గనుల మంత్రిత్వ శాఖ
త్రైపాక్షిక వేతన ఒప్పందం పై సంతకం చేసిన - హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్
Posted On:
04 JAN 2023 2:59PM by PIB Hyderabad
కేంద్ర గనుల మంత్రిత్వ శాఖకు చెందిన ప్రథమ శ్రేణి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ, మినీ రత్న, హిందుస్తాన్ కాపర్ లిమిటెడ్ సంస్థ, కార్మికుల వేతనాలు, అలవెన్సుల సవరణ కోసం, కోల్ కతా లోని డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ (సెంట్రల్), శ్రీమతి రూప భరత్ సమక్షంలో 2023 జనవరి, 3వ తేదీన త్రైపాక్షిక 8వ వేతన ఒప్పందంపై సంతకం చేసింది.
2017 నవంబర్, 1వ తేదీ నుండి 10 సంవత్సరాల కాలపరిమితికి సంబంధించిన ఈ వేతన ఒప్పందంపై - చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ అరుణ్ కుమార్ శుక్లా; డైరెక్టర్ (ఆపరేషన్స్) సంజయ్ పంజీర్; డైరెక్టర్ (మైనింగ్) శ్రీ సంజీవ్ కుమార్ సింగ్; డైరెక్టర్ (ఫైనాన్స్) శ్రీ ఘనశ్యామ్ శర్మ; హిందుస్తాన్ కాపర్ లిమిటెడ్ సీనియర్ అధికారులతో పాటు, రాజస్థాన్ లోని కె.సి.సి. యూనిట్ (ఏ.ఐ.టి.యు.సి); మధ్యప్రదేశ్ లోని ఎం.సి.పి. యూనిట్ (బి.ఎం.ఎస్); జార్ఖండ్ లోని ఐ.సి.సి. యూనిట్ (ఏ.ఐ.టి.యు.సి); మహారాష్ట్ర లోని టి.సి.పి. యూనిట్ (ఐ.ఎన్.టి.యు,సి); కోల్‌కతా లోని కార్పొరేట్ కార్యాలయం (ఐ.ఎన్.టి.టి.యు,సి) గుర్తింపు పొందిన కార్మిక సంఘాల ప్రతినిధులు సంతకాలు చేశారు.
*****
(Release ID: 1888775)
Visitor Counter : 110