ప్రధాన మంత్రి కార్యాలయం

పదిహేడో ప్రవాసి భారతీయ దివస్ సందర్భం లో సురినామ్ అధ్యక్షుని తో సమావేశమైనప్రధాన మంత్రి

Posted On: 09 JAN 2023 4:58PM by PIB Hyderabad

ఇందౌర్ లో పదిహేడో ప్రవాసి భారతీయ దివస్ (పిబిడి) సందర్భం లో సురినామ్ అధ్యక్షుడు శ్రీ చంద్రికా ప్రసాద్ సంతోఖీ తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న సమావేశమయ్యారు. అధ్యక్షుడు శ్రీ సంతోఖీ 2023 జనవరి 7 తేదీ మొదలుకొని 14వ తేదీ వరకు భారతదేశం లో ఆధికారికం గా పర్యటిస్తున్నారు. అంతేకాకుండా, పదిహేడో ప్రవాసీ భారతీయ దివస్ కార్యక్రమాని కి ఆయన ఒక విశిష్ఠ గౌరవ అతిథి గా కూడా ఉన్నారు.

ఉభయ నేత లు వారి యొక్క సమావేశం లో హైడ్రోకార్బన్స్, రక్షణ, సముద్ర సంబంధి సురక్ష, డిజిటల్ ఇనిశియేటివ్స్ ఎండ్ ఐసిటి మరియు సామర్థ్య నిర్మాణం సహా పరస్పరం ప్రయోజనకారి రంగాల లో సహకారం అనే అంశం పై చర్చలు జరిపారు.

సురినామ్ లైన్స్ ఆఫ్ క్రెడిట్ ను అందుకొన్న నేపథ్యం లో సురీనామ్ తాలూకు రుణాల ను భారతదేశం పున: వ్యవస్థీకరించడాన్ని సురినామ్ ప్రశంసించింది.

రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము తో అధ్యక్షుడు శ్రీ సంతోఖీ చర్చల ను జరపడం తో పాటు గా 2023 జనవరి 10వ తేదీ నాడు పిబిడి సమాపక సమావేశాని కి మరియు ప్రవాసి భారతీయ సమ్మాన్ పురస్కార ప్రదాన కార్యక్రమాని కి కూడా ఆయన హాజరు కానున్నారు. ఇందౌర్ లో గ్లోబల్ ఇన్ వెస్టర్స్ సమిట్ ప్రారంభిక కార్యక్రమం లో కూడా ఆయన పాలుపంచుకొంటారు. ఆ తరువాత ఆయన అహమదాబాద్ ను మరియు న్యూ ఢిల్లీ ని సందర్శించనున్నారు.

 

***



(Release ID: 1889831) Visitor Counter : 173