ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 10.01.2023 వరకు ప్రత్యక్ష పన్ను వసూళ్ల వివరాలు


- 14.71 లక్షల కోట్లకు చేరుకున్న స్థూల పన్ను వసూళ్లు

- గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 24.58 శాతం ఎక్కువ

- ఈ ఆర్థిక సంవత్సరం ప్రత్యక్ష పన్నుల మొత్తం వసూళ్ల బడ్జెట్ అంచనాలో నికరంగా 86.68 శాతం మేర సేకరణ

प्रविष्टि तिथि: 11 JAN 2023 5:59PM by PIB Hyderabad

ప్రత్యక్ష పన్ను వసూళ్లలో స్థిరమైన వృద్ధి నమోదవుతూ వస్తోంది. జనవరి 10, 2023 వరకు ప్రత్యక్ష పన్ను వసూళ్ల యొక్క తాత్కాలిక గణాంకాలు స్థిరమైన వృద్ధిని నమోయిందిజనవరి 10, 2023 వరకు ప్రత్యక్ష పన్నుల స్థూల వసూళ్లు రూ. 14.71 లక్షల కోట్లకు చేరాయి. ఇది గత ఏడాది ఇదే కాలానికి వసూళ్లయిన స్థూల వసూళ్లతో పోలిస్తే 24.58% అధికంప్రత్యక్ష పన్ను వసూళ్లురీఫండ్ నికరం మినహాయింపు తరువాత రూ. 12.31 లక్షల కోట్లుగా నిలిచాయిఇది గత ఏడాది ఇదే కాలానికి నికర వసూళ్ల కంటే 19.55% ఎక్కువ సేకరణ 2022-23 ఆర్థిక సంవత్సరానికి  సంబంధించిన ప్రత్యక్ష పన్నుల మొత్తం బడ్జెట్ అంచనాలలో 86.68%. స్థూల ఆదాయ సేకరణల పరంగా కార్పొరేట్ ఆదాయపు పన్ను (సీఐటీమరియు వ్యక్తిగత ఆదాయపు పన్ను (పీఐటీవృద్ధి రేటు విషయానికి వస్తే.. సీఐటీ వృద్ధి రేటు 19.72 శాతం కాగాపీఐటీ (ఎస్టీటీతో సహా) 30.46 శాతంగా ఉంది.  వాపసుల సర్దుబాటు తర్వాత, సీఐటీ సేకరణలలో నికర వృద్ధి 18.33 శాతంగాను మరియు పీఐటీ సేకరణలలో 21.64 శాతంగాను (పీఐటీ మాత్రమే)/ 20.97శాతం (ఎస్టీటీతో సహా పీఐటీ) ఉంది. ఏప్రిల్ 1, 2022 నుండి 10 జనవరి 2023 వరకు మొత్తం రూ. 2.40 లక్షల కోట్ల రిఫండ్లు జారీ చేయబడ్డాయి, ఇది అంతకు ముందు సంవత్సరం ఇదే కాలంలో జారీ చేయబడిన రీఫండ్‌ల కంటే 58.74% అధికం.

****


(रिलीज़ आईडी: 1890597) आगंतुक पटल : 199
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Tamil , English , Urdu , Marathi