సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఎర్రకోటలో కొత్త సంగీత దృశ్య ప్రదర్శన (లైట్ & సౌండ్ షో) 'జై హింద్' ను రేపు హోం మంత్రి శ్రీ అమిత్ షా ప్రారంభించనున్నారు


प्रविष्टि तिथि: 09 JAN 2023 6:33PM by PIB Hyderabad

ముఖ్యాంశాలు:

 

ఎర్రకోటలో కొత్త సంగీత దృశ్య ప్రదర్శన (లైట్ అండ్ సౌండ్ షో) కి ఏ ఎస్ ఐ  'జై హింద్' అని పేరు పెట్టింది.

ఎర్రకోటలో లైట్ అండ్ సౌండ్ షో 'జై హింద్' హిందీ మరియు ఆంగ్ల భాషలలో ప్రదర్శించబడుతుంది.

ఒక ప్రదర్శన లో మొత్తం 700 మంది షోను వీక్షించవచ్చు

 

ఎర్రకోటలో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న లైట్ అండ్ సౌండ్ షోను రేపు సాయంత్రం హోంమంత్రి శ్రీ అమిత్ షా ప్రారంభించనున్నారు.

 

ఎర్రకోటలో 'జై హింద్' పేరుతో లైట్ అండ్ వి సౌండ్ షో 17వ శతాబ్దం నుండి నేటి వరకు భారతదేశం యొక్క శౌర్య చరిత్ర వారసత్వ సంపద నాటకీయ ప్రదర్శన కొత్త రూపం . మూడు భాగాలుగా విభజించబడిన ఒక గంట నిడివిగల లైట్ అండ్ సౌండ్ షో 'జై హింద్' మరాఠాల ఆవిర్భావం, 1857 స్వాతంత్ర్య సంగ్రామం, భారత జాతీయ సైన్యం ఐ ఎన్ ఎ ట్రయల్స్‌తో సహా భారతదేశ చరిత్ర నుండి కీలకమైన సంఘటనలకు జీవం పోస్తుంది. ప్రొజెక్షన్ మ్యాపింగ్, లైవ్ యాక్షన్ ఫిల్మ్‌లు,  నటులు, నాట్యలు మరియు తోలుబొమ్మలు అన్ని రకాల ప్రదర్శన కళలను ఉపయోగించడం ద్వారా లీనమయ్యే సంగీత దృశ్య ప్రదర్శన. స్వాతంత్ర్యం పోరాటం మరియు గత 75 ఏళ్లలో భారతదేశ నిరంతర పురోగతి కోసం సాగిన ప్రస్థాన దృశ్య ప్రదర్శన. 3-భాగాల ఈ ప్రదర్శన నౌబత్ఖానా నుండి దీవాన్-ఇ-ఆమ్ నుండి దీవాన్-ఎ-ఖాస్ వరకు ఎర్రకోటలోని వివిధ స్మారక చిహ్నాలలో ప్రదర్శించబడుతుంది.

 

ఈ కార్యక్రమం సాధారణ ప్రజలకు ఇంగ్లీష్ మరియు హిందీ భాషలలో ప్రదర్శించబడుతుంది, 700 మంది సీటింగ్ ఏర్పాటుతో ఒక్కసారి వీక్షించవచ్చు.

 

దాదాపు 1 గంట నిడివి గల ఈ సుందర దృశ్య సంగీత ప్రదర్శన ఇంటరాక్టివ్ టెక్నిక్‌ల ద్వారా భారతదేశం యొక్క గొప్ప చరిత్ర మరియు వారసత్వాన్ని కొత్త తరాలకు అందించటానికి చేసే  దృశ్య  సాంస్కృతిక విందు.

 

దాదాపు 5 సంవత్సరాల విరామం తర్వాత ఎర్రకోటలో లైట్ అండ్ సౌండ్ షో మళ్లీ ప్రారంభం కానుంది.

 

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా, భారత పురావస్తు శాఖ ఇప్పటికే ఎర్రకోటలో యాద్-ఎ-జలియన్ మ్యూజియం, 1857- భారతదేశ మొదటి స్వాతంత్ర్య సంగ్రామానికి సంబంధించిన మ్యూజియం, ఆజాదీ కే దివానే మరియు నేతాజీ సుభాష్ చంద్రబోస్ మ్యూజియం  అనే 4 మ్యూజియంలను ప్రారంభించింది. ఇప్పుడు కొత్తగా లైట్ అండ్ సౌండ్ షో జోడించడం వల్ల సందర్శకులలో దేశభక్తి జాతీయ గర్వ స్పూర్తి మరింత బలపడుతుంది.

 

ఇటీవలి సంవత్సరాలలో మన దేశం 100 కోట్ల టీకాలు వేయడం లేదా 75 సంవత్సరాల స్వాతంత్ర్య వేడుకల సందర్భంగా  ప్రకాశవంతమైన కాంతి అలంకరణ మరియు జీ 20 ప్రతినిధులకు ఆతిధ్యం సంధర్భంగా  దేశవ్యాప్తంగా ఉన్న స్మారక చిహ్నాలు మరియు ప్రదేశాలను సుందరీకరణ తో సందర్శకుల అనుభవాన్ని మెరుగుపరచటం  ద్వారా ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా  నిరంతరం పని చేస్తోంది.

***


(रिलीज़ आईडी: 1889951) आगंतुक पटल : 190
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Marathi , Tamil , Urdu , हिन्दी , Punjabi