ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రపంచంలోనే అతి పొడవైన నదీ విహార నౌక`ఎం.వి గంగా విలాస్‌ను , టెంట్‌ సిటీని జనవరి 13న వారణాశిలో ప్రారంభించనున్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ


ఈ ప్రాంత పర్యాటక సామర్ధ్యాన్ని మరింత పెంచనున్న ఈ రెండు ప్రాజెక్టులూ.

వెయ్యికోట్లరూపాయలకు పైగా విలువగల మరిన్ని అంతర్గత జలరవాణా ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ.

హాల్దియాలో మల్టీమోడల్‌ టెర్మినల్‌ను ప్రారంభించనున్న ప్రధానమంత్రి.

Posted On: 11 JAN 2023 1:27PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ, 2023 జనవరి 13 వతేదీ ఉదయం 10:00 గంటలకు వీడియో కాన్ఫరెన్సింగ్‌ ద్వారా ప్రపంచంలోనే అత్యంత పొడవైన నదీ విహార నౌక ఎం.వి.గంగా విలాస్‌ను, అలాగే వారణాశి లోని టెంట్‌ సిటీని ప్రారంభించనున్నారు.ఈ సందర్భంగా ప్రధానమంత్రి మరో వెయ్యి కోట్ల రూపాయల విలువగల  అంతర్దేశీయ జలరవాణా ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు.
ఎం.వి.గంగా విలాస్‌:

ఎం.వి.గంగా విలాస్‌ ఉత్తరప్రదేశ్‌ లోని వారణాశి నుంచి బయలుదేరి 51 రోజులపాటు 3,200 కిలోమీటర్ల దూరం ప్రయాణించి అస్సాంలోని దిబ్రూఘడ్‌కు చేరుకుంటుంది. మార్గమధ్యంలో ఇది 27 నదీమార్గాలమీదుగా , వివిధరాష్ట్రాలను దాటుకుంటూ బంగ్లాదేశ్‌ మీదుగా  ప్రయాణం సాగిస్తుంది. ఎంవి గంగా విలాస్‌కు మూడు డెక్‌ లు 18 సూట్‌లు ఉండి 36 మందికి లక్జరీ ప్రయాణ సదుపాయాలు కలిగిఉంటుంది. ఈ నౌక తొలి ప్రయాణానికి స్విట్జర్లాండ్‌ నుంచి 32 మంది తమ పేర్లను మొత్తం జర్నీకి నమోదు చేసుకున్నారు.


ఎం.వి.గంగా విలాస్‌ క్రూయిస్‌, భారతదేశాన్ని ప్రపంచానికి అత్యుత్తమంగా తెలియజెప్పేలా తీర్చిదిద్దారు.51 రోజులపాటు ప్రణాళికా బద్ధంగా సాగే ఈనౌకా విహారం లో 50 ముఖ్యమైన టూరిస్టుప్రదేశాలను , ప్రపంచ ప్రసిద్ధ వారసత్వ ప్రదేశాలను,జాతీయ పార్కులను, నదీ ఘాటల్‌ను బీహార్‌లోని పాట్నా, జార్ఖండ్‌లోని సాహిబ్‌ గంజ్‌, పశ్చిమబెంగాల్‌లోని కోల్‌కతా, అస్సాంలోని గౌహతి, బంగ్లాదేశ్‌ లోని ఢాకాలను సందర్శించే ఏర్పాట్లు
చేశారు. ఈ పర్యటన టూరిస్టులకు ఒక మధురానుభూతిని మిగిల్చేలా తీర్చిదిద్దారు. ఈ పర్యటనలో ఇండియా ,బంగ్లాదేశ్‌లకు చెందిన కళలు, సంస్కృతి, చరిత్ర, ఆథ్యాత్మికతను తెలుసుకునేందుకు వీలు కల్పిస్తుంది.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆలోచనలకు అనుగుణంగా దేశంలో నదీవిహార పర్యాటకాన్ని పెంపొందించేందుకు , ఈ రంగంలోని అపార అవకాశాలను సద్వినియోగం చేసుకునేందుకు పెద్ద ఎత్తున చర్యలు చేపడుతున్నారు.ఇందుకు అనుగుణంగా ప్రస్తుతం ప్రారంభం కానున్న నౌకా విహార సర్వీసు నదీ విహార పర్యాటకరంగంలో దేశంలో కొత్తశకానికి నాంది కాగలదు.

వారణాశిలో టెంట్‌సిటీ :

వారణాశిలో గంగానది ఒడ్డున టెంట్‌ సిటీకి రూపకల్పన చేశారు. ఈ ప్రాంతంలో పర్యాటకాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించేందుకు దీనిని చేపట్టారు. ఈ ప్రాజెక్టును నగరంలోని ఘాట్‌లకు ఎదురుగా చేపట్టారు. ఇక్క్డడ వారణాశికి పెద్ద ఎత్తున తరలివచ్చే పర్యాటకుల సౌకర్యార్థం వసతిని ఏర్పాటు చేశారు. ప్రత్యేకించి కాశీ విశ్వనాథ థామాన్ని ఆధునీకరించి న తర్వాత పర్యాటకులు, యాత్రికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. దీనిని వారణాశి డవలప్‌ మెంట్‌ అథారిటీ పిపిపి పద్ధతిలో అభివృద్ధి చేసింది. పర్యాటకులు వివిధ ఘాట్‌లనుంచి టెంట్‌సిటీకి చేరుకునే వీలు కల్పించారు. టెంట్‌సిటీ ప్రతి ఏడాది అక్టోబర్‌నుంచి జూన్‌ వరకు ఉంచుతారు. ఆతర్వాత వర్షాకాలంలో గంగానది  ప్రవాహమట్టం పెరిగే అవకాశం ఉన్నందున మూడు నెలలపాటు వాటిని తొలగిస్తారు. 

దేశీయ జల మార్గ ప్రాజెక్టులు:
ప్రధానమంత్రి పశ్చిమబెంగాల్‌లోని హాల్దియి మల్టీమోడల్‌ టెర్మినల్‌నుకూడా ప్రారంభిస్తారు. దీనిని జలమార్గ్‌ వికాస్‌ ప్రాజెక్టు కింద అభివృద్ధిచేశారు. హాల్దియా మల్టీమోడల్‌ టెర్మినల్‌ ఏడాదికి 3 మిలియన్‌ మెట్రిక్‌టన్నుల కార్గో రవాణా, దిగుమతి సామర్ధ్యం కలిగిఉంటుంది. 3000 డెడ్‌వెయిట్‌ టన్నేజ్‌ (డి.డబ్ల్యుటి) సామర్ధ్యంగల నౌకల కార్యకలాపాలకు సరిపడిన బెర్త్‌లు ఇందులో ఉన్నాయి.

ఉత్తరప్రదేశ్‌లోని బాలియా జిల్లాకాన్స్‌పూర్‌, ఘాజిపూర్‌ జిల్లా జమానియ, చోచక్‌పూర్‌, సైదాపూర్‌లలో నాలుగు ఫ్లోటింగ్‌ కమ్యూనిటీ జెట్టీలను ప్రధానమంత్రి  ప్రారంభించనున్నారు. వీటితోపాటు బీహార్‌ లోని పాట్నా జిల్లాలో డిఘా,నక్తా దియారా, బార్హ్‌, పనాపూర్‌, సమస్తిపూర్‌జిల్లాలోని హసన్‌పూర్‌లలో  ఐదు కమ్యూనిటీ జెట్టీలకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. ఉత్తరప్రదేశ్‌, బీహార్‌ జార్ఖండ్‌, పశ్చిమబెంగాల్‌లో గంగా నది ఒడ్డున సుమారు 60 కమ్యూనిటీ జెట్టీలను నిర్మించనునున్నారు.ఇవి ఆ ప్రాంతంలో ఆర్థిక కార్యకలాపాలు పుంజుకోవడానికి, స్థానిక ప్రజల జీవనోపాధి మెరుగుపడడానికి ఉపకరిస్తాయి. చిన్న రైతులు, మత్స్యకార యూనిట్లకు , అసంఘటిత రంగంలో వ్యవసాయ ఉత్పత్తులయూనిట్లకు, పండ్లతోటల పెంపకందారులకు, పూల సాగుదారులకు చేతివృత్తుల వారికి తమ ఆర్థిక కార్యకలాపాలను మరింత పెంచుకునేందుకు, గంగానదిప్రాంతంలో తమ కార్యకలాపాలపై మరింత దృష్టిపెట్టేందుకు ఇవి ఉపకరిస్తాయి.

ప్రధానమంత్రి   గౌహతిలో ఈశాన్య రాష్ట్రాల కోసం  సముద్రయాన నైపుణ్య అభివృద్ధి కేంద్రాన్ని కూడా ప్రారంభించనున్నారు. ఇది ఈశాన్య రాష్ట్రాలలో ఉన్న
అద్భుత ప్రతిభను వెలికితీసి, వారికి నానాటికీ పెరుగుతున్న లాజిస్టిక్ పరిశ్రమలో మరింత మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించేందుకు దీనిని ఏర్పాటు చేస్తున్నారు.
దీనికితోడు, ప్రధానమంత్రి గౌహతిలో పాండు టెర్మినల్ లో షిప్ రిపేర్ సదుపాయానికి, ఎలివేటెడ్ రోడ్కు శంకుస్థాపన చేస్తారు.  షిప్ రిపేర్ ఫెసిలిటీ ని పాండు టెర్మినల్ లో ఏర్పాటుచేస్తే నౌకల మరమ్మత్తు విషయంలో ఎంతో సమయం ఆదా అవుతుంది.
నౌకలను   రిపేర్కు కోల్కతాకు తరలించి తిరిగి తీసుకురావడానికి సుమారు నెలరోజులకు పైబడి పడుతుంది. దీనివల్ల రవాణా వ్యయం  చాలావరకు తగ్గడంతో. డబ్బు ఆదా అవుతుంది.  పాండుటెర్మినల్ నుంచి ఎన్ హెచ్ 27 వరకు ప్రత్యేక రోడ్ ఉండడంతో 24 గంటలూ అనుసంధానత ఉంటుంది.

 

***


(Release ID: 1890638) Visitor Counter : 180