ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ

15వ ఆర్థిక సంఘం (2022-23 నుంచి 2025-26) మిగిలిన కాలానికి రూ.12,882.2 కోట్ల వ్యయంతో ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ పథకాలను కొనసాగించడానికి మంత్రివర్గం ఆమోదం

Posted On: 05 JAN 2023 4:09PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం 15వ ఆర్థిక సంఘం (2022-23 నుంచి 2025-26) మిగిలిన కాలానికి రూ.12882.2 కోట్ల వ్యయంతో ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ పథకాలను కొనసాగించడానికి ఆమోదం తెలిపింది.

ఎక్స్పెండిచర్ ఫిల్నెన్స్ కమిటీ (ఇఎఫ్ సి) సిఫారసుల ఆధారంగా ఈశాన్య ప్రాంత ప్రత్యేక మౌలిక సదుపాయాల పథకం (ఎన్ ఇ ఎస్ ఐ డి ఎస్) కోసం కొనసాగుతున్న ప్రాజెక్ట్‌ల  వ్యయం సహా రూ 8139.5 కోట్లు కేటాయిస్తారు.

ఎన్ ఇ సి పథకాలకు కేటాయింపు కొనసాగుతున్న ప్రాజెక్టుల బాధ్యతలతో సహా రూ.3202.7 కోట్లు. అస్సాంలో బిటిసి, డిహెచ్ఎటిసి, కెఎఎటిసిలకు ప్రత్యేక ప్యాకేజీల కోసం కేటాయింపు రూ .1540 (బిటిసి - 500 కోట్లు, కెఎఎటిసి - 750 కోట్లు, బిటిసి, డిహెచ్ఎటిసి అండ్ కెఎఎటిసి ల పాత ప్యాకేజీలు - 290 కోట్లు) కోట్లు. 100% కేంద్ర నిధులతో కేంద్ర రంగ పథకమైన ఎన్.ఇ.ఎస్.ఐ.డి.ఎస్ ను ఎన్.ఇ.ఎస్.ఐ.డి.ఎస్ (రోడ్లు) ,ఎన్.ఇ.ఎస్.ఐ.డి.ఎస్ (రహదారి మౌలిక సదుపాయాలు కాకుండా) అనే రెండు భాగాలతో పునర్నిర్మించారు -

మంత్రిత్వ శాఖ కొత్త పథకం "ఈశాన్య ప్రాంతం కోసం ప్రధానమంత్రి అభివృద్ధి చొరవ - పిఎం-డివైన్" (రూ.6,600 కోట్ల వ్యయంతో) 2022 అక్టోబర్-2022 లో విడిగా ఆమోదించబడింది, దీని కింద మౌలిక సదుపాయాలు, సామాజిక అభివృద్ధి , జీవనోపాధి రంగాల కింద పెద్ద అధిక ప్రభావ ప్రతిపాదనలు తీసుకోబడ్డాయి.

ఒక వైపు వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాలు చేస్తున్న ప్రయత్నాలకు ,మరోవైపు ఈశాన్య ప్రాంత రాష్ట్రాల అవసరాల దృష్ట్యా చేపట్టని అభివృద్ధి / సంక్షేమ కార్యకలాపాల కోసం అనుబంధంగా ఎండిఓఎన్ఇఆర్ పథకాలను ఉద్దేశించారు. ఎమ్ డిఓఎన్ ఇఆర్ పథకాలు ఎనిమిది ఈశాన్య రాష్ట్రాలకు వాటి అవసరాలకు అనుగుణంగా అంతరం పూడ్చే మద్దతును అందించడానికి సహాయపడతాయి - ఉదా. అనుసంధానం, సామాజిక రంగ లోటులను తగ్గించడానికి మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం, ఈ ప్రాంతంలో జీవనోపాధి , ఉపాధి అవకాశాలను పెంచడం.

15వ ఆర్థిక సంఘం మిగిలిన కాలపరిమితికి అంటే 2025-26 ఆర్థిక సంవత్సరం వరకు ఆమోదం పొందిన పథకాలు …

ప్రాజెక్ట్ ఎంపిక పరంగా పథకాల అమలుకు మెరుగైన ప్రణాళికను అందించడం ,

ప్రాజెక్టుల మంజూరు ఫ్రంట్ లోడింగ్, మరియు

పథకం కాలంలో ప్రాజెక్ట్ అమలు

2025-26 నాటికి గరిష్ట సంఖ్యలో ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ప్రయత్నాలు చేస్తారు. తద్వారా సంవత్సరం దాటాక నిబద్ధత కలిగిన బాధ్యతలు కనీసంగా ఉంటాయి. అందువల్ల, పథకాలకు ప్రధానంగా 2022-23 ,2023-24 లో కొత్త ఆంక్షలు ఉంటాయి; 2024-25, 2025-26 సంవత్సరాల్లో కూడా ఈ ఖర్చు కొనసాగుతుంది. ప్రస్తుతం మంజూరైన ప్రాజెక్టులను పూర్తి చేయడంపై దృష్టి సారించనున్నారు.

స్వావలంబన భారతదేశం కోసం ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ ఐదు మూలస్తంభాలు, అంటే ఆర్థిక వ్యవస్థ, మౌలిక సదుపాయాలు, వ్యవస్థ, వైబ్రెంట్ డెమోగ్రఫీ , డిమాండ్ ఈ పథకం ద్వారా ఊపందుకుంటాయి.

ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్ద పీట వేసింది. గత ఎనిమిదేళ్లలో ఈశాన్య ప్రాంతాన్ని ప్రధాని 50 సార్లు సందర్శించగా, 74 మంది మంత్రులు ఈశాన్య ప్రాంతాన్ని 400కు పైగా సార్లు సందర్శించారు.

ఈశాన్య ప్రాంతం గతంలో అశాంతి, బాంబు పేలుళ్లు, బంద్ లకు ప్రసిద్ధి చెందింది, కానీ గత ఎనిమిది సంవత్సరాలలో, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో శాంతి నెలకొంది.

తిరుగుబాటు సంఘటనలు 74% తగ్గాయి, భద్రతా దళాలపై దాడుల సంఘటనలు 60% తగ్గాయి. పౌరుల మరణాలు 89% తగ్గాయి. సుమారు 8,000 మంది యువకులు లొంగిపోయి ప్రధాన స్రవంతిలో చేరారు, తమకు, తమ కుటుంబాలకు మంచి భవిష్యత్తును స్వాగతిస్తున్నారు.

నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ త్రిపురతో 2019లో ఒప్పందం, 2020లో బి ఆర్ యు- బోడో ఒప్పందం, 2021లో కర్బీ ఒప్పందం కుదుర్చుకున్నాయి. అస్సాం-మేఘాలయ, అస్సాం-అరుణాచల్ సరిహద్దు వివాదాలు కూడా దాదాపు సమసిపోయాయి, శాంతి పునరుద్ధరణతో ఈశాన్య ప్రాంతం అభివృద్ధి పథంలో పయనిస్తోంది. 2014 నుంచి ఈ ప్రాంతానికి బడ్జెట్ కేటాయింపులు భారీగా పెరిగాయి. 2014 నుంచి ఇప్పటి వరకు ఈ ప్రాంతానికి రూ.4 లక్షల కోట్లు పైగా కేటాయించారు.

గత నాలుగు సంవత్సరాలలో ఎమ్ డి ఒ ఎన్ ఆర్ పథకాల కింద వాస్తవ వ్యయం రూ .7534.46 కోట్లు కాగా, 2025-26 వరకు వచ్చే నాలుగేళ్లలో ఖర్చు కోసం అందుబాటులో ఉన్న నిధులు రూ .19482.20 కోట్లు (సుమారు 2.60 రెట్లు)

ఈ ప్రాంతంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం భారీ ప్రయత్నాలు

చేపట్టడం జరిగింది. కనెక్టివిటీని మెరుగుపరచడం పై ప్రధానంగా ప్రధాన దృష్టి పెట్టారు.

2014 నుంచి రైల్వే కనెక్టివిటీని మెరుగుపరిచేందుకు రూ.51,019 కోట్లు ఖర్చు చేశారు. రూ.77,930 కోట్ల విలువైన 19 కొత్త ప్రాజెక్టులు మంజూరయ్యాయి.

2009-14లో సగటు వార్షిక బడ్జెట్ కేటాయింపులు రూ.2,122 కోట్లతో పోలిస్తే, గత 8 ఏళ్లలో సగటు వార్షిక బడ్జెట్ కేటాయింపుల్లో 370% పెరుగుదల కనిపించింది. మొత్తం కేటాయింపు రూ 9,970 కోట్లు.

రోడ్డు అనుసంధానాన్ని మెరుగుపరచడం కోసం రూ.1.05 లక్షల కోట్ల విలువైన 375 ప్రాజెక్టులు అమలులో ఉన్నాయి. వచ్చే మూడేళ్లలో 209 ప్రాజెక్టుల కింద 9,476 కిలోమీటర్ల రోడ్లు వేయనున్నారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం రూ.1,06,004 కోట్లు ఖర్చు చేస్తోంది.

విమాన అనుసంధానం కూడా భారీగా మెరుగుపడింది. ఈశాన్య భారతంలో 68 ఏళ్లలో కేవలం 9 విమానాశ్రయాలు ఉండగా, ఆ సంఖ్యగత 8 ఏళ్ల స్వల్ప వ్యవధి లో 17 కు పెరిగింది.

2014 నుంచి ఈశాన్య భారతంలో విమాన రాకపోకలు 113 శాతం పెరిగాయి. విమాన అనుసంధానానికి మరింత ఊతమిచ్చేందుకు ఈశాన్య ప్రాంతంలో పౌర విమానయాన రంగంలో రూ.2,000 కోట్లు పెట్టుబడి పెట్టనున్నారు.

టెలికాం కనెక్టివిటీని మెరుగుపరచడం కోసం 2014 నుంచి 10 శాతం జీబీఎస్ కింద రూ.3466 కోట్లు ఖ ర్చు చేయడం

జరిగింది. ఎన్ ఇ ఆర్ లోని 4,525 గ్రామాలకు 4జీ కనెక్టివిటీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. 2023 చివరి నాటికి ఈ ప్రాంతంలో పూర్తి టెలికాం కనెక్టివిటీని అందించడానికి కేంద్ర ప్రభుత్వం 500 రోజుల లక్ష్యాన్ని నిర్దేశించింది.

జలమార్గాలు ఈశాన్య రాష్ట్రాల జీవనం, సంస్కృతిలో అంతర్భాగం. ఈ ప్రాంతంలో ఈ ముఖ్యమైన రంగాన్ని అభివృద్ధి చేయడానికి ప్రధాని మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోంది.

2014 కు ముందు ఎన్.ఇ.ఆర్ లో ఒక్క జాతీయ జలమార్గం మాత్రమే ఉండేది. ఇప్పుడు ఎన్.ఇ.ఆర్ లో 18 జాతీయ జలమార్గాలు ఉన్నాయి. జాతీయ జలమార్గం 2, జాతీయ జలమార్గం 16 అభివృద్ధికి ఇటీవల రూ.6000 కోట్లు మంజూరు చేశారు.

ఎన్ ఇ ఆర్ లో నైపుణ్యాభివృద్ధి మౌలిక సదుపాయాలను పెంపొందించడానికి ప్రస్తుత ప్రభుత్వ ఐ టి ఐ లను మోడల్ ఐ టి ఐ లుగా అప్ గ్రేడ్ చేయడానికి 2014-2021 మధ్య సుమారు రూ.190 కోట్లు ఖర్చు చేశారు., కొత్తగా 193 నైపుణ్యాభివృద్ధి సంస్థలను ఏర్పాటు చేశారు. నైపుణ్యాభివృద్ధికి రూ.81.83 కోట్లు ఖర్చు చేశారు. వివిధ పథకాల కింద మొత్తం 16,05,801 మందికి నైపుణ్యం కల్పించారు.

ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల అభివృద్ధికి ఊతమివ్వడం కోసం వివిధ ప థ కాల కింద ఎంఎస్ ఎం ఇ లను

ప్రోత్సహించారు. 978 యూనిట్ల ఏర్పాటుకు రూ.645.07 కోట్లు ఖర్చు చేశారు. డిపిఐఐటి ప్రకారం, ఈశాన్యం నుండి 3,865 స్టార్టప్ లు నమోదు అయ్యాయి.

ఆరోగ్య మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం గత కొన్ని సంవత్సరాలుగా కీలక దృష్టిగా ఉంది. ఆరోగ్య రంగానికి 2014-15 నుంచి ప్రభుత్వం రూ.31,793.86 కోట్లు ఖర్చు చేసింది.

క్యాన్సర్ తృతీయ సంరక్షణ పథకాన్ని బలోపేతం చేయడం కింద 19 ప్రభుత్వ క్యాన్సర్ సంస్థలు ,20 తృతీయ సంరక్షణ క్యాన్సర్ కేంద్రాలు ఆమోదించబడ్డాయి.

గత 10 సంవత్సరాలుగా, ఈ ప్రాంతంలో విద్యా మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి ప్రయత్నాలు జరిగాయి.

2014 నుంచి ఇప్పటి వరకు ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్నత విద్యను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం రూ.14,009 కోట్లు ఖర్చు చేసింది. కొత్తగా 191 ఉన్నత విద్యా సంస్థలను ఏర్పాటు చేశారు. 2014 నుండి ఏర్పాటు చేసిన విశ్వవిద్యాలయాల సంఖ్యలో 39% పెరుగుదల ఉంది. 2014-15 నుంచి కేంద్ర ఉన్నత విద్యా సంస్థల్లో 40 శాతం పెరుగుదల నమోదైంది.

ఫలితంగా, ఉన్నత విద్యలో మొత్తం విద్యార్థుల నమోదులో 29% పెరుగుదల ఉంది.

ఈ ప్రాంతంలో అభివృద్ధికి మరింత ఉతం ఇచ్చేందుకు విద్యుత్ మౌలిక సదుపాయాలను పటిష్టం చేశారు. 2014-15 నుంచి ఇప్పటి వరకు రూ.37,092 కోట్లు మంజూరు చేయగా, అందులో రూ.10,003 కోట్లు ఖర్చు చేశారు.

నార్త్ ఈస్ట్ గ్యాస్ గ్రిడ్ (ఎన్ ఇ జి జి) ప్రాజెక్టు రూ.9,265 కోట్లతో అమలు జరుగుతోంది. ఇది ఈశాన్య ప్రాంత ఆర్థిక వ్యవస్థను మెరుగు పరస్తుంది.

అరుణాచల్ ప్రదేశ్ లోని సరిహద్దు గ్రామాలలో వెలుగులు నింపడం కోస

ప్రధాన మంత్రి 550 కోట్ల రూపాయల ప్యాకేజీని ప్రకటించారు.

తొలిసారిగా జిల్లా స్థాయి ఎస్ డి జి ఇండెక్స్ ను ఏర్పాటు చేశారు. ఎస్ డి జి ఇండెక్స్ రెండవ వెర్షన్ సిద్ధంగా ఉంది.  త్వరలో విడుదల కానుంది.

 

***********



(Release ID: 1889010) Visitor Counter : 161