రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

రోడ్డు ప్రమాదాల సంఖ్యను సగానికి తగ్గించేందుకు కృషి చేయాలిః శ్రీ నితిన్ గడ్కరీ


రహదారుల భద్రతకు సంబంధించిన అన్ని 4ఈలకు.. అంటే ఇంజినీరింగ్, ఎన్‌ఫోర్స్‌మెంట్, ఎడ్యుకేషన్ మరియు ఎమర్జెన్సీ కేర్‌లలో బహుళ కార్యక్రమాలకు ప్రాధాన్యతనిస్తూ జనవరి 11 నుండి 17 వరకు రహదారుల భద్రత వారోత్సవాలు

Posted On: 18 JAN 2023 6:22PM by PIB Hyderabad

2025 ముగింపు నాటికి రోడ్డు ప్రమాదాలను సగానికి తగ్గించేందుకు అందరూ కృషి చేయాలని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ అన్నారు. రోడ్డు భద్రతా వారంలో 4 గంటల టెలిథాన్ మరియు ఔట్రీచ్ ప్రచారం “సడక్ సురక్ష అభియాన్”లో మంత్రి పాల్గొంన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ట్రక్కు డ్రైవర్ల పని వేళలను నిర్ణయించేందుకు గాను దేశంలో త్వరలో చట్టం తీసుకువస్తామని చెప్పారు.  ఈ కార్యక్రమంలో నటుడు అమితాబ్ బచ్చన్, ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు,  పలువురు ఇతర భాగస్వాములు రోడ్డు భద్రతకు సంబంధించిన కీలక అంశాలపై చర్చించారు. రోడ్డు రవాణా & రహదారుల మంత్రిత్వ శాఖ (మోర్త్) రోడ్డు ప్రమాదాలు, గాయాలను గనణీయంగా తగ్గించడానికి కట్టుబడి ఉందని అన్నారు. ఇందుకు గాను రోడ్డు భద్రత యొక్క 4ఈలు అంటే ఇంజనీరింగ్, ఎన్‌ఫోర్స్‌మెంట్, ఎడ్యుకేషన్ మరియు ఎమర్జెన్సీ కేర్‌లో బహుళ కార్యక్రమాలను చేపట్టినట్టుగా తెలిపారు, ఈ సంవత్సరం, మోర్త్ "స్వచ్ఛత పఖ్వాడా" కింద, అందరికీ సురక్షితమైన రోడ్ల అనే అంశాన్ని ప్రచారం చేయడానికి 2023 జనవరి 11 నుండి 17 వరకు రోడ్డు భద్రతా వారోత్సవాన్ని (ఆర్.ఎస్.డబ్ల్యు) పాటించింది.  ఈ వారోత్సవాలలో భాగంగా మోర్త్ ఢిల్లీలోని వివిధ ప్రదేశాలలో నుక్కడ్ నాటకాలు (వీధి ప్రదర్శనలు), కార్పొరేట్‌ల సహకారంతో  పాఠశాల & కళాశాల విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు, పోటీలను, రోడ్డు భద్రత ప్రదర్శనలను నిర్వహించింది. వాకథాన్, టాక్స్ షోలతో పాటుగా సీనియర్ ప్రభుత్వ అధికారులు పరిశ్రమ నాయకులతో ప్యానెల్ చర్చా కార్యక్రమాలను నిర్వహించింది. దీనికి తోడు ఎన్.హెచ్.ఏ,  ఎన్.హెచ్.ఐ.డి.సి.ఎల్ మొదలైన రోడ్డు యాజమాన్య ఏజెన్సీలు ట్రాఫిక్ నియమాలు మరియు నిబంధనలను పాటించడం, పాదచారుల భద్రత, టోల్ ప్లాజాల వద్ద డ్రైవర్ల కోసం కంటి తనిఖీ శిబిరాలు మరియు ఇతర రహదారి ఇంజినీరింగ్ సంబంధిత కార్యక్రమాలకు సంబంధించిన ప్రత్యేక డ్రైవ్‌లను నిర్వహించాయి.

 

 

రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన రవాణా, పోలీసు విభాగాలు, ఎన్.జి.ఒలు, ప్రైవేట్ కంపెనీలు, దేశ వ్యాప్తంగా సాధారణ ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రచార కార్యక్రమాలు చేపట్టారు, మొదటి ప్రతిస్పందన శిక్షణలు, నియమాలు & నిబంధనలను అట్టడుగు స్థాయి వరకు కఠినంగా అమలు చేయడం మరియు ఇతర కార్యకలాపాలను నిర్వహించడం ద్వారా ఈ కార్యక్రమంలో ఆయా విభాగాలు చురుకుగా పాల్గొన్నాయి., రోడ్డు భద్రతకు సంబంధించిన వర్క్‌షాప్‌లు & అడ్వకసీ  కార్యక్రమాలను నిర్వహించారు. రహదారుల భద్రతా వారోత్సవాలకు సంబంధించి టెలివిజన్, ప్రింట్ మీడియా మరియు సోషల్ మీడియాలో విస్తృతమైన కవరేజీని అందిచాయి, ఆయా మాద్యమాల ద్వారా రహదారి భద్రత   ప్రచారం లక్షలాది మంది ప్రజలకు చేరుకుంది.

***




(Release ID: 1892079) Visitor Counter : 194