బొగ్గు మంత్రిత్వ శాఖ
900 గ్రామాలలోని 18 లక్షల మందికి బొగ్గు గనుల నీరుతో ప్రయోజనం బొగ్గు/ లిగ్నైట్ పి.ఎస్.యుల ద్వారా గ్రీనింగ్ డ్రైవ్‌ను పెంచడమైంది
Posted On:
13 JAN 2023 12:59PM by PIB Hyderabad
బొగ్గు మంత్రిత్వ శాఖ నిర్దేశించిన ప్రకారం బొగ్గు/ లిగ్నైట్ రంగంలోని ప్రభుత్వ రంగ సంస్థలు గనుల నుండి వెలువడే నీటిని పరిరక్షణ మరియు సమర్ధవంతంగా వినియోగం గురించి అనేక చర్యలు చేపడుతున్నాయి, గనులు ఉన్న పరివాహక ప్రాంతాలకు ఆయా గనుల ద్వారా వెలువడే నీటిని తాగడం, నీటిపారుదల వినియోగాల కోసం సరఫరా చేస్తున్నారు. బొగ్గు/ లిగ్నైట్ పీఎస్‌యులకు చెందిన నిరుపయోగంగా ఉన్న గనుల ఖాళీలలో లభ్యమయ్యే నీటిని బొగ్గు గనుల ప్రాంతాలకు సమీపంలోని 900 గ్రామాలలో నివసిస్తున్న సుమారు 18 లక్షల మంది ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో, బొగ్గు/లిగ్నైట్ పీఎస్‌యులు కమ్యూనిటీ ఉపయోగం కోసం దాదాపు 4000 ఎల్.కె.ఎల్. గని నీటిని సరఫరా చేయాలని ప్రణాళికను రూపొందించాయి చేశాయి, వీటిలో డిసెంబర్ 2022 వరకు 2788 ఎల్.కె.ఎల్. గని నీరు సరఫరా చేయబడింది. ఇందులో నుండి 881 ఎల్.కె.ఎల్. నీరు తాగడానికి సహా గృహావసరాలకు ఉపయోగించబడింది. గని నీటి లబ్దిదారులు ఎక్కువగా గిరిజనులు మరియు మారుమూల ప్రాంతాల్లో నివసించే వారు. ప్రభుత్వ జలశక్తి అభియాన్ నీటి సంరక్షణ ప్రయత్నానికి అనుగుణంగా ఈ చర్యలు తీసుకోవడం జరుగుతోంది. 2022-23లో కోల్ ఇండియా లిమిటెడ్ (సీఐఎల్) ఇప్పటికే 1510 హెక్టార్ల వార్షిక ప్లాంటేషన్ లక్ష్యాన్ని అధిగమించింది, దాని గ్రీన్ కవర్ కార్యక్రమం కింద డిసెంబరు ముగింపు నాటికి దీనిని 1600 హెక్టార్లకు పెంచింది. సీఐఎల్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ 2022 వరకు 31 లక్షల మొక్కలను నాటింది. గని లీజు ప్రాంతంలో గత ఐదు సంవత్సరాల కాలంలో 4392 హెక్టార్లలో చేపట్టిన హరితహారం కార్యక్రమాలు సంవత్సరానికి 2.2 ఎల్టీ కార్బన్ సింక్ సంభావ్యతను సృష్టించాయి. బొగ్గు/లిగ్నైట్ పీఎస్‌యులు డిసెంబరు 2022 వరకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దాదాపు 2230 హెక్టార్ల భూమిలో ప్లాంటేషన్, దాదాపు 360 హెక్టార్లలో గడ్డిని పెంపకం చేపట్టింది. డ్రోన్ల ద్వారా సీడ్ కాస్టింగ్, సీడ్ బాల్ ప్లాంటేషన్, మియావాకీ ప్లాంటేషన్ వంటి కొత్త పద్ధతులను వివిధ గనులలో ఉపయోగింస్తూ ప్లాంటేషన్ అమలు చేయబడుతోంది. మైనింగ్ చేయబడిన ప్రాంతాలు, ఓవర్‌బర్డెన్ డంప్‌లు మరియు ఇతర మైనింగ్ చెదిరిన ప్రాంతాలు క్రియాశీల మైనింగ్ జోన్‌ల నుండి వెంటనే తొలగించబతాయి. ఈ అడవుల పెంపకం కార్యకలాపాలు, గ్రీన్ బెల్ట్ అభివృద్ధి పనులు కూడా కార్బన్ సింక్‌లను సృష్టిస్తున్నాయి. దట్టమైన చెట్ల కవరేజ్ వాయు కాలుష్యాన్ని నియంత్రించడంలో సహాయపడుతోంది, ఇవి మైనింగ్ కార్యకలాపాల సమయంలో విడుదలయ్యే సస్పెండ్ చేయబడిన ధూళి కణాలు విస్తరించకుండా నిర్బంధిస్తుంది.
***
(Release ID: 1891185)
Visitor Counter : 151