రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ
దేశవ్యాప్తంగా 651 జిల్లాల్లో జనౌషధి కేంద్రాలను తెరిచేందుకు అవకాశం
ఫార్మసిస్టుల నుంచి ఆన్‌లైన దరఖాస్తులకు ఆహ్వానం
Posted On:
12 JAN 2023 4:27PM by PIB Hyderabad
నాణ్యమైన జెనరిక్ ఔషధాలను సరసమైన ధరల్లో అందరికీ అందుబాటులోకి తేవాలన్న లక్ష్యంతో ప్రధానమంత్రి భారతీయ జనౌషధి పరియోజన (పిఎంబిజెపి)ని రసాయనాలు & ఫర్టిలైజర్ల మంత్రిత్వ శాఖ పరిధిలోని ఫార్మస్యూటికల్స్ విభాగం ప్రారంభించింది. ఈ పథకం కింద, మొత్తం 9000 జన ఔషధీ కేంద్రాలు ఇప్పటికే దేశవ్యాప్తంగా క్రియాత్మకంగా పని చేస్తున్నాయి. ప్రభుత్వం 2024 మార్చి నాటికి 10,000 జన ఔషధి కేంద్రాలను పెంచాలని లక్ష్యంగా పెట్టింది. పిఎంబిజెపి ఉత్పత్తి గంపలో అన్ని ప్రధాన చికిత్సా సమూహాలను కవర్ చేసే 1759 మందులు, 280 శస్త్రచికిత్స పరికరాలు ఉన్నాయి.
ఈ లక్ష్యంతో, వివిధ రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలలోని 651 జిల్లాల్లో కొత్త జన ఔషధి కేంద్రాలను ప్రారంభించేందుకు ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానించడానికి పిఎంబిజెపి అమలు సంస్థ అయిన ఫార్మాస్యూటికల్స్ అండ్ మెడికల్ డివైసెస్ బ్యూరో ఆఫ్ ఇండియా (పిఎంబిఐ) ప్రతిపాదనను ప్రభుత్వం ఆమోదించింది.
ఈ పథకం స్థిరమైన, సాధారణ ఆదాయాలతో స్వయం ఉపాధికి అద్భుతమైన అవకాశాన్ని అందిస్తుంది. పిఎంబిజెపి కింద, జన ఔషధి కేంద్రాలకు రూ. 5.00 లక్షల ప్రోత్సాహకాన్ని ఆర్థిక సహాయం కింద అందిస్తుంది. ఈశాన్య రాష్ట్రాలు, హిమాలయ ప్రాంతాలలో, ద్వీప ప్రాంతాలలో, నీతీ ఆయోగ చేత అభిలషణీయ జిల్లాలుగా గుర్తింపు పొందిన వెనుకబడిన ప్రాంతాలు లేదా మహిళా వ్యాపారవేత్తలు, మాజీ సైనికోద్యోగులు, దివ్యాంగులు, ఎస్‌సిలు & ఎస్టీలు తెరిస్తే ఒక్కసారి అదనపు ప్రోత్సాహకం కింద రూ. 2.00 లక్షలను అందచేయనున్నారు.
***
(Release ID: 1890859)
Visitor Counter : 199