వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

భారత్ - అమెరికా వాణిజ్య విధాన ఫోరం పై సంయుక్త ప్రకటన

Posted On: 12 JAN 2023 10:53AM by PIB Hyderabad

2023 జనవరి 11న వాషింగ్టన్ డీసీలో భారత్- అమెరికా ట్రేడ్ పాలసీ ఫోరం (టీపీఎఫ్) 13వ మంత్రుల స్థాయి సమావేశం జరిగింది. భారత వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పియూష్ గోయల్, యుఎస్ వాణిజ్య ప్రతినిధి రాయబారి కేథరిన్ తాయ్ ఈ సమావేశానికి సహ అధ్యక్షత వహించారు.

 

చర్చలు ముగిసిన తరువాత, ఈ క్రింది సంయుక్త ప్రకటన విడుదల చేశారు.

 

రెండు దేశాలలోని కార్మిక వర్గాలకు ప్రయోజనం చేకూర్చే విధంగా ధృఢమైన ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలను ఏర్పరచుకోవడంలోlనూ, ద్వైపాక్షిక ఆర్థిక సంబంధాలను పెంపొందించడంలోనూ టిపిఎఫ్ ప్రాముఖ్యతను మంత్రులు వివరించారు. వస్తువులు,సేవల ద్వైపాక్షిక వాణిజ్యం వేగంగా పెరుగుతూనే ఉందని, 2021 లో సుమారు 160 బిలియన్ డాలర్లకు చేరుకుందని వారు ప్రశంసించారు. ఈ పెంపును స్వాగతిస్తూ, అయితే ఆర్థిక వ్యవస్థల పరిమాణం లో గణనీయమైన సామర్థ్యం నెరవేరలేదని పేర్కొన్నారు. ద్వైపాక్షిక వాణిజ్యాన్ని పెంచడం , వివిధ రంగాలకు విస్తరించడం కొనసాగించాలనే లక్ష్యంతో భాగస్వామ్యాన్ని మరింత పెంచుకోవాలనే పరస్పర ఆకాంక్షను వారు వ్యక్తం చేశారు.

 

12 వ టిపిఎఫ్ మినిస్టీరియల్ నుంచి టిపిఎఫ్ వర్కింగ్ గ్రూపుల ద్వారా చేపట్టిన పనులను మంత్రులు ప్రస్తావించారు. 2021 టిపిఎఫ్ సంయుక్త ప్రకటనలో పేర్కొన్న నిర్దిష్ట వాణిజ్య సమస్యల ప్రాముఖ్యతను వారు పునరుద్ఘాటించారు మంత్రులు,వారి సీనియర్ అధికారులు పురోగతిని క్రమం తప్పకుండా సమీక్షించడం ద్వారా ఆ సమస్యలను పరిష్కరించే దిశగా ముందుకు సాగడానికి కృషి చేయాలని ఆదేశించారు

 

ఇండో-పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్ వర్క్ ఫర్ ప్రాస్పెరిటీ (ఐపీఈఎఫ్)లో భారత్ పాల్గొనడాన్ని అమెరికా స్వాగతించింది.

రాయబారి తాయ్ , మంత్రి గోయల్ ఐపిఇఎఫ్ చొరవకు పూర్తి మద్దతు ప్రకటించారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో నిరంతర వృద్ధి, శాంతి , సౌభాగ్యానికి భాగస్వామ్య దేశాల మధ్య లోతైన ఆర్థిక భాగస్వామ్యం ఎంతో కీలకమైనదని, ఐపిఇఎఫ్ ఈ ప్రాంతానికి స్పష్టమైన ప్రయోజనాలను తెస్తుందని ఆకాంక్షించారు.

 

డబ్ల్యూటీఓ పన్నెండవ మంత్రుల సమావేశంలో సాధించిన ఫలితాలను మంత్రులు స్వాగతించారు స్పష్టమైన, వాస్తవిక ,అర్ధవంతమైన ఫలితాలను సాధించడానికి డబ్ల్యూటీఓ మంత్రిత్వ నిర్ణయాలతో సహా డబ్ల్యూటీఓ లో నిర్మాణాత్మకంగా పనిచేయడం కొనసాగించాలనే తమ ఉమ్మడి ఉద్దేశాన్ని వ్యక్తం చేశారు. డబ్ల్యూటీఓ మౌలిక సూత్రాలను వారు గుర్తు చేస్తూ, డబ్ల్యూటీఓ సంస్కరణ బహుపాక్షిక వాణిజ్య వ్యవస్థపై నమ్మకాన్ని పెంపొందించాలని . డబ్ల్యూటీఓ తన మూల లక్ష్యాలను మరింత మెరుగ్గా ముందుకు తీసుకెళ్లడానికి ఇంకా మన ప్రజలందరి అవసరాలకు ప్రతిస్పందించడానికి వీలు కల్పిస్తుందని వారుఅన్నారు. .

 

భారతదేశ జి 20 అధ్యక్షత హోదాను అంబాసిడర్ తాయ్ స్వాగతించారు వాణిజ్యం ,పెట్టుబడి వర్కింగ్ గ్రూపులో భారత్ తో కలిసి పనిచేయడానికి అమెరికా యునైటెడ్ స్టేట్స్ ఎదురు చూస్తోందని అన్నారు. ప్రపంచ వాణిజ్య సమస్యలపై సభ్య దేశాల మధ్య సమన్వయం, సహకారాన్ని పెంచడానికి నిర్మాణాత్మక సంభాషణలను ప్రారంభించడానికి జి 20 ఉపయోగకరమైన వేదిక కాగలదని ఆమె పేర్కొన్నారు.

 

ఇరు దేశాల మధ్య అపరిష్కృతంగా ఉన్న డబ్ల్యుటిఓ వివాదాలపై పరస్పరం అంగీకరించిన పరిష్కారాలను కనుగొనే లక్ష్యంతో తమ అధికారుల మధ్య ఇటీవల పనిని వేగవంతం చేయడాన్ని మంత్రులు స్వాగతించారు. రాబోయే నెలల్లో సంతృప్తికరమైన ఫలితాలను సాధించే విధంగా ఈ ప్రక్రియను కొనసాగించాలని వారు అధికారులను ఆదేశించారు.

 

ద్వైపాక్షిక వాణిజ్య సమస్యలపై చర్చ

 

అపరిష్కృతంగా ఉన్న వాణిజ్య సమస్యల పరిష్కారంలో కలిసి పనిచేయడాన్ని కొనసాగించాలని మంత్రులు తమ ఉద్దేశాన్ని వ్యక్తం చేశారు ఆ సమస్యలలో ఎంపిక చేసిన అనేక అంశాలపై చేపట్టబోయే కార్యాచరణను వివరించారు.

 

డ్రగ్స్, మెడికల్ డివైజెస్, కాస్మోటిక్స్ చట్టం ముసాయిదాపై భారతదేశ ప్రారంభ బహిరంగ సంప్రదింపులను అమెరికా ప్రశంసించింది.ముసాయిదా బిల్లుపై వ్యాఖ్యలు , సూచనలను పార్లమెంటులో ప్రవేశపెట్టడానికి ప్రామాణిక పద్ధతుల ప్రకారం పరిశీలిస్తున్నట్లు భారతదేశం పేర్కొంది. సంబంధిత నియమనిబంధనలపై ముందుకు సాగవలసిన అవసరాన్ని అమెరికా, భారత్ గుర్తించాయి.

 

డబ్ల్యూటీఓ టీబీటీ ఒప్పందానికి అనుగుణంగా కొత్త నాణ్యతా నియంత్రణ ఉత్తర్వులను పరిగణనలోకి తీసుకొని, అవసరమైన దానికంటే ఎక్కువ వాణిజ్య నియంత్రణ చర్యలు తీసుకోకుండా చూసుకోవడానికి పబ్లిక్ నోటీస్,కామెంట్ పీరియడ్ లను అందించడం లో భారతదేశం నిబద్ధతను అమెరికా స్వాగతించింది.

 

ఎన్ఓఏఏ సాంకేతిక సహకారంతో టర్టిల్ ఎక్స్ క్లూడర్ డివైస్ (టెడ్) డిజైన్ ను ఖరారు చేయడాన్ని మంత్రులు స్వాగతించారు.టెడ్ ట్రయల్స్ ను వేగవంతం చేయడానికి భారతదేశం- అమెరికా మధ్య సహకారం సముద్ర తాబేళ్ల జనాభా పై వేట ప్రభావాన్ని తగ్గించడంలో టిఇడిలు ప్రభావవంతంగా ఉన్నాయని నిర్ధారిస్తుంది. భారతదేశంలో టెడ్ ట్రయల్స్ పూర్తి చేయడానికి కొనసాగుతున్న పనులు 2023 ప్రారంభంలో కూడా కొనసాగుతాయని

వారు పేర్కొన్నారు.

 

నిబంధనల భారాన్ని తగ్గించడానికి, వ్యాపారాన్ని సులభతరం చేయడానికి మాండేటరీ టెస్టింగ్ అండ్ సర్టిఫికేషన్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ ఎక్విప్ మెంట్ (ఎంటిసిటిఇ) ,నిర్బంధ రిజిస్ట్రేషన్ ఆర్డర్ (సిఆర్ఓ) కింద కొన్ని ఎలక్ట్రానిక్ పరికరాలపై నిబంధనలను క్రమబద్ధీకరించే ప్రయత్నాలను అమెరికా స్వాగతించింది. ఎలక్ట్రానిక్స్ రంగంలో అంతర్జాతీయ ప్రమాణాల వినియోగం, ధృవీకరణ మదింపు విధానాలు, కామన్ స్టాండర్డ్ రికగ్నిషన్ అరేంజ్ మెంట్ (సీసీఆర్ ఏ) పై సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకునేందుకు ఇరు పక్షాలు ఆసక్తి కనబరిచాయి.

 

మేధో సంపత్తి (ఐపి) పై నిరంతర నిమగ్నతను మంత్రులు స్వాగతించారు మేధో సంపత్తి రక్షణ ,అమలు ఆవిష్కరణల ప్రోత్సాహంతో పాటు ఐపి-ఇంటెన్సివ్ పరిశ్రమలలో ద్వైపాక్షిక వాణిజ్యం ,పెట్టుబడులకు దోహదం చేస్తుందని వారు పునరుద్ఘాటించారు.

టిపిఎఫ్ ఐపి వర్కింగ్ గ్రూప్ నిరంతర కృషిని వారు ప్రశంసించారు. ఐపి అమలుకు సంబంధించిన సమస్యలపై నిమగ్నం కావడంలో దాని ఇటీవలి పురోగతిని సమీక్షించారు. పేటెంట్ల పనితీరుకు సంబంధించిన వ్యాపార గోప్యమైన సమాచారం, పేటెంట్ దరఖాస్తు వ్యతిరేకతలు , ట్రేడ్ మార్క్ ఉల్లంఘన దర్యాప్తు లను క్రమబద్ధీకరించడంతో సహా తన ఐపి పాలన నిర్వహణకు సంబంధించి భారతదేశ స్థానిక సంప్రదింపులను అమెరికా స్వాగతించింది. ప్రపంచ మేధో సంపత్తి సంస్థ కాపీరైట్ ఒప్పందం,ప్రపంచ మేధో సంపత్తి సంస్థ పనితీరు ,ఫోనోగ్రామ్ ఒప్పందం కింద కట్టుబాట్ల దృష్ట్యా కాపీరైట్ నిబంధనలపై నిమగ్నం కావలసిన అవసరం ఉందని రెండు దేశాలు అంగీకరించాయి.

 

కోవిడ్ మహమ్మారి సమయంలో రోగులకు సరసమైన వైద్య పరికరాల అందుబాటుపై ట్రేడ్ మార్జిన్ హేతుబద్ధీకరణ (టిఎంఆర్) సానుకూల ప్రభావాన్ని మంత్రులు గుర్తించారు. రోగులకు సరసమైన ధరలకు అత్యాధునిక వైద్య సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటు చేయడానికి వీలు కల్పించే కార్డియాక్ స్టెంట్లు ,మోకాలి ఇంప్లాంట్ ల ధరల సమస్యలపై అభిప్రాయాలను పంచుకోవడాన్ని కొనసాగించాలని వారు అంగీకరించారు.

 

యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్డిఎ) తనిఖీలను తిరిగి ప్రారంభించడాన్ని భారతదేశం ప్రశంసించింది.కొత్త సౌకర్యాలు,ప్రాధాన్యత లేని ప్రాంతాల తనిఖీలను కూడా వీలైనంత త్వరగా తిరిగి ప్రారంభించాలని యుఎస్ ప్రతినిధి వర్గాన్ని కోరింది.

 

యు.ఎస్. జనరలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ ప్రోగ్రామ్ కింద తన లబ్దిదారు హోదాను పునరుద్ధరించడానికి భారతదేశం ఆసక్తిని వ్యక్తం చేసింది. యుఎస్ కాంగ్రెస్ నిర్ణయించిన అర్హత ప్రమాణాలకు సంబంధించి ఇది అవసరమని యునైటెడ్ స్టేట్స్ గుర్తించింది.

 

నిర్దేశిత సుంకాల తగ్గింపుపై కూడా అభిప్రాయాలను పంచుకున్న భారత్- అమెరికా

 

ఇరు పక్షాలకు ప్రయోజనం కలిగించే కొన్ని వ్యవసాయ ఉత్పత్తుల అందుబాటును ఖరారు చేయడానికి చేయాల్సిన మిగిలిన పనిని మంత్రులు గుర్తించారు. 2023 నాటికి ఆహార, వ్యవసాయ వాణిజ్య అంశాలపై చర్చలు పెంచాలని, వ్యవసాయ వర్కింగ్ గ్రూపులు, సంబంధిత సబ్ గ్రూపుల ద్వారా ద్వైపాక్షిక సమస్యలను పరిష్కరించడానికి కృషిని కొనసాగించాలని మంత్రులు నిర్ణయించారు. .

 

ట్రేడ్ పాలసీ ఫోరం కింద సర్వీసెస్ వర్కింగ్ గ్రూప్ నిర్మాణాత్మక నిమగ్నతను మంత్రులు గుర్తించారు. సేవా రంగాలలో పరస్పర ప్రయోజనం ఉన్న సమస్యలను వర్కింగ్ గ్రూప్ ద్వారా పరిశీలించడాన్నీ కొనసాగిస్తామని మంత్రులు చెప్పారు.

 

ఇరు దేశాల మధ్య వృత్తి నిపుణులు, నైపుణ్యం ఉన్న కార్మికులు, విద్యార్థులు, పెట్టుబడిదారులు, వ్యాపార ప్రయాణికుల రాక పోకలు ద్వైపాక్షిక ఆర్థిక , సాంకేతిక భాగస్వామ్యాన్ని పెంపొందించడానికి ఎంతో తోడ్పడుతున్నాయని మంత్రులు పేర్కొన్నారు. వీసా దరఖాస్తుల ప్రాసెసింగ్ ను పెంచడానికి అమెరికా తీసుకుంటున్న చర్యలను భారత్ గుర్తించింది. నిపుణులు, నైపుణ్యం కలిగిన కార్మికులు, నిపుణులు ,శాస్త్రీయ సిబ్బంది కదలికను సులభతరం చేయాలనే ఉమ్మడి సంకల్పంతో వీసా సమస్యలపై నిశితంగా పర్యవేక్షించడం కొనసాగించాలని ఇరు పక్షాలు నిర్ణయించాయి.

 

సామాజిక భద్రత సంపూర్ణతా ఒప్పందం పై జరుగుతున్న చర్చలను మంత్రులు ప్రస్తావిస్తూ, భారlత దేశం నుండి అదనపు సమాచారాన్ని అందుకొన్న

తర్వాత భవిష్యత్తు ఒప్పందానికి ఒక

బలమైన ఆధారాన్ని ఏర్పరచడానికి

చర్చల ప్రక్రియను మరింత ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించారు. ఈ విషయంలో సత్వర ఫలితాలను సాధించడానికి పనిని తీవ్రతరం చేయడానికి మంత్రులు మద్దతు ప్రకటించారు.

 

రెండు దేశాల లోనూ డిజిటల్ ఆర్థిక వ్యవస్థ కీలక పాత్రను గుర్తించిన మంత్రులు, ఆర్థిక వృద్ధి ,ఆవిష్కరణలకు మద్దతు ఇచ్చే డిజిటల్ వాణిజ్యానికి అనుకూలమైన పర్యావరణ వ్యవస్థ ప్రాముఖ్యతను పునరుద్ఘాటించారు. డిజిటల్ వాణిజ్యంపై ప్రభావం చూపే విధానాలపై టిపిఎఫ్ ,ఐసిటి వర్కింగ్ గ్రూప్ ద్వారా నిమగ్నతను పెంచడానికి వారు అంగీకరించారు.

 

ఇరు దేశాల మధ్య వృత్తి సేవల్లో వాణిజ్యాన్ని పెంపొందించే అవకాశాలను మంత్రులు గుర్తించారు. వృత్తిపరమైన సేవలలో అర్హతలను గుర్తించడానికి బాగా పనిచేసే మార్గాలు ,రెండు దేశాల వృత్తిపరమైన సంస్థల మధ్య లోతైన సంభాషణ ఈ వృద్ధిని సులభతరం చేయగలవని వారు అంగీకరించారు. వృత్తిపరమైన సేవలలో వాణిజ్యాన్ని మరింత పెంచడానికి విజ్ఞానం మార్పిడి, సామర్థ్య పెంపు, అర్హతల గుర్తింపుపై చర్చలలో పాల్గొనడానికి నియంత్రణ సంస్థలను ప్రోత్సహించాలని కూడా అభిప్రాయపడ్డారు.

 

ఫిన్ టెక్ రంగంలో మరింత సహకారం ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాన్ని ఇంకా విస్తరించడానికి దోహదం చేస్తుందని, ఈ రంగంలో భాగస్వామ్యం కొనసాగించాలని మంత్రులు అభిప్రాయపడ్డారు. వాణిజ్య సంబంధాలను ముందుకు తీసుకెళ్లడంలో ఎలక్ట్రానిక్ చెల్లింపు సేవల ప్రాముఖ్యతను కూడా వారు చర్చించారు ఈ రంగం లో నిమగ్నతను కొనసాగించాలనే తమ ఉద్దేశాన్ని రెండు పక్షాలు వ్యక్తం చేశాయి.

 

ఆరోగ్య అత్యవసర పరిస్థితులకు సమర్థవంతమైన ప్రతిస్పందనలను పెంపొందించడంలో స్థితిస్థాపకత కలిగిన సరఫరా గొలుసుల ప్రత్యేక ప్రాముఖ్యతపై పరస్పర ఆసక్తిని మంత్రులు వ్యక్తంచేశారు. ఆరోగ్య అత్యవసర సమయాల్లో సంరక్షణను కొనసాగించడంలో భాగంగా డిజిటల్ ఆరోగ్యం, ముఖ్యంగా టెలిమెడిసిన్ సేవల సామర్థ్యంపై భారతదేశం ఆసక్తిని మంత్రి గోయల్ ప్రముఖంగా ప్రస్తావించారు.

 

స్థితిస్థాపక వాణిజ్యంపై కొత్త టి పి ఎఫ్ వర్కింగ్ గ్రూపు ఏర్పాటు

 

యుఎస్-ఇండియా వాణిజ్య సంబంధాలను మరింత లోతుగా, విస్తృతం చేయాలనే ఉమ్మడి లక్ష్యాన్ని ప్రతిబింబిస్తూ, మంత్రులు స్థితిస్థాపక వాణిజ్యంపై కొత్త టిపిఎఫ్ వర్కింగ్ గ్రూపును ప్రారంభించారు. ఈ కొత్త వర్కింగ్ గ్రూప్ వాణిజ్య సంబంధాల స్థితిస్థాపకత, సుస్థిరతను పెంపొందించే అనేక అంశాలపై ద్వైపాక్షిక సంభాషణలను మరింత సమగ్రంగా జరపడానికి అధికారులకు వీలు కల్పిస్తుంది, తద్వారా ప్రస్తుత ,భవిష్యత్ ప్రపంచ సవాళ్లను మరింత మెరుగ్గా ఎదుర్కోగలుగుతుంది.

తదుపరి టిపిఎఫ్ మంత్రుల సమావేశానికి ముందు, స్థితిస్థాపక వాణిజ్య వర్కింగ్ గ్రూప్ ప్రారంభంలో ఈ క్రింది రంగాలపై దృష్టి పెడుతుందని మంత్రులు గుర్తించారు:

 

*మన్నికైన , స్థిరమైన సరఫరా గొలుసుల నిర్మాణానికి సంబంధించిన వాణిజ్య సౌలభ్యంపై లోతైన నిమగ్నత. కస్టమ్స్ విధానాల డిజిటలైజేషన్ తో సహా రాబోయే నెలల్లో వాణిజ్య సౌలభ్యంపై అంకితభావంతో కూడిన వర్కింగ్ సెషన్ కోసం ప్రణాళికలను మంత్రులు స్వాగతించారు.భవిష్యత్తు సహకారం కోసం అదనపు రంగాలను కూడా అధికారులు గుర్తిస్తారు.

 

*కార్మికులకు ప్రయోజనం చేకూర్చడం, కార్మిక హక్కులు, శ్రామికశక్తి అభివృద్ధిని ప్రోత్సహించడానికి సహకార చర్య లతో సహా స్థిరమైన,సమ్మిళిత వృద్ధిని ప్రోత్సహించడం

 

*తదుపరి టిపిఎఫ్ మంత్రుల సమావేశానికి ముందు నియమనిబంధనలను అభివృద్ధి చేయడానికి సంబంధిత విధానాలపై ప్రాథమిక దృష్టితో మంచి నియంత్రణ పద్ధతులపై సంభాషణ, పరస్పర ఆసక్తి ఉన్న రంగాలలో సహకారాన్ని కొనసాగించడం;

 

*సుస్థిర ఆర్థిక సమీకరణ ,సృజనాత్మక, పరిశుభ్రమైన సాంకేతిక పరిజ్ఞానాల పెంపుదలకు సంబంధించిన సమస్యలతో సహా పర్యావరణ పరిరక్షణ ,సాధారణ సుస్థిరత సవాళ్లకు ప్రతిస్పందనలకు దోహదం చేయడంలో వాణిజ్యం పోషించగల పాత్ర..అంతేకాకుండా, సర్క్యులర్ ఆర్థిక విధానాలకు సంబంధించిన పరస్పర ప్రయోజనాల సమస్యలపై , స్థిరమైన జీవనశైలి ఎంపికలను ప్రోత్సహించడంలో ఇరు పక్షాలు నిమగ్నం కావచ్చు;

 

*మన ప్రపంచ సరఫరా గొలుసులలో, ముఖ్యంగా మన ఆర్థిక వ్యవస్థలకు మద్దతు ఇచ్చే క్లిష్టమైన రంగాలలో స్థితిస్థాపకతను బలోపేతం చేయడానికి అదనపు మార్గాలు, అలాగే మన నమ్మకమైన భాగస్వాములతో సమన్వయం సహకారంతో ఈ సమస్యలపై మరింత పని చేస్తాయి.

 

వాణిజ్య సంబంధాలు దాని పూర్తి సామర్థ్యాన్ని చేరుకోవడం ప్రారంభించడానికి నిర్దిష్ట వాణిజ్య ఫలితాలను గుర్తించడానికి వ్యక్తిగతంగా లేదా వర్చువల్ గా త్రైమాసికంగా తిరిగి సమావేశమవ్వాలని టిపిఎఫ్ వర్కింగ్ గ్రూపులను ఆదేశించడం ద్వారా మంత్రులు సమావేశాన్ని ముగించారు. 2023 మధ్య నాటికి ఇంటర్ సెషన్ టిపిఎఫ్ సమావేశాన్ని నిర్వహించాలని సీనియర్ అధికారులను ఆదేశించారు అలాగే 2023 చివరి నాటికి మంత్రుల స్థాయిలో టిపిఎఫ్ ను తిరిగి సమావేశపరచడానికి అంగీకరించారు.

 

 

************


(Release ID: 1890756) Visitor Counter : 224