సూక్ష్మ, లఘు, మధ్య తరహా సంస్థల మంత్రిత్వ శాఖష్
ఈశాన్య ప్రాంతంలో ఎంఎస్‌ఎంఈల ముఖ్యమైన పాత్రతో పాటు భారతదేశాన్ని స్వయం ఆధారితంగా మార్చడంలో వాటి సహకారాన్ని వివరించిన శ్రీ నారాయణ్ రాణే
Posted On:
09 JAN 2023 8:42PM by PIB Hyderabad
త్రిపురలోని అగర్తలాలో జరిగిన ఈశాన్య ప్రాంతంలో ఎంఎస్‌ఎంఈల స్థిరమైన అభివృద్ధిపై ప్రాంతీయ సదస్సుకు కేంద్ర ఎంఎస్‌ఎంఈ మంత్రి శ్రీ నారాయణ్ రాణేతో పాటు త్రిపుర ముఖ్యమంత్రి ప్రొ. (డా.) మాణిక్ సాహా, కేంద్ర సహాయ మంత్రి శ్రీ భాను ప్రతాప్ సింగ్ వర్మలు అధ్యక్షత వహించారు. మంత్రిత్వ శాఖలోని వివిధ పథకాలపై అవగాహన కల్పించేందుకు ఎంఎస్‌ఎంఈ మంత్రిత్వ శాఖ ఈ సదస్సును నిర్వహించింది. కాన్ఫరెన్స్‌లో శ్రీ నారాయణ్ రాణే ప్రసంగిస్తూ..ఈశాన్య ప్రాంతంలో ఎంఎస్‌ఎంఈల యొక్క ముఖ్యమైన పాత్రను మరియు భారతదేశాన్ని 'స్వయం ఆధారితంగా మార్చడంలో వాటి సహకారాన్ని తెలిపారు. త్రిపుర వ్యవసాయోత్పత్తుల భూమి అని మరియు ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలలో ఎంఎస్‌ఎంఈలకు అపార అవకాశం ఉందని చెప్పారు. ఇప్పటికే ఉన్న పరిశ్రమలను బలోపేతం చేస్తూ ఎంఎస్‌ఎంఈలకు మరిన్ని పర్యాటక అవకాశాలను అభివృద్ధి చేయాలని త్రిపుర ప్రభుత్వానికి సూచించారు.
పారిశ్రామికవేత్తలు ఈ పథకాలను గరిష్టంగా సద్వినియోగం చేసుకోవాలని సహాయ మంత్రి శ్రీ భాను ప్రతాప్ సింగ్ వర్మ కోరారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ముఖ్యమంత్రి నాయకత్వంలో త్రిపుర రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో మరియు అంకితభావంతో కృషి చేసిందని ఆయన అన్నారు. రెండు మంత్రిత్వ శాఖల సమన్వయ ప్రయత్నాలు ఈశాన్య ప్రాంతంలో (ఎన్‌ఈఆర్) ఎంఎస్‌ఎంఈ రంగం అభివృద్ధికి మెరుగైన పర్యావరణ వ్యవస్థను ఖచ్చితంగా సృష్టిస్తాయని ఆయన చెప్పారు.
ఈ సమావేశంలో ఎంఎస్‌ఎంఈ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం మరియు త్రిపుర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన వివిధ కార్యక్రమాలకు ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖులు ప్రారంభించిన వాటిలో ఆర్‌ఏఎంపీ (రైజింగ్ అండ్ ఎక్సెలరేటింగ్ అండ్ ఎంఎస్‌ఎంఈ పెర్ఫామెన్స్ ) పోర్టల్, ఉద్యమం శక్తి కింద ఎన్‌ఈఆర్ పోర్టల్‌ను లింక్ చేయడం, గోమతి సిటీ గ్యాస్ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం, స్పుర్తి పథకం కింద వెస్ట్ త్రిపుర వెదురు మ్యాట్ క్లస్టర్ ప్రారంభోత్సవం మరియు కెవిఐసీ (ఖాదీ & విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్) మరియు టికెవిఐబీ (త్రిపుర ఖాదీ & విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డ్) కొత్త భవనం ప్రారంభోత్సవాలు ఉన్నాయి. విడిపిలు, సీఈఓల కాన్పరెన్స్ వంటి వివిధ కార్యకలాపాల ద్వారా జరిగిన ఈ సమావేశం..ఎన్‌ఈఆర్‌కు చెందిన ఔత్సాహిక/మరియు ప్రస్తుత పారిశ్రామికవేత్తలకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు,సిపిఎస్‌ఈలు మరియు పరిశ్రమల సంఘాల ప్రభుత్వ విభాగాలతో కలవడానికి అవసరమైన వేదికను అందించింది.
దేశంలో ఉపాధి కల్పన మరియు జీవనోపాధిని మెరుగుపరచడంలో ఎంఎస్‌ఎంఈ రంగం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ప్రస్తుతం ఇది 6 కోట్ల యూనిట్లతో 11 కోట్ల మందికి పైగా ఉద్యోగులను కలిగి ఉంది.దేశ జీడీపీలో సుమారు 30% సహకారంతో ఆర్థిక వృద్ధికి గణనీయంగా దోహదపడుతోంది.
మన ఆర్థిక వ్యవస్థపై ఎంఎస్‌ఎంఈల ప్రభావం దృష్ట్యా యువతలో వ్యవస్థాపకతను ప్రోత్సహించడానికి మరియు 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను సాధించడానికి భారత ఆర్థిక వ్యవస్థ అభివృద్ధిలో వారు సమగ్ర పాత్ర పోషించే అనుకూలమైన పర్యావరణ వ్యవస్థను రూపొందించడానికి కేంద్రీకృత ప్రయత్నాలు చేయడం అత్యవసరం.
దేశం ఆర్థిక శ్రేయస్సు కోసం ఎంఎస్‌ఎంఈ రంగాన్ని పెంపొందించడం చాలా ముఖ్యం. ఎంఎస్‌ఎంఈల స్థిరమైన వృద్ధితో పాటు వాటిని శక్తివంతం చేయడానికి అలాగే ప్రపంచ విలువ గొలుసులకు అనుకూలంగా వాటిని మార్చేందుకు ఎంఎస్‌ఎంఈ మంత్రిత్వశాఖ కృషి చేస్తోంది.
***
(Release ID: 1889952)
Visitor Counter : 146