వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
రైతులకు తక్కువ వడ్డీకి రుణాలు మంజూరు చేసేందుకు కుదిరిన అవగాహన ఒప్పందం
సున్నా ప్రాసెసింగ్ రుసుము, అదనపు తనఖా, అధిక వడ్డీ రేట్లు లేకుండా 'ప్రొడ్యూస్ మార్కెటింగ్ రుణాలు'
Posted On:
16 JAN 2023 5:06PM by PIB Hyderabad
రైతులకు తక్కువ వడ్డీ రేటు రుణాలను అందించడానికి, ఒక జాతీయ బ్యాంకుతో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) మీద వేర్‌హౌసింగ్ డెవలప్‌మెంట్ రెగ్యులేటరీ అథారిటీ (డబ్ల్యూడీఆర్‌ఏ) సంతకం చేసింది.
ఈ-ఎన్‌డబ్ల్యూఆర్‌ల (ఎలక్ట్రానిక్ నెగోషియబుల్ వేర్‌హౌస్ రిసిప్ట్) మీద సున్నా ప్రాసెసింగ్ రుసుముతో, అదనపు తనఖా & అధిక వడ్డీ రేట్లు లేకుండా 'ప్రొడ్యూస్ మార్కెటింగ్ రుణాలు' పేరిట ప్రత్యేకంగా జారీ చేసే కొత్త రుణాల మీద అవగాహన పెంచడానికి ఎంవోయూ మీద సంతకాలు జరిగాయి.
ఈ రుణాల ప్రయోజనాల గురించి ఖాదాదార్లకు సమాచారాన్ని అందించడంతో పాటు, భారతదేశంలో వ్యవసాయ తనఖా రుణాలను మెరుగుపరచడానికి మరిన్ని కార్యకలాపాలు చేపట్టడం ఈ ఎంవోయూ లక్ష్యం.
చిన్న & సన్నకారు రైతుల్లో ఈ-ఎన్‌డబ్ల్యూఆర్‌ల అంగీకారానికి సంబంధించి, కొత్త రుణాలు విస్తృత ప్రభావం చూపుతుందని ఊహిస్తున్నారు. విక్రయాల్లో కష్టాన్ని తగ్గించడం, ఉత్పత్తులకు మెరుగైన ధరలను కల్పించడం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మీద గణనీయమైన ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది.
ఈ-ఎన్‌డబ్ల్యూఆర్ వ్యవస్థలోని భద్రత, బేరసారాల సామర్థ్యంతో కలపడం ద్వారా, గ్రామీణ ద్రవ్యతను మెరుగుపరచడంలో, రైతుల ఆదాయాన్ని పెంచడంలో ప్రొడ్యూస్ మార్కెటింగ్ రుణాలు విజయం సాధిస్తాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో (ఎస్‌బీఐ) ఈ ఎంవోయూ కుదిరింది.
గ్రామీణ రుణాలను మెరుగుపరచడానికి గిడ్డంగి రశీదులను ఉపయోగించడం ద్వారా అందించే పంట తనఖా రుణాల ప్రాముఖ్యతపై ఈ కార్యక్రమంలో క్లుప్తంగా చర్చ జరిగింది. ఈ రంగంలో రుణ సంస్థలు ఎదుర్కొంటున్న నష్టాలను కూడా బ్యాంక్ ప్రతినిధులు వివరించారు. వారిలో విశ్వాసాన్ని మెరుగుపరిచేందుకు, పూర్తి నియంత్రణ సంబంధిత మద్దతుకు డబ్ల్యూడీఆర్‌ఏ హామీ ఇచ్చింది.
******
(Release ID: 1891757)
Visitor Counter : 200