32PM by PIB Hyderabad

* కార్యకలాపాల ద్వారా 3,361 కోట్ల ఆదాయం ఆర్జించాలని లక్ష్యంగా నిర్ణయించిన కేంద్రం. గత ఏడాది ఆర్జించిన ఆదాయం కంటే ఇది 18% ఎక్కువ 

* నికర విలువపై రాబడి, మూలధనంపై రాబడి, మొత్తం రుణాలకు  నిరర్ధక ఆస్తులు, ఆస్తుల  టర్నోవర్ నిష్పత్తి, ప్రతి షేరుకు సంపాదన మొదలైన వివిధ పనితీరు సంబంధిత కీలక ప్రమాణాలు నిర్ణయించిన ప్రభుత్వం 

 

*2021-22 ఆర్థిక సంవత్సర అవగాహన ఒప్పందం వల్ల 96.54 మార్కులు సాధించి  అసాధారణమైన పనితీరును ప్రదర్శించిన ఐఆర్ఈడీఏ 

సీనియర్ అధికారుల సమక్షంలో అవగాహన ఒప్పందంపై సంతకాలు చేస్తున్న ఎంఎన్ఆర్ఈ కార్యదర్శి శ్రీ భూపిందర్ సింగ్ భల్లా, ఐఆర్ఈడీఏ చైర్మన్ అండ్  మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ప్రదీప్ కుమార్ దాస్ 

2022-23 సంవత్సరానికి  వార్షిక లక్ష్యాన్ని నిర్దేశిస్తూ నూతన, పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ (ఎంఎన్ఆర్ఈ)తో భారత పునరుత్పాదక ఇంధన అభివృద్ధి సంస్థ (ఎంఎన్ఆర్ఈ) అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది. సీనియర్ అధికారుల సమక్షంలో అవగాహన ఒప్పందంపై  ఎంఎన్ఆర్ఈ కార్యదర్శి శ్రీ భూపిందర్ సింగ్ భల్లా, ఐఆర్ఈడీఏ చైర్మన్ అండ్  మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ప్రదీప్ కుమార్ దాస్సంతకాలు చేశారు. 

కార్యకలాపాల ద్వారా 3,361 కోట్ల రూపాయల ఆదాయం ఆర్జించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించింది. ఈ మొత్తం గత ఏడాది ఆర్జించిన ఆదాయం కంటే 18% ఎక్కువ. నికర విలువపై రాబడి, మూలధనంపై రాబడి, మొత్తం రుణాలకు ఎన్ పి ఏ, ఆస్తుల  టర్నోవర్ నిష్పత్తి, ప్రతి షేరుకు సంపాదన మొదలైన వివిధ పనితీరు సంబంధిత కీలక ప్రమాణాలు కూడా ప్రభుత్వం నిర్దేశించింది. 

 గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో  ఐఆర్ఈడీఏ మెరుగైన  పనితీరు కనబరిచిందని శ్రీ ప్రదీప్ కుమార్ దాస్ తెలిపారు.2022-23  లక్ష్యాలు సాధించడానికి  ఐఆర్ఈడీఏ సిద్ధంగా ఉందని తెలిపారు.  2021-22 ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోల్చి చూస్తే  2022-23 ఆర్థిక సంవత్సరం 2వ త్రైమాసికంలో పన్ను తర్వాత లాభంలో సంస్థ  67% వృద్ధిని నమోదు చేసింది.  2021-22 ఆర్థిక సంవత్సరం తో పోల్చి చూస్తే  2వ త్రైమాసికంలో   నికర నిరర్ధక ఆస్తులు  4.87% నుంచి  2.72%కి తగ్గాయి.

2021-22 ఆర్థిక సంవత్సరానికి కుదుర్చుకున్న  అవగాహన ఒప్పందానికి 96.54 మార్కులు సాధించి ఐఆర్ఈడీఏ మెరుగైన   పనితీరు ప్రదర్శించింది. ఐఆర్ఈడీఏ ఇంతవరకు 3,068 పైగా పునరుత్పాదక ఇంధన ప్రాజెక్ట్‌లకు 1,41,622 కోట్ల రూపాయల విలువ చేసే రుణాలు ఆమోదించింది. ఆమోదించిన రుణాల్లో 90,037 కోట్ల రూపాయలను పంపిణీ చేసింది.ఐఆర్ఈడీఏ అమలు చేస్తున్న కార్యక్రమాల వల్ల దేశంలో  పునరుత్పాదక శక్తి సామర్థ్యం 19,502 మెగావాట్ల వరకు పెరిగింది. 

***



(Release ID: 1892508) Visitor Counter : 168