మంత్రిమండలి
azadi ka amrit mahotsav

కోల్ కాతా లోని జోకా లో గల నేశనల్సెంటర్ ఫార్ డ్రింకింగ్ వాటర్, సేనిటేశన్ ఎండ్ క్వాలిటీ పేరు ను మార్చివేస్తూ ఆసంస్థ కు డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ నేశనల్ ఇన్ స్టిట్యూశన్ ఆఫ్ వాటర్ ఎండ్సేనీటేశన్ (ఎస్ పిఎమ్-ఎన్ఐడబ్ల్యుఎఎస్) అనే పేరు ను పెట్టేందుకు ఎక్స్-పోస్ట్ఫ్యాక్టో ఆమోదాన్ని తెలిపిన మంత్రిమండలి

Posted On: 11 JAN 2023 3:44PM by PIB Hyderabad

కోల్ కాతా లోని జోకా లో గల నేశనల్ సెంటర్ ఫార్ డ్రింకింగ్ వాటర్, సేనిటేశన్ ఎండ్ క్వాలిటీ పేరు ను మార్చివేస్తూ ఆ సంస్థ కు డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ నేశనల్ ఇన్ స్టిట్యూశన్ ఆఫ్ వాటర్ ఎండ్ సేనిటేశన్ (ఎస్ పిఎమ్- ఎన్ఐడబ్ల్యుఎఎస్) అనే పేరు ను పెట్టేందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఎక్స్-పోస్ట్ ఫ్యాక్టో ఆమోదాన్ని తెలియజేసింది.

ఈ సంస్థ ను పశ్చిమ బంగాల్ లో కోల్ కాతా లోని జోకా కు చెందిన డాయమండ్ హార్బర్ రోడ్డు లో 8.72 ఎకరాల భూమి మీద స్థాపించడం జరిగింది. శిక్షణ కార్యక్రమాల మాధ్యం ద్వారా పబ్లిక్ హెల్థ్ ఇంజినీరింగ్, త్రాగునీరు, పారిశుధ్యం, ఇంకా ఆరోగ్య రక్షణల రంగం లో రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాల లో సామర్ధ్యాన్ని వికసింపచేసేటటువంటి ఒక ప్రముఖ సంస్థ గా దీనిని ఏర్పాటు చేయడమైంది. ఆ తరహా సామర్థ్యాల ను కేవలం స్వచ్ఛ్ భారత్ మిశన్ మరియు జల్ జీవన్ మిశన్ ల అమలులో నిమగ్నం అయిన ఫ్రంట్ లైన్ వర్క్ ఫోర్స్ కే కాకుండా గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల కు చెందిన స్థానిక సంస్థ ల ప్రతినిధుల కోసం కూడాను దృష్టి లో పెట్టుకొని రూపొందించడం జరిగింది. దీనికి అనుగుణం గా శిక్షణ సంబంధి మౌలిక సదుపాయాలు, పరిశోధన మరియు అభి వృద్ధి (ఆర్ ఎండ్ డి) బ్లాకు మరియు ఒక నివాస భవన సముదాయం సహా తగిన మౌలిక సదుపాయాల స్వరూపాన్ని ఏర్పాటు చేయడమైంది. ఈ సంస్థ లో శిక్షణ ను అందించడాని కి గాను వాటర్ సేనిటేశన్ ఎండ్ హైజీన్ (డబ్ల్యుఎఎస్ హెచ్) సంబంధి సాంకేతికతల కు చెందిన కార్యాచరణ ప్రధానమైనటువంటి, ఇంకా సూక్ష్మ నమూనాల ను కూడా నెలకొల్పడమైంది.

పశ్చిమ బంగాల్ కు చెందిన అత్యంత యోగ్య పుత్రుల లో డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ ఒకరు. జాతీయ సమైక్యత వాదాన్ని బలపరచడం లో ఆయన అగ్రేసరుడు. పారిశ్రామికీకరణ కు ప్రేరణ గా ఆయన నిలచారు. ఆయన ఒక ప్రతిష్ఠిత విద్వాన్ మాత్రమే కాక విద్యారంగ ప్రముఖుడు కూడాను. యూనివర్సిటీ ఆఫ్ కలకత్తా కు అతి చిన్న వయస్సులోనే కులపతి గా కూడా డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ సేవల ను అందించారు. డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ పేరు ను ఈ సంస్థ కు పెట్టడం యావత్తు స్టేక్ హోల్డర్స్ కు ఆయన యొక్క నిజాయతీ, అఖండత ల తాలూకు విలువల ను ఇముడ్చుకొనేందుకు ప్రేరణ ను అందిస్తుండడం తో పాటే సంస్థ యొక్క శ్రమ సంస్కృతి లో నిబద్ధత ను సూచిస్తూ ఆయన కు నిజమైన గౌరవాన్ని ప్రదానం చేసేటటువంటిది అవుతుంది. ఈ సంస్థ ను ప్రధాన మంత్రి 2022 వ సంవత్సరం డిసెంబర్ లో ప్రారంభించారు.

 

***


(Release ID: 1890554) Visitor Counter : 173