రైల్వే మంత్రిత్వ శాఖ
5 స్టార్ రేటింగ్ తో వారణాసి కంటోన్మెంట్ రైల్వే స్టేషన్ కు ఎఫ్ఎస్ఎస్ఏఐ 'ఈట్ రైట్ స్టేషన్' సర్టిఫికెట్ ప్రధానం ప్రయాణికులకు ప్రమాణాల మేరకు సురక్షితమైన మరియు పరిశుభ్రమైన ఆహారం అందిస్తున్న రైల్వే స్టేషన్లకు 'ఈట్ రైట్ స్టేషన్' సర్టిఫికేషన్ ను ప్రదానం చేస్తున్న ఎఫ్ఎస్ఎస్ఏఐ
ప్రయాణీకులకు స్టేషన్ లో సురక్షితమైన మరియు పరిశుభ్రమైన ఆహారం లభిస్తుంది అని 5-స్టార్ రేటింగ్ నిర్ధారిస్తుంది.
Posted On:
05 JAN 2023 4:36PM by PIB Hyderabad
5 స్టార్ రేటింగ్ తో వారణాసి కంటోన్మెంట్ రైల్వే స్టేషన్ కు ఎఫ్ఎస్ఎస్ఏఐ 'ఈట్ రైట్ స్టేషన్' సర్టిఫికెట్ లభించింది. ప్రయాణికులకు నాణ్యమైన, పోషకమైన ఆహారం అందించినందుకు వారణాసి కంటోన్మెంట్ రైల్వే స్టేషన్ 5 స్టార్ 'ఈట్ రైట్ స్టేషన్' సర్టిఫికేషన్ పొందింది.నిర్ణయించిన ప్రమాణాల మేరకు ఆహార పదార్థాలు నిల్వ చేసి ప్రయాణీకులకు సురక్షితమైన మరియు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందిస్తున్న రైల్వే స్టేషన్లకు 'ఈట్ రైట్ స్టేషన్' సర్టిఫికెట్ ను ఎఫ్ఎస్ఎస్ఏఐ అందిస్తోంది. ఎఫ్ఎస్ఎస్ఏఐ నియమించి, గుర్తించిన స్వతంత్ర ఏజెన్సీ అధ్యయనం నిర్వహించి 1 నుంచి 5 వరకు ఇచ్చే రేటింగ్ ఆధారంగా సర్టిఫికెట్ ప్రదానం చేయడానికి స్టేషన్లను ఎంపిక చేయడం జరుగుతుంది. 5 స్టార్ రేటింగ్ పొందిన స్టేషన్లలో ప్రయాణికులకు ప్రమాణాల మేరకు సురక్షితమైన మరియు పరిశుభ్రమైన ఆహారం అందుబాటులో ఉంటుందని నిర్ధారణ అవుతుంది.
దేశ ప్రజలందరికి సురక్షితమైన ఆరోగ్యకర ఆహారం అందుబాటులో ఉంచేలా చూసేందుకు 'ఈట్ రైట్ ఇండియా' కార్యక్రమాన్ని ఎఫ్ఎస్ఎస్ఏఐ అమలు చేస్తోంది. దేశ ఆహార వ్యవస్థలో సమూల మార్పులు తెచ్చి లక్ష్యాన్ని సాధించాలని నిర్ణయించారు. పర్యావరణహిత విధానాలతో ప్రజలకు సురక్షిత ఆరోగ్యకర ఆహారం అందుబాటులో వచ్చేలా చూసేందుకు నియంత్రణ విధానాలు, సామర్ధ్య మెరుగుదల,సహకారం, సాధికారత విధానాలు అమలు జరుగుతున్నాయి.
ఆనంద్ విహార్ టెర్మినల్ రైల్వే స్టేషన్ (ఢిల్లీ); ఛత్రపతి శివాజీ టెర్మినస్ (ముంబై); ముంబై సెంట్రల్ రైల్వే స్టేషన్, (ముంబై); వడోదర రైల్వే స్టేషన్, చండీగఢ్ రైల్వే స్టేషన్ మరియు భోపాల్ రైల్వే స్టేషన్ లకు కూడా స్టార్ సర్టిఫికేషన్ లభించింది.
***
(Release ID: 1889098)
Visitor Counter : 172