పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
హర్యానా రాష్ట్ర పాఠశాల ప్రధానోపన్యాసకులకు పరీక్షా పె చర్చ- మిషన్ లైఫ్ సమావేశాన్ని నిర్వహించిన నేషనల్ మ్యూజియం ఆఫ్ నేచురల్ హిస్టరీ
మిషన్‌లైఫ్‌పై 2642 విద్యార్ధులు, సాధారణ ప్రజలకు అవగాహన కల్పించిన సవాయ్ మాధోపూర్‌కు చెందిన రీజినల్ మ్యూజియం ఆఫ్ నేచురల్ హిస్టరీ
Posted On:
16 JAN 2023 3:35PM by PIB Hyderabad
మిషన్ లైఫ్‌కు అనుగుణంగా (పర్యావరణం కోసం జీవనశైలి) పర్యావరణ, అటవీ, పర్యావరణ మార్పు మంత్రిత్వ శాఖ ఆధీనంలోని నేషనల్ మ్యూజియం ఆఫ్ నేచురల్ హిస్టరీ హర్యానా రాష్ట్ర పాఠశాల ప్రధాన్యోపాసకులకు ఆన్‌లైన్ ఇంటరాక్టివ్ సెషన్‌ను (ప్రభావశీల సమావేశాన్ని) నిర్వహించింది.ఈ కార్యక్రమానికి 55 మంది ప్రధానోపస్యాకులు హాజరయ్యారు. విద్యార్ధులు పరీక్షల ఒత్తిడిని తట్టుకునేందుకు ప్రధానోపస్యాకులు తోడ్పడాలని డి.ఇ.ఒ శ్రీమతి ఇందూ బోకెన్ పాఠశాల ప్రధానోపస్యాకులను ఉద్దేశించి ప్రసంగిస్తూ కోరారు.
నేషనల్ మ్యూజియం ఆఫ్ నేచురల్ హిస్టరీ (ఎన్ఎంఎన్‌హెచ్) పశ్చిమ ప్రాంతీయ కేంద్రమైన రాజస్థాన్‌లోని సవాయ్ మాధోపూర్‌కు చెందిన రాజీవ్ గాంధీ రీజినల్ మ్యూజియం ఆఫ్ నాచురల్ హస్టరీ (ఆర్‌జిఆర్ఎంఎన్‌హెచ్) మిషన్ లైఫ్ అవగాహనా కార్యక్రమాలను నిర్వహించింది. ఈ హరితోపన్యాసంలో భాగంగా, గ్రీన్ ప్లెడ్జ్ (హరిత ప్రతిజ్ఞ), రంగోలీ, # సేవ్ ఎనర్జీ (ఇంధన పొదుపు), # మిషన్ లైఫ్ పై సినిమా ప్రదర్శనలను 13 జనవరి 2023న నిర్వహించింది. ఈ కార్యక్రమాలలో 2,643 మందికి పైగా విద్యార్ధులు, ఉపాధ్యాయులు, సాధారణ సందర్శకులు చురుకుగా పాల్గొన్నారు.
సవాయ్ మాధోపూర్‌లోని ఆర్‌జిఆర్ఎంఎన్‌హెచ్ మిషన్ లైఫ్ అవగాహనా కార్యక్రమాల నిర్వహణ
***
(Release ID: 1891714)
Visitor Counter : 168