వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

13వ ఇండియా-యూఎస్ ట్రేడ్ పాలసీ ఫోరమ్‌లో పాల్గొనేందుకు అమెరికా పర్యటనలో మంత్రి శ్రీ పీయూష్ గోయల్


- 9-11 జనవరి 2023 మధ్య న్యూయార్క్, వాషింగ్టన్ డీసీ నగరాలలో పర్యటించనున్న మంత్రి

- యు.ఎస్.టి.ఆర్ రాయబారి కేథరీన్ తాయ్‌తో సమావేశం కానున్న శ్రీ పీయూష్ గోయల్

- అమెరికా వాణిజ్య కార్యదర్శి గినా రైమోండోతో ద్వైపాక్షిక సమావేశం కానున్న మంత్రి

- సీఈఓలు, వ్యాపార ప్రముఖులు, థింక్ ట్యాంకులతోనూ వాణిజ్య భేటీ

- న్యూయార్క్‌ నగరంలో లోని థింక్ ట్యాంకులు వివిధ పరిశ్రమల సందర్శన

- రెండు దేశాల మధ్య మరింత వాణిజ్య మరియు పెట్టుబడి సంబంధాలను పెంపొందించేలా పర్యటన

Posted On: 08 JAN 2023 12:56PM by PIB Hyderabad

కేంద్ర వాణిజ్యం మరియు పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ భారతదేశం - యూఎస్ ట్రేడ్ పాలసీ ఫోరమ్‌లో పాల్గొనేందుకు గాను 9-11 జనవరి, 2023 మధ్య న్యూయార్క్, వాషింగ్టన్ డీసీ నగరాలలో అధికారిక పర్యటన చేయనున్నారు. పర్యటన భాగంగా మంత్రి తొలత ప్రఖ్యాత బహుళజాతి సంస్థల సీఈఓలతో సంభాషిస్తారు. కమ్యూనిటీ ఈవెంట్‌లో పాల్గొంటారు. వ్యాపార నాయకులతో రౌండ్‌టేబుల్ సమావేశాలలో పాల్గొంటారు.  థింక్ ట్యాంక్లు మరియు న్యూయార్క్‌లోని పరిశ్రమలను సందర్శిస్తారు. పర్యటనలో భాగంగా మంత్రి  11 జనవరి 2023న వాషింగ్టన్ డీసీ నగరంలో  జరిగే 13వ వాణిజ్య విధాన ఫోరమ్ (టీపీఎఫ్) సమావేశానికి హాజరవుతారు. ప్రతినిధి స్థాయి చర్చలకు ముందు అతను యూ.ఎస్.టీ.ఆర్ రాయబారి కేథరీన్ తాయ్‌తో సమావేశం అవుతారు.  నాలుగేళ్ల విరామం తర్వాత 12వ TPF మంత్రివర్గ సమావేశం 23 నవంబర్ 2021న న్యూఢిల్లీలో జరిగింది. ఈ సమావేశం అనంతరం నుంచి మంత్రివర్గం తర్వాత కార్యవర్గాలు మళ్లీ క్రియాశీలమయ్యాయి. టీపీఎప్ అనేది వాణిజ్య రంగంలో రెండు దేశాల మధ్య నిరంతర నిశ్చితార్థానికి,  రెండు దేశాల మధ్య వాణిజ్యం పెట్టుబడి సంబంధాలను మరింత ముందుకు తీసుకెళ్లడానికి సంబంధించి ఒక వేదిక. ఇరు దేశాలు ఈ సమావేశం కోసం ఎదురుచూస్తున్నాయి మరియు వాణిజ్య సమస్యల సాధన విషయమై పురోగతి సాధిస్తామని ఇరు దేశాల వారు విశ్వాసం వ్యక్తం చేశారు. టీపీఎఫ్ సమావేశానికి భారతదేశం వైపు నుండి వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రి , అమెరికా వైపు నుండి యు.ఎస్.టి.ఆర్ అధ్యక్షత వహిస్తారు. వాషింగ్టన్ డీసీలో అమెరికా వాణిజ్య కార్యదర్శి గినా రైమోండోతో కూడా మంత్రి ద్వైపాక్షిక సమావేశం నిర్వహించనున్నారు. పరిశ్రమలకు చెందిన కొంతమంది అధినేతలతో కూడా మంత్రి  ముచ్చటించనున్నారు. భారతదేశం మరియు అమెరికా రెండూ సహజ భాగస్వాములు మరియు వాణిజ్య పరిపూరకాలు. దీర్ఘకాల వ్యూహాత్మక మరియు ఆర్థిక సంబంధాలు, ప్రజలతో సంబంధాలు కలిగి ఉన్నాయి. రెండూ శక్తివంతమైన ప్రజాస్వామ్యాలు కూడా. రెండు దేశాలు కూడా క్వాడ్, ఐ2యు2 (ఇండియా-ఇజ్రాయెల్/ యూఏఈ-అమెరికా) మరియు ఐపీఈఎఫ్ (ఇండో-పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్‌వర్క్) కింద సహకరించుకుంటున్నాయి. విస్తరిస్తున్న ద్వైపాక్షిక నిశ్చితార్థంలో నాయకత్వ స్థాయిలో రెగ్యులర్ ఎక్స్ఛేంజీలు అంతర్భాగంగా ఉన్నాయి. ఈ సందర్శనల నుండి వెలువడుతున్న ఫలితాలు రెండు దేశాల మధ్య బహుముఖ సంబంధాలను మరింత బలోపేతం చేయడంలో కీలకంగా నిలుస్తాయి.

*******



(Release ID: 1889734) Visitor Counter : 166