ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
భారతదేశంలో తొలిసారి బాస్మతి బియ్యం కోసం సమగ్ర నియంత్రణ ప్రమాణాలను ప్రకటించిన ఎఫ్ఎస్ఎస్ఎఐ; 1 ఆగస్టు 2023 నుంచి అమలు
ఇది బాస్మతి బియ్యం సహజ సువాసన లక్షణాన్ని కలిగి ఉండటమే కాక కృత్రిమ రంగులు, పాలిషింగ్ ఏజెంట్లు, కృత్రిమ సువాసనలను లేకుండా ఉండాలి
జాతీయంగా, అంతర్జాతీయంగా బాస్మతి బియ్యం వాణిజ్యంలో నిజాయితీగల పద్దతులను నెలకొల్పడం, వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించడం లక్ష్యం
Posted On:
12 JAN 2023 3:59PM by PIB Hyderabad
దేశంలో మొట్టమొదటిసారిగా ఫుడ్ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఎఐ - భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ) బాస్మతి బియ్యం (బ్రౌన్ బాస్మతి బియ్యం, మిల్లింగ్ బాస్మతి బియ్యం, మిల్లింగ్ బ్రౌన్ బాస్మతి బిసయ్యం, తేలికపాటి, సగం ఉడకబెట్టిన బాస్మతి బియ్యంతో సహా) ఆహార భద్రత గుర్తింపు ప్రమాణాలను నిర్దేశించింది.ఆహార భద్రత, ప్రమాణాలు (ఆహార ఉత్పత్తుల ప్రమాణాలు, ఆహార సంకలిత పదార్ధాలు) మొదటి సవరణలు నిబంధనలు , 2023ను భారత గెజిట్‌లో నోటిఫై చేసింది.
ఈ ప్రమాణాల ప్రకారం, బాస్మతి బియ్యం సహజ సువాసనల లక్షణాలను కలిగి ఉండటమే కాక, కృత్రిమ రంగులు, పాలిషింగ్ ఏజెంట్లు, కృత్రిమ సువాసనలు లేకుండా ఉండాలి. బాస్మతి బియ్యానికి సంబంధించి భిన్న గుర్తింపు, ఉడికించిన తర్వాత బియ్యం గింజల పొడుగు నిష్పత్తి, తేమ గరిష్ట పరిమితులు, అమైలోస్ పరిణామం, యూరిక్ ఆసిడ్ (మూత్రికామ్లము), లోపభూయిష్ట/ పాడైన గింజలు, ఇతరయేతర బియ్యం తదితరాల భిన్న గుర్తింపు కలిగిన నాణ్యత పరామితులను నిర్దేశిస్తుంది.
జాతీయంగా, అంతర్జాతీయంగా బాస్మతి బియ్యం వాణిజ్యంలో న్యాయమైన పద్ధతులను నెలకొల్పడం, వినియోగదారుల ప్రయోజనాన్ని పరిరక్షించి, నెలకొల్పాలన్నది ఈ ప్రమాణాల లక్ష్యం. ఈ ప్రమాణాలు 1 ఆగస్టు, 2023 నుంచి అమలవుతాయి.
బాస్మతి బియ్యం అనేది భారత ఉపఖండంలోని హిమాలయ పర్వత ప్రాంతాలలో పండించే శ్రేష్టమైన రకం వరి, దాని పొడవైన గింజ పరిణామానికి. మెత్తటి ఆకృతి, ప్రత్యేకమైన స్వాభావిక సువాసన, రుచికి విశ్వవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. బాస్మతి బియ్యాన్ని పండించే నిర్దిష్ట భౌగోళిక ప్రాంతాల వ్యవసాయ- వాతావరణ పరిస్థితులు, వరి కోత, శుద్ధి, కాలం గడిచే కొద్దీ బియ్యానికి రుచి పెరగడం వంటి ప్రత్యేకతకు దోహదం చేస్తుంది. దాని ప్రత్యేక లక్షణాల కారణంగా, జాతీయంగా, అంతర్జాతీయంగా విస్త్రతంగా వినియోగించే రకం బియ్యం, దాని అంతర్జాతీయ సరఫరాలో మూడొంతులు భారత్ నుంచి వెళ్ళేదే.
శ్రేష్టమైన నాణ్యత కలిగిన బియ్యం కావడం, బాస్మతియేతర రకాల కన్నా ఎక్కువ ధర పలుకుతుండడంతో, ఆర్థిక లాభాల కోసం బాస్మతి బియ్యం వివిధ రకాల కల్తీలకు గురవుతుంది. అంటే, దీనిలో బాస్మతీయేతర రకాల బియ్యాన్ని ప్రకటించకుండా కలపడం వంటివి ఉంటాయి.
అందువల్ల, దేశీయ, ఎగుమతి మార్కెట్లలో ప్రామాణికమైన, నిజమైన బాస్మతి బియ్యం సరఫరాను నిర్ధారించడానికి సంబంధిత ప్రభుత్వ శాఖలు/ ఏజెన్సీలు, ఇతర వాటాదారులతో విస్త్రతమైన సంప్రదింపుల ద్వారా రూపొందించిన బాస్మతి బియ్యం నియంత్రణ ప్రమాణాలను ఎఫ్ఎస్ఎస్ఎఐ నోటిఫై చేసింది.
***
(Release ID: 1890858)
Visitor Counter : 238