సూక్ష్మ, లఘు, మధ్య తరహా సంస్థల మంత్రిత్వ శాఖష్
ప్రయాణీకుల లగేజీని మరింత క్షుణ్ణంగా పరిశీలించే ఇంటెలిజెంట్ ట్రే రిట్రీవింగ్ సిస్టం (ఐటిఆర్ఎస్)ను వర్చువల్ గా ప్రారంభించిన కేంద్ర మంరతి శ్రీ నారాయన్ రాణే మేడ్ ఇన్ ఇండియా సాంకేతిక పరిజ్ఞానం ప్రాధాన్యతను నొక్కిచెప్పిన మంత్రి
Posted On:
04 JAN 2023 6:03PM by PIB Hyderabad
కేంద్ర ఎం.ఎస్.ఎం.ఇ శాఖ మంత్రి శ్రీ నారాయణ్ రాణే, మెస్సర్స్ ఎస్.జె.కె ఇన్నొవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ తయారు చేసిన
ఇంటెలిజెంట్ ట్రే రిట్రీవల్ సిస్టమ్ (ఐటిఆర్ఎస్ )ను వర్చువల్గా ప్రారంభించారు. ఈ కంపెనీ ఎం.ఓ.పి.ఎ (గోవా) అంతర్జాతీయ
విమానాశ్రయంలో గల ఎం.ఎస్.ఎం.ఇ మేక్ ఇన్ ఇండియా కంపెనీ.
ఇంటెలిజెంట్ ట్రే రిట్రీవల్ సిస్టమ్ (ఐటిఆర్ఎస్) అనేది కృత్రి మ మేథ ఆధారితంగా పనిచేసే పూర్తి ఆటో మేటిక్ యంత్రం.
ఇది అధునాతన స్క్రీనింగ్ సాంకేతిక పరిజ్క్షానంతో ప్రయాణీకులకు మరింత భద్రతను కల్పిస్తుంది. ఈ యంత్రంలో
ఇమేజ్ అనాలసిస్ సాఫ్ట్వేర్ అమర్చారు. అలాగే అధునాతన ఉపకరణాలు ఉన్నాయి. దీని సహాయంతో ప్రతి బ్యాగేజ్
విషయంలో స్క్రీనర్ సరైన నిర్ణయం తీసుకోవడానికి వీలు కలుగుతుంది. ఫలితంగా ప్రయాణికుల లగేజిని వేగంగా, సులభంగా
తనిఖీ చేయడానకి వీలుకలుగుతుంది.
ఈ సందర్భంగా మాట్లాడుతూ శ్రీ రాణే, “గోఆలో ప్రపంచశ్రేణి మౌలిక సదుపాయాలతో , రవాణా సదుపాయాలతో ప్రధాన
విమానాశ్రయం నిర్మించాలని మేము ఎన్నో సంవత్సరాలుగా డిమాండ్ చేస్తున్నాం. 2022 డిసెంబర్ 11న ప్రధానమంత్రి
శ్రీ నరేంద్రమోదీజీ గోవాలో ఎం.ఒ.పి.ఎ వద్ద దివంగత శ్రీ మనోహర్ పారికర్ గారి పేరుమీద
ఈ విమానాశ్రయాన్ని ప్రారంభించారు. మరో సంతోషకరమైన విషయం ఏమంటే, ఎం.ఒ.పి.ఎ వద్ద ఏర్పాటైన ఐటిఆర్ఎస్ వ్యవస్థ
ఒక ఎం.ఎస్.ఎం.ఇ కంపెనీ భారతదేశంలోనే తయారు చేసింది కావడం. అంతేకాదు, ఇండియాలోనే దీనికి పేటెంట్ తీసుకోవడం సంతోషించదగ్గ విషయం.
ఇది మనకు రెండు విధాల గర్వకారణం, సంతోషదాయకమైన సందర్భం ”అని ఆయన అన్నారు.
***
(Release ID: 1888737)
Visitor Counter : 139